పెదబయలులో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై మండల నాయకులతో సమావేశం పెదబయలు: పెదబయలు మండల కేంద్రంలో బుధవారం ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై మండల అధికారులు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా జాబితాను అధికారులు నాయకులకు వివరించారు. నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి, వాటిని పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాల నిర్వహణపై చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 1,000 మంది ఓటర్లకు మించి ఓటర్లు ఉంటే, అవసరాన్ని బట్టి అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్,లక్సమయ్య, స్పెషల్ ఆఫీసర్ పూర్ణయ్య, సమావేశంలో తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
పెదబయలులో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై మండల నాయకులతో సమావేశం పెదబయలు: పెదబయలు మండల కేంద్రంలో బుధవారం ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై మండల అధికారులు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా జాబితాను అధికారులు నాయకులకు వివరించారు. నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి, వాటిని పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాల నిర్వహణపై చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 1,000 మంది ఓటర్లకు మించి ఓటర్లు ఉంటే, అవసరాన్ని బట్టి అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్,లక్సమయ్య, స్పెషల్ ఆఫీసర్ పూర్ణయ్య, సమావేశంలో తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
- విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో యువ చైతన్యం, త్రిశూల పేరుతో పోలీసులు మరియు వివేకనంద యాజమాన్యం సహకారంతో 150 మంది విద్యార్థులతో త్రీ కె రన్.. విజయనగరం జిల్లా... శృంగవరపుకోటలో యువ చైతన్యం,త్రిశూల్ పేరుతో పోలీసులు మరియు వివేకానంద యాజమాన్యం సహకారంతో 150 మంది విద్యార్థులతో 3k రన్... శ్రీ వివేకానంద కాలేజీ నుంచి స్థానిక ఎరుకమ్మా కళ్యాణ మండపం వరకు విద్యార్థులతో 3K రన్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్న జిల్లా ఎస్పీ దామోదర్, డిఎస్పీ రాఘవులు డ్రగ్స్ మరియు మహిళల భద్రతపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో ఎరుకమ్మ పేరంటాలు కళ్యాణ మండపంలో యువతకు అవగాహన సమావేశం విజయనగరం జిల్లా SP ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ యువత గంజాయి, మహిళలపట్ల అసభ్యప్రవర్తన రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించారు సెల్ ఫోన్ వచ్చిన తరువాత మోసాలు ఎక్కువయ్యాయి ఆర్టిఫిషల్ టెకనోలజి వచ్చినప్పటి నుంచి ఏది నిజం ఏది అబద్దం తెలియటలేదు ఫోన్ అనేది అవసరాలకు మించి వాడకూడదు, చెడు అవసరాలకు వినియోగించకూడదు ప్రమాదం అనేది చెప్పిరాదు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడకం తప్పినిసరి, ఆన్లైన్ బెట్టింగ్ ఆప్ ద్వారా యువత బారినపడుతున్నారు ఈ బెట్టింగుల వలన అప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మధ్యస్థ వయస్సువారు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతున్నారు వీటి భారీనాపడి మోసపోవద్దు ప్రజలను కాపాడటమే మాలక్ష్యం యువత మంచి మార్గంలో నడిచి భవితరాలకు మార్గదర్శియులుగా మెలగాలని కోరారు.4
- బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని హౌసింగ్, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు నీట మునిగాయి. పట్టణంలో కురిసిన వర్షానికి వరదనీరు కార్యాలయాల చుట్టూ నిలవడంతో రాకపోకలకు అధికారులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు1
- రాష్ట్ర మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి సంతాపం..! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన...! బుడా చైర్మన్ - తెంటు లక్ష్మునాయుడు..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప-ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి బొబ్బిలి కోటలో సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, 2004 నుంచి బొబ్బిలి రాజకుటుంబానికి వారితో సత్సంబంధాలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేశారని కొనియాడారు. బొబ్బిలి ప్రాంతంతో కూడా వారికి అవినాభావ సంబంధం ఉందని, మన ప్రాంతంలో వారికి వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. వారి హఠాన్మరణం మన అందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.3
- సంతకవిటి మండలం లో ఈదురు గాలి లో తో కూడిన వర్షం ప్రజలు అంత సూరక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచనలు సంతకవిటి మండలం లో మంగళవారం ఒక్కసారి గా వాతావరణం లో మార్పులు చోటు చేసికొని వర్షం పడింది.పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలుoత సురక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచించారు.1
- శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం *శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్నదాన (అన్నప్రసాద వితరణ) కార్యక్రమం* జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామం లో కృష్ణాష్టమి సందర్భంగా18వ శ్రీకృష్ణ జయంతి పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని గుడి వద్ద భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కమిటీ వారు తెలియజేస్తూ గత 18 సంవత్సరాలుగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు భారీ సంఖ్యలో అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణుని గుడి దగ్గర జరిగే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు నుండి భక్తులు,భారీ సంఖ్యలో వస్తారని అలాగే వచ్చిన వారికి కమిటీ ఆధ్వర్యంలో తగిన సౌకర్యాలు,జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు అలాగే ప్రతి సంవత్సరము లాగ కమిటీ పెద్దలు పర్యవేక్షణలో యూత్ కూడా ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని జయంతి మొదటి రోజు నుండి చివరగా స్వామివారి అన్నదాన(అన్న ప్రసాద వితరణ) కార్యక్రమం జరిగేంతవరకు ఎంతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని యాదవ సంఘం కమిటీ పెద్దలు తెలియజేశారు శ్రీ స్వామి వివేకానంద స్కూల్ అధినేత ఒమ్మి రఘురాం మాట్లాడుతూ.. యాదవులు అంటే ఎటువంటి కల్మషం లేని వ్యక్తులని, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొదటి దర్శనం యాదవులకె కల్పించారని, అలాగే ఈ ఊర్లో యాదవులలో సర్పంచులు చేసిన వ్యక్తులు ఉన్నారని, యువత బాగా చదువుకోవాలని, గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు పొందాలని అయన కోరారు3
- 'మల్ఖానా' భవనాన్ని ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదేశాలు శ్రీకాకుళం: మాదకద్రవ్యాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును నిల్వ చేసేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక 'మల్ఖానా' భవనాన్ని అన్ని రకాల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఒకటవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వై. బెన్నయ్య నాయుడు అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం వెనుక భాగంలో రూ.30 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న మల్ఖానా భవన నిర్మాణ పనులను మంగళవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మొత్తానికి ఏకైక నిల్వ కేంద్రంగా ఉండే ఈ భవనంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల మేరకు పటిష్టమైన డోర్లు, చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని సూచించారు.భవనం లోపల, వెలుపల పరిసరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు, అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది నిరంతర కాపలా ఉండేలా చర్యలు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను త్వరగా ముగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.3
- వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు1
- నడవలేని వృద్ధుడుకి వీల్ సైకిల్ బహుకరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ సహకారంతో గంటా శేషగిరిరావు కి వీల్ సైకిల్ అందజేశారు. వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధునికి ఎమ్మెల్యే మంచి మనసుతో స్పందించి ఘంటా శేషగిరి రావుకి వీల్ సైకిల్ ను బహుకరించారు. అవసరమైన వారికి అండగా నిలిచి, వారి అవసరాలకు అనుగుణంగా సహాయం అందించడమే లక్ష్యంగా ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు అవసరమైన సమయంలో తమ వంతు సహాయాన్ని అందిస్తూ, సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. సేవలోనే సంతృప్తి.. సహాయం చేయడం లోనే ఆనందం ఉందన్నారు2