మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సూపక గ్రామపంచాయతీలో ఈ సందర్భంగా ఓటర్ జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని, ఈ రోజు కోటపల్లి మండలంలోని సూపక గ్రామపంచాయతీలో శ్రీ కాశెట్టి సతీష్ కుమార్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎస్.ఐ.ఆర్. సవరణ ప్రక్రియపై అవగాహన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సకాలంలో సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎం.ఆర్.ఓ. గారు,ఇన్‌చార్జ్ కర్ణ సాగర్ గారు, మాజీ జెడ్‌పీటీసీ పోటు రాంరెడ్డి గారు, ఇన్‌చార్జ్ చెన్న సూర్యనారాయణ గారు, మండల అధ్యక్షులు కాట్రాల మల్లన్న గారు, డీసీసీ కార్యదర్శి కొండు వెంకటేష్ గారు, మండల ఉపాధ్యక్షులు తోట అశోక్ గారు, కొల్లూరి మధూకర్ గారు, బద్రీనాయక్ గారు, ఉపసర్పంచ్ రామక్క గారు, పంచాయతీ కార్యదర్శి దామోదర్ గారు, వార్డు సభ్యులు, జి.పి.ఓ., బి.ఎల్.ఓ,బి.ఎల్.ఏ., గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సూపక గ్రామపంచాయతీలో ఈ సందర్భంగా ఓటర్ జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని, ఈ రోజు కోటపల్లి మండలంలోని సూపక గ్రామపంచాయతీలో శ్రీ కాశెట్టి సతీష్ కుమార్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎస్.ఐ.ఆర్. సవరణ ప్రక్రియపై అవగాహన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సకాలంలో సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎం.ఆర్.ఓ. గారు,ఇన్‌చార్జ్ కర్ణ సాగర్ గారు, మాజీ జెడ్‌పీటీసీ పోటు రాంరెడ్డి గారు, ఇన్‌చార్జ్ చెన్న సూర్యనారాయణ గారు, మండల అధ్యక్షులు కాట్రాల మల్లన్న గారు, డీసీసీ కార్యదర్శి కొండు వెంకటేష్ గారు, మండల ఉపాధ్యక్షులు తోట అశోక్ గారు, కొల్లూరి మధూకర్ గారు, బద్రీనాయక్ గారు, ఉపసర్పంచ్ రామక్క గారు, పంచాయతీ కార్యదర్శి దామోదర్ గారు, వార్డు సభ్యులు, జి.పి.ఓ., బి.ఎల్.ఓ,బి.ఎల్.ఏ., గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా* * రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.1
- ఆరు నెలల్లో రహదారుల పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క MLG: ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- ములుగు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా: 6 పెండింగ్ DAలు, OPS అమలుకు డిమాండ్ ములుగు:దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గురువారం ములుగు నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున ‘మహాధర్నా’ నిర్వహించారు. ఈ ధర్నాలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు: 6 పెండింగ్ DAల విడుదల: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన 6 బకాయి డియర్నెస్ అలవెన్సులను (DA) ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలి. OPS పునరుద్ధరణ: ఉద్యోగుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తున్న సీపీఎస్ (CPS) విధానాన్ని స్వస్తి పలికి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.2
- లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు1
- మాకు ఆకలి అవుతుంది మమల్ని వదిలేయండి ప్లీజ్... పాలిటెక్నీక్ విద్యార్థుల ఆవేదన వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పోలీసులు గేటు లోపలే నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచ్ కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. “మాకు ఆకలైతుంది.. వదిలేయండి ప్లీజ్” అంటూ విద్యార్థులు వేడుకున్నట్లు తెలుస్తోంది.1
- రామగుండం లో గుజరాత్.NIA తనిఖీలు., * పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రామగుండం సిపి కి వినతిపత్రం అందించిన విశ్వహింద్ పరిషత్ రామగుండం లో గుజరాత్ NIA తనిఖీల సంబంధించి రామగుండం పోలీసు కమీషనర్ కు వినతి పత్రం సమర్పించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు. నిన్ను రామగుండం అయోధ్య నగర్ లో ముజాహిల్ అనే విద్యార్థి నీ గుజరాత్ NIA వారు అతని ఇంటిని సోదాలు నిర్వహించి అతని ఫోన్. లాప్టాప్ తీసుకువెళ్ళి అతనిని NTPC పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది.. ఈ సందర్భంగా పరిషత్. విభాగ కార్యదర్శి. అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉగ్రవాద జడలు ఉన్నాయి.. అనేకమంది ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. అనేకసార్లు ఇక్కడ జాతీయ నిగూ సంస్థ ల తనిఖీలు జరిగాయి.. కావున పోలీసు వారు ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు... ఈ కార్యక్రమంలో. జిల్లా సహా కార్యదర్శి అడ్డిగొప్పుల రాజు. నగర్ కార్యదర్శి మునిగాల సంపత్. వెంకటస్వామి. లింగాన్న. రాజేశ్. తిరుపతి. మరియు బాధ్యులు పాల్గొన్నారు.....1