Shuru
Apke Nagar Ki App…
సీసీ రోడ్డు మంజూరు చేసిన టిడిపి నాయకురాలు.. ఆలూరు మండలం కురుకుంద గ్రామం లో ఎన్నో ఏళ్ళుగా CC రోడ్డు కోసం ఎదురు చూస్తున్న కాలిని వాసులకు శుభవార్త..... ఇక వర్షం వస్తే బురద లో నడవాల్సిన అవసరం లేదు CC రోడ్డు వచ్చేసిందిగ... ఆలూరు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మాజీ టిడిపి ఇన్చార్జి వైకుంఠం శివ ప్రసాద్ అభివృద్ధి పనుల్లో ముందుండి సిసి రోడ్డు కు 10 లక్షలు రూపాయలు మంజూరు చేయడం జరిగింది. త్వరలో ఇక్కడ రోడ్డు వేయడం జరుగుతుంది. తెలిపారు..
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
సీసీ రోడ్డు మంజూరు చేసిన టిడిపి నాయకురాలు.. ఆలూరు మండలం కురుకుంద గ్రామం లో ఎన్నో ఏళ్ళుగా CC రోడ్డు కోసం ఎదురు చూస్తున్న కాలిని వాసులకు శుభవార్త..... ఇక వర్షం వస్తే బురద లో నడవాల్సిన అవసరం లేదు CC రోడ్డు వచ్చేసిందిగ... ఆలూరు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మాజీ టిడిపి ఇన్చార్జి వైకుంఠం శివ ప్రసాద్ అభివృద్ధి పనుల్లో ముందుండి సిసి రోడ్డు కు 10 లక్షలు రూపాయలు మంజూరు చేయడం జరిగింది. త్వరలో ఇక్కడ రోడ్డు వేయడం జరుగుతుంది. తెలిపారు..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనుమరెడ్డిపల్లి గ్రామ శివారులో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన టీచర్ పాతిరెడ్డి కారు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుని వెళ్లిన కారు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి.కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించగా, 5 భారతీయ జనతా పార్టీ,మూడు బి ఆర్ ఎస్,ఒకరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోడెల లలిత గణేష్ యాదవ్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 14 కు చేరుకుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ రిజర్వ్ జనరల్ మహిళ రావడంతో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ సతీమణి రత్నమాల చైర్ పర్సన్ గా,వైస్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ షానవాజ్ ఖాన్ ఎన్నికయ్యారు.1
- నస్కల్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా... """"""""""""""""""""''''""""""""""""""""""""" పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ""'''''''''''""""""""""""""""'''''''""""""""""" కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం అని తెలిపిన 1వ వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు కుర్వ బాల్ రాజ్. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమయానికి చేరుకోలేకపోయామని,అందువల్లే ప్రమాణ స్వీకారం మిస్ అయ్యిందని ఒకటో వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు తెలిపారు.ఈ విషయాన్ని ఎమ్మెల్యే సమక్షంలో వెల్లడించారు.అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, దీనిపై అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు.చిన్న తప్పిదం వల్లే ఈ గొడవ చోటుచేసుకుందని అక్కమ్మ కుమారుడు తెలిపారు.తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే కి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఎలాంటి అపోహలు అవసరం లేదని పేర్కొన్నారు.నస్కల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.1
- బద్వేలు: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా బద్వేలు పట్టణాన్ని జీరో వేస్ట్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం “మై గ్రీన్ బిన్” కార్యక్రమం ద్వారా హోమ్ కంపోస్టింగ్‌పై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారి సహకారంతో 96 హోమ్ కంపోస్ట్ బుట్టలను ఉచితంగా పంపిణీ చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో తడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థం నుండి సంపద సాధ్యమవుతుందని తెలిపారు.హోమ్ కంపోస్టింగ్ ప్రయోజనాల గురించి వివరిస్తూ తడి చెత్తను ఇంటి వద్దే ఎరువుగా మార్చడం,ఆదాయ అవకాశాలు కల్పించడంతో పాటు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణయ్య,సి.యం,యం కళ్యాణ్ బాబు,శానిటేషన్ సెక్రెటరీ లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.1
- కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన స్వామి అమ్మవారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో శోభాయమానంగా సాగి భక్తులను ఆకట్టుకుంది. రథంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు హాజరై శివనామ స్మరణతో ప్రాంతాన్ని మారుమోగించారు.1
- బద్వేలు:నేషనల్ హైవే రహదారుల్లో ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను సిఐ రామకృష్ణ పరిశీలించారు . అనంతరం పట్టణం లోని నాలుగు రోడ్ సర్కిల్లో ట్రాఫిక్ ను అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్న పోలీస్ సిబ్బంది సిఐ రామకృష్ణ పాలు రకాల సూచనలను తెలియజేశారు.1