Shuru
Apke Nagar Ki App…
మర్పల్లి లో ముగ్గురు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సస్పెన్షన్ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ లో క్రమశిక్షణ ఉల్లంఘించే విధంగా వ్యవహరించిన ముగ్గురు కార్యకర్తలు బాలు, మహేష్, ఉదయ్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మర్పల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పార్టీలో ఉంటూ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
YERROLLA NARSIMULU
మర్పల్లి లో ముగ్గురు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సస్పెన్షన్ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ లో క్రమశిక్షణ ఉల్లంఘించే విధంగా వ్యవహరించిన ముగ్గురు కార్యకర్తలు బాలు, మహేష్, ఉదయ్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మర్పల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పార్టీలో ఉంటూ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
More news from Telangana and nearby areas
- మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం. మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.1
- వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.1
- విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1