logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం Gadwal: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు దిగ్విజయంగా నిర్వహించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో కీలకమైనదని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 12వ తేదీన స్థానిక సంస్థల, ఇతర ప్రజాప్రతినిధులతో నిర్వహించు శిక్షణ కార్యక్రమంపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు 99 రోజుల ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన ప్రజాప్రతినిధులకు నిర్వహించు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణపై ఇప్పటికే షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని, దాని ప్రకారం జూన్ 12వ తేదీ వరకు ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని సిఎస్ పిలుపునిచ్చారు. గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఈనెల 12న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ఈ శిక్షణ తరగతుల్లో ఉదయం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పది థీమ్ లను వివరించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తెలియజేస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి వివిధ సంక్షేమ పథకాలు పొందుతున్న వారి సంఖ్య, ఇతర వివరాలన్నీ క్రోడీకరించడం జరుగుతుందన్నారు. ఆయా అంశాలను సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా పనిచేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఈనెల 12న ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణా తరగతులను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల కార్యక్రమాన్ని ఆయా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేసినందున దాని ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. శిక్షణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ (రెవిన్యూ), నర్సింగరావు (స్థానిక సంస్థలు), అదనపు ఎస్పి శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_Ram  Ram
Ram Ram
Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
1 day ago
25a13fdb-ca4f-496c-a54c-950cac7880da

More news from తెలంగాణ and nearby areas
  • గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర
    1
    గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర
    user_Rajesh setty
    Rajesh setty
    బిజినపల్లి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    8 hrs ago
  • మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    1
    మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో  త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    22 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.
    4
    కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్ / ​– 5వ రోజు కార్యాచరణలో భాగంగా 4వ వార్డులో కచ్చానాల తవ్వకం, ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత. – నిబంధనలు అతిక్రమించి కాలువల్లో చెత్త వేసే వారికి నోటీసులు జారీకి కమిషనర్ ఆదేశాలు. ​తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం *‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల* కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్యాచరణలో భాగంగా *మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి G. చందన రవీందర్* గారు మరియు *మున్సిపల్ కమిషనర్ శ్రీ R. వెంకట్ గోపాల్* గారు పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. _*​ప్రధాన అంశాలు:*_ * వార్డు నం. 4లో ప్రత్యేక డ్రైవ్: TYR గార్డెన్ వెనుక భాగంలో ప్రజ్ఞాపూర్ నుండి వచ్చే వరద కాలువ పూర్తిగా నిండిపోవడం వల్ల నీరు నిలిచి, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పాలకవర్గం, కచ్చానాల (తాత్కాలిక కాలువ) తవ్వించి నీటి నిల్వను తొలగించేలా చర్యలు తీసుకుంది. * నోటీసుల జారీ: కాలువలను పరిశీలించగా, ప్రజలు నేరుగా చెత్తను కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. * *​క్రిమిసంహారకాల పిచికారీ:* మురికి కాలువల్లో దోమల నివారణకు దోమల మందు పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. * *​ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత:* ప్రజా ప్రదేశాల శుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఉన్న UGD సమస్యను పరిష్కరించి, ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, పొదలను తొలగించి ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, 3వ వార్డు కాముని మురళి గారు, 6వ వార్డు బొగ్గుల స్వప్న గారు, 13వ వార్డు భాగ్యలక్ష్మి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. *కమిషనర్,* గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్ /
​– 5వ రోజు కార్యాచరణలో భాగంగా 4వ వార్డులో కచ్చానాల తవ్వకం, ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత.
– నిబంధనలు అతిక్రమించి కాలువల్లో చెత్త వేసే వారికి నోటీసులు జారీకి కమిషనర్ ఆదేశాలు.
​తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం *‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల* కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 
5వ రోజు కార్యాచరణలో భాగంగా *మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి G. చందన రవీందర్* గారు మరియు *మున్సిపల్ కమిషనర్ శ్రీ R. వెంకట్ గోపాల్* గారు పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు.
_*​ప్రధాన అంశాలు:*_
* వార్డు నం. 4లో ప్రత్యేక డ్రైవ్: TYR గార్డెన్ వెనుక భాగంలో ప్రజ్ఞాపూర్ నుండి వచ్చే వరద కాలువ పూర్తిగా నిండిపోవడం వల్ల నీరు నిలిచి, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పాలకవర్గం, కచ్చానాల (తాత్కాలిక కాలువ) తవ్వించి నీటి నిల్వను తొలగించేలా చర్యలు తీసుకుంది.
* నోటీసుల జారీ: కాలువలను పరిశీలించగా, ప్రజలు నేరుగా చెత్తను కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
* *​క్రిమిసంహారకాల పిచికారీ:* మురికి కాలువల్లో దోమల నివారణకు దోమల మందు పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది.
* *​ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత:* ప్రజా ప్రదేశాల శుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఉన్న UGD సమస్యను పరిష్కరించి, ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, పొదలను తొలగించి ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, 3వ వార్డు కాముని మురళి గారు, 6వ వార్డు బొగ్గుల స్వప్న గారు, 13వ వార్డు భాగ్యలక్ష్మి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
*కమిషనర్,*
గజ్వేల్–ప్రజ్ఞాపూర్
పురపాలక సంఘం.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా
    1
    తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.
    1
    ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు.
రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) రిజిస్ట్రార్ గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్.విజయలక్ష్మి గారిని యూనివర్సిటీ దర్బార్ హాలులో ఉన్న వారి ఛాంబర్ లో కలిసి పూలబోకే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నాయకులు జాతీయ అధ్యక్షులు డా.సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కొమ్ము శేఖర్ మాదిగ,రాష్ట్ర సీనియర్ నాయకులు వీరపాకుల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ,ఓయూ ఉపాధ్యక్షులు కోల హరీష్ మాదిగ, ఓయూ నాయకులు కనకపూడి మహేంద్ర మాదిగ,పోతుగంటి ఉదయ్ కిరణ్ మాదిగ,ధార సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
    1
    వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) రిజిస్ట్రార్ గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్.విజయలక్ష్మి గారిని యూనివర్సిటీ దర్బార్ హాలులో ఉన్న వారి ఛాంబర్ లో కలిసి పూలబోకే శాలువాతో సత్కరించి  శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నాయకులు
జాతీయ అధ్యక్షులు డా.సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కొమ్ము శేఖర్ మాదిగ,రాష్ట్ర సీనియర్ నాయకులు
వీరపాకుల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ,ఓయూ ఉపాధ్యక్షులు కోల హరీష్ మాదిగ, ఓయూ నాయకులు కనకపూడి మహేంద్ర మాదిగ,పోతుగంటి ఉదయ్ కిరణ్ మాదిగ,ధార సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు
    1
    పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.