logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించాలి... నాణ్యమైన వైద్య సేవలు అందించకుంటే కఠిన చర్యలు కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రోగుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వారికి అందిస్తున్న చికిత్స, వైద్య సేవలు, మందుల పంపిణీ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నెలలో ఎన్ని ప్రసవ అంచనా తేదీలు (EDD) ఉన్నాయని, ఇప్పటివరకు ఎన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగాయనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి గల కారణాలను తెలుసుకుని, వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్రిటికల్ డెలివరీల సంఖ్య, ఆయా గర్భిణీలకు అందిస్తున్న చికిత్స, తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ ఆరా తీశారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగాపర్యవేక్షించాలని, హైరిస్క్ ANCలను రిఫరల్ SOP ప్రకారం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు సకాలంలో రిఫర్ చేయాలని ఆదేశించారు. ప్రతి గర్భిణీని ప్రసవ సమయానికి ముందుగానే తగిన ఆరోగ్య కేంద్రానికి ట్యాగ్ చేసి, ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

54 min ago
user_గడ్డమీది చంద్రయ్య
గడ్డమీది చంద్రయ్య
Bhongir, Yadadri Bhuvanagiri•
54 min ago
14ceb047-4e15-44dc-81a9-0a9d60609f38

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించాలి... నాణ్యమైన వైద్య సేవలు అందించకుంటే కఠిన చర్యలు కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రోగుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వారికి అందిస్తున్న చికిత్స, వైద్య సేవలు,

f4abe183-bd21-4e98-8cd2-b8ab6458cd5e

మందుల పంపిణీ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నెలలో ఎన్ని ప్రసవ అంచనా తేదీలు (EDD) ఉన్నాయని, ఇప్పటివరకు ఎన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగాయనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి గల కారణాలను తెలుసుకుని, వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్రిటికల్ డెలివరీల సంఖ్య, ఆయా గర్భిణీలకు అందిస్తున్న చికిత్స, తీసుకుంటున్న

7cc8d17e-3e0c-4cc3-9406-d4e4080cb8f2

ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ ఆరా తీశారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగాపర్యవేక్షించాలని, హైరిస్క్ ANCలను రిఫరల్ SOP ప్రకారం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు సకాలంలో రిఫర్ చేయాలని ఆదేశించారు. ప్రతి గర్భిణీని ప్రసవ సమయానికి ముందుగానే తగిన ఆరోగ్య కేంద్రానికి ట్యాగ్ చేసి, ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
    4
    విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం
విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్  యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు
    1
    రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం
రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది.
ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    3
    *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?*


*ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన*


*తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు*


*కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు*


*రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు*


*అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న*


*తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు*


*భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు*


*రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు*


*కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు*


తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి నోటీసులు తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో గురువారం సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సవరించిన ఓటర్ల జాబితాను గ్రామస్థులకు చదివి వినిపించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి నోటీసులు అందుకున్న 236 మంది ఓటర్లు ఈ నెల 30వ తేదీన తహసీల్ కార్యాలయంలో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని జీపీఓ విజయలక్ష్మి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.
    1
    మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి నోటీసులు
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో గురువారం సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సవరించిన ఓటర్ల జాబితాను గ్రామస్థులకు చదివి వినిపించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి నోటీసులు అందుకున్న 236 మంది ఓటర్లు ఈ నెల 30వ తేదీన తహసీల్ కార్యాలయంలో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని జీపీఓ విజయలక్ష్మి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    13 min ago
  • సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    2
    సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    2 hrs ago
  • వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులను నిర్బంధించిన పోలీసులు భోజనం చేయడానికి కూడా బయటికి అనుమతించని వైనం మాకు ఆకలైతుంది వదిలేయండి ప్లీజ్ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను లంచ్‌కి కూడా బయటికి పంపకుండా గేటు లోపలే అక్రమంగా నిర్బంధించిన పోలీసులు ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు
    2
    వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులను నిర్బంధించిన పోలీసులు

భోజనం చేయడానికి కూడా బయటికి అనుమతించని వైనం
మాకు ఆకలైతుంది వదిలేయండి ప్లీజ్
వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను లంచ్‌కి కూడా బయటికి పంపకుండా గేటు లోపలే అక్రమంగా నిర్బంధించిన పోలీసులు
ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • 22ఏ భూ సమస్యలపై బీజేపీ ఆందోళన ఉధృతం చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి: 22ఏ కింద నమోదు చేసిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. 22ఏ భూ సమస్యల కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితులకు అండగా బీజేపీ పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
    1
    22ఏ భూ సమస్యలపై బీజేపీ ఆందోళన ఉధృతం చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్
మల్కాజ్‌గిరి: 22ఏ కింద నమోదు చేసిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
22ఏ భూ సమస్యల కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
లేకపోతే బాధితులకు అండగా బీజేపీ పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి 10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి
10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    2 hrs ago
  • యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    4
    యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    user_Vijay Kumar
    Vijay Kumar
    Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.