జనవాణిలో వచ్చిన వినతులు పరిష్కారానికి కృషి* *జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర* నాతవరం: జనవాణిలో వచ్చిన వినతులు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర అన్నారు. నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేశారు. శానిటేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారులు, ఆస్తి తగాదాలు, విద్యుత్ తదితర సమస్యలకు సంబంధించి మొత్తం 7 వినతులు అందినట్లు సూర్యచంద్ర తెలిపారు. మండలంలోని వల్సంపేట పంచాయతీ ఊటమళ్ల గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ఎంపీడీఓ ఎంఎస్.శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే నాతవరంకు చెందిన చింతకాయల లక్షిత్ అనే ఐదేళ్ల దివ్యాంగుడు బాలుడు సదరం తప్పిదం వల్ల పెన్షన్ రావడం లేదని తల్లిదండ్రులు వినతిపత్రం అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు జనసేన కార్యాలయాన్ని సంప్రదించాలని, సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బెడ్డు సూరి శేఖర్, నాయకులు తగరంపూడి శివ, చిక్కాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జనవాణిలో వచ్చిన వినతులు పరిష్కారానికి కృషి* *జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర* నాతవరం: జనవాణిలో వచ్చిన వినతులు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర అన్నారు. నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేశారు. శానిటేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారులు, ఆస్తి తగాదాలు, విద్యుత్ తదితర సమస్యలకు సంబంధించి మొత్తం 7 వినతులు అందినట్లు సూర్యచంద్ర తెలిపారు. మండలంలోని వల్సంపేట పంచాయతీ ఊటమళ్ల గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ఎంపీడీఓ ఎంఎస్.శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే నాతవరంకు చెందిన చింతకాయల లక్షిత్ అనే ఐదేళ్ల దివ్యాంగుడు బాలుడు సదరం తప్పిదం వల్ల పెన్షన్ రావడం లేదని తల్లిదండ్రులు వినతిపత్రం అందజేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు జనసేన కార్యాలయాన్ని సంప్రదించాలని, సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బెడ్డు సూరి శేఖర్, నాయకులు తగరంపూడి శివ, చిక్కాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (DISHA) సమీక్షా సమావేశము అనంతరము అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం1
- తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.3
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అకాల మరణం,................ కాంగ్రెస్ నాయకునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004 నుంచి 2009 వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో మరణించారు. అత్తగారింటికి పండగకి గాని వచ్చిన ఆయనకు ఊహించని విధంగా గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని సీతమ్మదార లో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించగా ఆయన అక్కడ మృతి చెందారు.1
- జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఉద్యమం.. మద్దతు తెలిపిన సత్యనారాయణ పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన కార్యక్రమం కొనసాగుతోంది. పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని గ్రామాలను సందర్శిస్తూ రైతులు, ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన దుశృర్ల సత్యనారాయణ సాధన సమితి సభ్యులకు మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో తన వంతు సహాయ సహకారాలు అందించి, జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం కలిసి పనిచేస్తానని తెలిపారు. 50 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయి, కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలాయని, జంఝావతి మన్యం ప్రజలకు జీవనాడి వంటిదని ఆయన పేర్కొన్నారు.1
- వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు1
- మత సామరస్యానికి ప్రతీక ఖాదర్ బాబా దర్గా సూఫీ పీఠాధిపతి ఖ్వాజా మొహియినుద్దీన్ విజయనగరం, సెప్టెంబర్ 15: శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యానికి బాబామెట్టలోని హజరత్ ఖాదర్ బాబా దర్గా షరీఫ్ ప్రతీకగా నిలుస్తోందని చీమలపాడు సూఫీ పీఠాధిపతి, సజ్జాదా నషీన్ మొహమ్మద్ ఖ్వాజా మొహియినుద్దీన్ అన్నారు. బుధవారం నిర్వహించనున్న హజరత్ ఖాదర్ బాబా 130వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం బాబామెట్ట దర్బార్ షరీఫ్‌లో ధర్మకర్త డాక్టర్ ఎం.డీ. ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ (ఖలీల్ బాబు)తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖ్వాజా మొహియినుద్దీన్ మాట్లాడుతూ ఖాదర్ బాబా జన్మదినం సూఫీ పరంపరలో విశిష్టమైన పర్వదినమన్నారు. మానవత్వంతో కూడిన సూఫీ ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచానికి విస్తరించిన మహనీయుల్లో బాబా ఖాదర్ షా ఒకరని కొనియాడారు. సుమారు 850 ఏళ్ల క్రితమే భారతదేశంలో సూఫీ పరంపర ప్రారంభమైందని తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు అందించడం, మాటలతోగానీ చేతలతోగానీ ఇతరులను బాధించకుండా మానవత్వంతో జీవించడమే సూఫీ మార్గమని వివరించారు. ఈ పరంపరలో ఎంతోమంది మహనీయులు భారతదేశంలో జన్మించారని, నాగ్‌పూర్ తాజుద్దీన్ బాబా శిష్యుల్లో అగ్రగణ్యుడిగా బాబా ఖాదర్ షా నిలిచారని తెలిపారు. 