కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. అల్గునూర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న ఈ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. బస్సు డ్రైవర్ ప్రశాంత్ చాకచక్యంతో, తృటిలో పెను ప్రమాదం తప్పింది; డ్రైవర్‌తో సహా బస్సులో ఉన్న మొత్తం 42 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణలో బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. బస్సు పెట్రోల్ బంక్ వద్ద ఆగిపోయినప్పుడు డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ డోర్ పగులగొట్టి ప్రయాణీకులను కిందకు దింపారు. అనంతరం, బస్సును పెట్రోల్ బంక్ నుండి వంద మీటర్ల దూరం తీసుకెళ్ళి నిలిపివేశారు. బస్సు మంచి కండిషన్‌లోనే ఉందని, ఒక్కసారిగా బ్యాటరీ నుండి మంటలు రావడంతో బస్సును నిలిపివేసినట్లు డ్రైవర్ తెలిపారు. బస్సు నుండి ఎగిసిపడిన మంటల ధాటికి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ హై టెన్షన్ వైర్లు కాలి కింద పడిపోయాయి. అయితే, వెంటనే పవర్ సప్లై నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు అధికారులను ఆదేశించారు. బ్యాటరీ లోపం వల్లా లేక మరేదైనా కారణంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. అల్గునూర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న ఈ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. బస్సు డ్రైవర్ ప్రశాంత్ చాకచక్యంతో, తృటిలో పెను ప్రమాదం తప్పింది; డ్రైవర్‌తో సహా బస్సులో ఉన్న మొత్తం 42 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ బస్
స్టేషన్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణలో బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. బస్సు పెట్రోల్ బంక్ వద్ద ఆగిపోయినప్పుడు డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ డోర్ పగులగొట్టి ప్రయాణీకులను కిందకు దింపారు. అనంతరం, బస్సును పెట్రోల్ బంక్ నుండి
వంద మీటర్ల దూరం తీసుకెళ్ళి నిలిపివేశారు. బస్సు మంచి కండిషన్‌లోనే ఉందని, ఒక్కసారిగా బ్యాటరీ నుండి మంటలు రావడంతో బస్సును నిలిపివేసినట్లు డ్రైవర్ తెలిపారు. బస్సు నుండి ఎగిసిపడిన మంటల ధాటికి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ హై టెన్షన్ వైర్లు కాలి కింద పడిపోయాయి. అయితే, వెంటనే పవర్ సప్లై నిలిపివేయడంతో
పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు అధికారులను ఆదేశించారు. బ్యాటరీ లోపం వల్లా లేక మరేదైనా కారణంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
- వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్ జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరుణ దేవుడి కరుణ కోసం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం చేయడంతో పాటు కప్పతల్లి ఆటను ఆడారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కందుగుల గ్రామంలో, గ్రామస్తులు వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష వయోభేదం లేకుండా అందరూ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక బిందెడు నీళ్లను డప్పుచప్పుళ్లతో ఆలయాలకు తీసుకువెళ్లి దేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు కుంకుమలతో దేవత మూర్తులను అలంకరించి, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. అదేవిధంగా, వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు ఓ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షాలు లేకపోవడంతో పూర్వ కాలం నాటి ఆచారం ప్రకారం కప్పలకు వివాహం జరిపారు. బాజా భజంత్రీలు, మేళా తాళాల నడుమ రెండు కప్పలను తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.1
- జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని ఆయన పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని శ్రీధర్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని, ఆరోగ్యకర జీవనానికి యోగా ఉత్తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధన కోసం సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.4
- కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో మాజీ జెడ్పిటిసి బిల్ల వెంకట్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారంతా బిల్ల వెంకట్‌రెడ్డితో కేక్ కట్ చేయించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వెంకట్‌రెడ్డి ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, గ్రామస్తులు కూడా పాల్గొని సందడి చేశారు.1
- కరీంనగర్ నగరంలో నీట్ రీ-ఎగ్జామ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సీపీ గౌస్ ఆలం, నగరంలోని మొత్తం ఏడు కేంద్రాల్లో దాదాపు 3 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు ఏమాత్రం అవకాశం లేకుండా చూసేందుకు 300 మంది సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు, అలాగే సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ వ్యవస్థ, జామర్లను కూడా అమర్చినట్లు ఆయన వివరించారు. పరీక్షల సజావుగా నిర్వహణలో భాగంగా జిరాక్స్ దుకాణాలను కూడా మూసివేయించినట్లు సీపీ పేర్కొన్నారు.1
- వీణవంక మండలంలోని కోర్కల్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ నూతన చేనేత సంఘం అధ్యక్షుడిగా అడిగొప్పుల సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలుగా అడిగొప్పుల నిర్మల, కోశాధికారిగా బొద్ధుల భావనఋషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు కొత్త డైరెక్టర్ల కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి జిల్లా ఎన్నికల అధికారి పలుకల సురేందర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం, నూతనంగా ఎన్నికైన చేనేత సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సత్యనారాయణ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు మరియు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్కల్ చేనేత సహకార సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జక్కు అరుణ, దూడం సంజీవులు, మార్త అశోక్, సిరిపురం శంకరయ్య, సింగం కుమార స్వామి, సింగం రామస్వామిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎడారిని తలపిస్తున్న మిడ్ మానేర్ జలాశయం వద్ద బీఆర్ఎస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు జలాశయం ఎండిపోయిన ప్రదేశంలో కబడ్డీ, క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయంలో నీటి నిల్వలు తగ్గి, మునిగిపోయిన గ్రామాలు మళ్ళీ తేలుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు పరిస్థితిని పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో మండే వేసవిలో సైతం నిండు కుండలా జలకళను సంతరించుకున్న మిడ్ మానేర్ ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోవడం పాలకపక్షం నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని బీఆర్ఎస్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగినప్పటికీ, గత రెండున్నర ఏళ్లుగా రిపేర్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై రాజకీయ కక్షతో రైతులకు సాగునీరు అందించకుండా కుట్ర పడుతోందని కూడా ఆరోపించారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వెంటనే మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి రైతులకు సాగు, త్రాగునీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో త్రాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హెచ్చరించారు.4
- కరీంనగర్ జిల్లాలో, ఈనాడు ఆఫీస్ కెనాల్ సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న TS RTC ఎలక్ట్రికల్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కరీంనగర్ నుండి బయలుదేరిన ఈ బస్సులో అగ్నిప్రమాదం సంభవించినప్పటికీ, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.1