తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు _లక్షలాది భక్తులతో ఆలయం కిటకిట _రెండు లక్షల మందికి ఉచిత అన్నప్రసాద వితరణ హైదరాబాద్, తిరునల్లార్లోని ప్రసిద్ధ ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయంలో శని పేర్చి పవిత్ర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుంభ రాశి నుంచి మీన రాశికి శని గ్రహం మారిన సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి 45 రోజులపాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు.ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మార్చి 6, 7, 8 తేదీలలో సుమారు ఆరు లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించి శని భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శని పేర్చి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు.ఆలయ 27వ పీఠాధిపతి శ్రీ లా శ్రీ కైలై మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామిగళ్ ఆశీర్వాదాలతో కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ మరియు సోలిస్ ఐ హాస్పిటల్ చైర్మన్ నందనపాటి రాము ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఐదోసారి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే ఆలయంలో హోమాలు, శని భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా నందనపాటి రాము కుటుంబ సభ్యులు, సోలిస్ హాస్పిటల్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శివ శ్రీ టి. రాజస్వామి నాథ శివాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అరికపూడి గాంధీ, భీరం హరివర్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, లక్ష్మీ సౌజన్య, ఇషితా రాఠి, కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు.
తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు _లక్షలాది భక్తులతో ఆలయం కిటకిట _రెండు లక్షల మందికి ఉచిత అన్నప్రసాద వితరణ హైదరాబాద్, తిరునల్లార్లోని ప్రసిద్ధ ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయంలో శని పేర్చి పవిత్ర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుంభ రాశి నుంచి మీన రాశికి శని గ్రహం మారిన సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి 45 రోజులపాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు.ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మార్చి 6, 7, 8 తేదీలలో సుమారు ఆరు లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించి శని భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శని పేర్చి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు.ఆలయ 27వ పీఠాధిపతి శ్రీ
లా శ్రీ కైలై మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామిగళ్ ఆశీర్వాదాలతో కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ మరియు సోలిస్ ఐ హాస్పిటల్ చైర్మన్ నందనపాటి రాము ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఐదోసారి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే ఆలయంలో హోమాలు, శని భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా నందనపాటి రాము కుటుంబ సభ్యులు, సోలిస్ హాస్పిటల్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శివ శ్రీ టి. రాజస్వామి నాథ శివాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అరికపూడి గాంధీ, భీరం హరివర్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, లక్ష్మీ సౌజన్య, ఇషితా రాఠి, కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు.
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Termites existence, not to be ignored, love your home.1
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్.పి.వి టీకా ను 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు లాలాపేటలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తిక రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్ప సంకల్పం తీసుకుందన్నారు. మార్కెట్ లో దాదాపు 4 వేలు విలువ చేసే వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో కరోనా విపత్కర పరిస్థితిలో దేశ ప్రజలందరికీ భారత దేశంలో తయారైన వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూప గౌడ్, కనికట్ల హరి, అనిత, సత్యవతి, ఉపేందర్ యాదవ్ ,వీరన్న, వేణు యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జయశ్రీ, లాలాపేట ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ లావణ్య, డాక్టర్ వందన, ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.1