1900 నుంచి 1961 వరకు విజయనగరంలో ఖాదర్ బాబా వారి ఆధ్యాత్మిక సందర్శనా కాలంగా పేర్కొన్నారు. ఈ కాలంలో బాబా అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసి, శాంతి, మత సామరస్య సందేశాన్ని విస్తరించారని చెప్పారు. అన్నార్తుల ఆకలి తీర్చడం, వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చడం, బాధితులకు అండగా నిలవడం వంటి సేవలతో బాబా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని పేర్కొన్నారు. బాబా పవిత్ర సమాధిని దర్శించుకునే భక్తులకు నేటికీ ఆశీస్సులు లభిస్తున్నాయన్న విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. ఖాదర్ బాబాపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఘనంగా జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించనున్న ఖాదర్ బాబా 130వ జన్మదిన వేడుకలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బాబా భక్తులు హాజరుకానున్నారని ఖ్వాజా మొహియినుద్దీన్ తెలిపారు. భక్తుల కోసం అవసరమైన వసతి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. మంగళవారం నుంచే దర్బార్ షరీఫ్‌లో ఉత్సవ సందడి నెలకొందన్నారు. మంగళవారం మధ్యాహ్నం, రాత్రి భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజల కోసం భారీ అన్న సమారాధన నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బాబా దివ్య సమాధికి చాదర్, సుగంధ ద్రవ్యాలు, పూలు, మిఠాయిలు సమర్పించి విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం, రాత్రి దర్బార్ షరీఫ్‌లో భారీ అన్న సమారాధన నిర్వహించడంతో పాటు రాత్రి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఖలీల్ బాబు తనయుడు ఎం.డీ. అహ్మద్ బాబు, నాగేంద్ర బాబాయ్, రంగారావు బాబాయ్ తదితరులు పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా బొబ్బిలి కోటకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను, టిడిపి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం... విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజవర్గ పరిధిలో ఉన్న నాయకులను, కార్యకర్తలను చిన్న శ్రీను గారుకి పరిచయం చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన . - మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఫోటోలు. - నియోజకవర్గ జనసేన నాయకులను పరిచయం చేసన బేబీనాయన. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)*శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* ఆహ్వానం మేరకు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటకు వచ్చారు.. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దర్బార్ మహల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే*బేబీనాయన* గారు మాట్లాడుతూ, మజ్జి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి రావడం *తనకు చాలా సంతోషంగా ఉందని* అన్నారు.. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల తరుపున స్వాగతం పలికారు.. అలానే, *వారి చేరికను తాను వ్యతిరేకించినట్లు కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు*.. వారి చేరికతో పార్టీ మరింత బలపడుతుందని తనకి పూర్తి నమ్మకం ఉందన్నారు.. రాజకీయంగా వేరే పార్టీలలో పనిచేసినా కూడా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు మాకు లేవని స్పష్టతనిచ్చారు.. అందరం కలసికట్టుగా పనిచేసి, గౌరవ ప్రధానమంత్రి *నరేంద్ర మోదీ* ముఖ్యమంత్రి శ్రీ *నారా చంద్రబాబునాయుడు* , ఉప ముఖ్యమంత్రి *పవన్ కళ్యాణ్* గారు నాయకత్వాన్ని బలపరిచి మన నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* మాట్లాడుతూ, బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుకి ఎల్లప్పుడూ తాను సహకరిస్తానని, చిరస్థాయిగా వారు రాజకీయంగా ఎదగాలని అన్నారు.. గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని.. ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయంతో ముందుకు సాగుతామని, పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం మేరకు పనిచేస్తానని తెలిపారు. మాజీ మంత్రి శ్రీ సుజయ్ నాయన మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు తో కూడా మాట్లాడానని, వారిని కూడా కలుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి , విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేష్ , ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు మరియు చింతల రామకృష్ణ, బొబ్బిలి పట్టణం మరియు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాస్ , మాజీ మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ , టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వినాయక నిమజ్జనాలపై పోలీసుల పటిష్ఠ బందోబస్తు........... సిపి గారి ఆదేశాల మేరకు నిమజ్జన ప్రాంతాలతో పాటు అక్కడికి చేరుకునే ప్రధాన రహదారుల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు... నిమజ్జనాల సందర్భంగా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు...తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచిన అధికారులు...నిమజ్జన ప్రక్రియను సురక్షితంగా నిర్వహించేందుకు క్రేన్లను కూడా సిద్ధంగా ఉంచిన పోలీసు యంత్రాంగం...1