పోలవరం జిల్లాలోని అడ్డతీగల సర్కిల్ పరిధిలో గంజాయి నిర్మూలనకు, మహిళల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సీఐ స్పష్టం చేశారు. ఈ దిశగా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గంజాయి వినియోగాన్ని సమూలంగా అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ సంయుక్తంగా 'రాపిడ్ టెస్ట్' అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ మాదిరిగానే మూత్రం నమూనా ద్వారా పనిచేసే ఈ కిట్‌లో, కేవలం 'C' వద్ద ఎర్రటి గుర్తు వస్తే గత ఆరు నెలల వ్యవధిలో గంజాయి సేవించినట్లుగా (పాజిటివ్) నిర్ధారించి, వారిపై సెక్షన్ 27B కింద కేసు నమోదు చేస్తారు. 'C' మరియు 'T' గుర్తు వస్తే నెగిటివ్ అని అర్థం. కొత్తగా అలవాటు పడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నిరంతరం పోలీస్ పర్యవేక్షణలో ఉంచుతారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్‌కు 25 కిట్లు కేటాయించగా, ఇప్పటికే నిర్వహించిన మూడు పరీక్షల్లోనూ నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు సీఐ తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయి విక్రయ, వినియోగ ప్రాంతాల్లో ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నారు. వీటితో పాటుగా, మహిళలను వేధించడం, లైంగిక దాడులకు పాల్పడటం వంటి మహిళా సంబంధిత కేసులలో నిందితులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.

- 😭🙏1
- పిఠాపురం పట్టణంలోని అత్యంత పురాతనమైన కుంతీ మాధవ స్వామివారి దేవస్థానం పుష్కరిణిని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ‘మన ఊరు-మన బాధ్యత’ స్వచ్ఛంద సేవా సంస్థ స్వాగతించింది. దశాబ్ద కాలంగా సరైన పర్యవేక్షణ లేక చెత్తాచెదారంతో నిండి, డంపింగ్ యార్డ్‌గా మారిన ఈ పవిత్ర పుష్కరిణి ప్రక్షాళనకు ప్రభుత్వం పూనుకోవడంపై సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తూ స్వామివారి అభిషేకం కోసం నీటిని సేకరించే ఈ పుష్కరిణి గత దశాబ్ద కాలంగా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల చుట్టుపక్కల నివాసితులు మరియు ఇతరులు చెత్తాచెదారంతో నింపివేశారని సంస్థ పేర్కొంది. ఈ విషయంలో గతంలో అనేకసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ పుష్కరిణిని ప్రక్షాళన చేసేందుకు పూనుకోవడం అభినందనీయమని సంస్థ ప్రతినిధులు కొండేపూడి శంకరరావు మరియు అల్లవరపు నగేష్ పేర్కొన్నారు. ఈ చొరవ తీసుకున్న పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావుకి మరియు వారి సిబ్బందికి ‘మన ఊరు-మన బాధ్యత’ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అదే సమయంలో, పుష్కరిణి ఆధునీకరణకు సంబంధించి సంస్థ సభ్యులు ఒక కీలక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పుష్కరిణి పనులను దేవదాయ ధర్మదాయ శాఖ నిధులతోనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ సాధారణ నిధులను దీనికి వినియోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రజాధనాన్ని ఇతర అభివృద్ధి పనులకు కేటాయించాలని వారు కోరారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసి, పుష్కరిణిని యథావిధిగా పవిత్రంగా తీర్చిదిద్ది, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ‘మన ఊరు-మన బాధ్యత’ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.1
- 🙏😭1
- శనివారం రంపచోడవరంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారుల సమయపాలన లేకపోవడంపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ సమావేశానికి మధ్యాహ్నం 12 గంటలైనా సంబంధిత అధికారులు హాజరు కాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని అధికారులు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించిన ఛైర్మన్, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడ ఉన్న నిర్వాసితులు, ప్రజాప్రతినిధుల మధ్య చర్చనీయాంశంగా మారింది.1
- 😭🙏1
- 😭1
- సత్తుపల్లి పట్టణంలోని 18వ వార్డులో ఉన్న డాల్ఫిన్స్ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.2
- ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణ పోలీసు శాఖలో బొల్లారం కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన స్వర్ణకంటి జస్వంత్ (36) అక్కడికక్కడే మృతి చెందారు. జస్వంత్ 2021 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా సమాచారం. అన్నవరం దేవస్థానం దర్శనం చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేస్తున్న జస్వంత్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు రామానుజవరం గ్రామ సమీపంలో అదుపుతప్పి హైవే ఎడమ వైపున ఉన్న రేకు బారికేడును ఢీకొట్టి పల్టీలు కొట్టింది.2