రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు.దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు.భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. చిత్తశుద్ధితో పనులు చేయాలి రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు.సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ
శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు.దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు.భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. చిత్తశుద్ధితో పనులు చేయాలి రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు.సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- జన్న సిరిసిల్ల జిల్లా. *సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం.* *సైబర్ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం.* *సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. *వినాయకుడి బోధనలతో సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు. *జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన.* విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. *ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...* “Prevention is Better than Cure” అనే విధంగా సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్, కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.4
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి హుస్నాబాద్ కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు..* త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం,స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు1
- వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై ఈనెల 6న సీఎం సమక్షంలో సమావేశం...మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఆది శ్రీనివాస వెల్లడి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులను సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ పనులు ఇప్పటివరకు జరిగిన పనులపై చర్చించామని, త్వరలో జరగబోయే పనులపై చర్చించి, ఈనెల 6న హైదరాబాద్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అనంతరం టెండర్ల ప్రక్రియకు వెళ్తామన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు నిధులు మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.2
- ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* *ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో విద్యార్థులను వంచించే పాలన కొనసాగుతుందని గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు బకాయాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులే కాకుండా కళాశాలల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పూర్తి ఫీజు బకాయిలను చెల్లించాలని లేకపోతే టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలియజేశారు.గ్రామీణ ప్రాంతాలు నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న డిగ్రీ కళాశాల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని ప్రభుత్వం ఫీజుబకాయలు ఇస్తుందన్న నమ్మకంతో ఉచిత విద్యను అందజేసిన కళాశాలలకు బకాయిలను ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఈ విషయాన్ని గమనించి ఫీజుబకాయలను విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ బాధ్యులు మోతే రాజిరెడ్డి,లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ పటేల్ లు పాల్గొనడం జరిగింది.1
- కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థుల బస్ సమస్యకు పరిష్కారం చూపిన కోరుట్ల ఏమ్మెల్యే రెండు రోజుల క్రితం బస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ వెంటనే స్పందించారు. కోరుట్ల ఆర్టీసీ ఆర్ఎం, డీఎంతో మాట్లాడి విద్యార్థుల కోసం అదనంగా బస్‌ను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు… ఈ మేరకు ఈరోజు అదనపు బస్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా విద్యార్థులతో కలిసి కోరుట్ల నుంచి కల్లూరు మోడల్ స్కూల్ వరకు బస్‌లో ప్రయాణించారు… విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే సంజయ్ గారికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ గారు తెలిపారు..1
- కారు మబ్బుల కనిపించనీ మేఘాలు వర్ష సూచన లేదు కప్పటాలియ్ ఉదయం నుంచి కమ్ముకున్న మేఘాలు వర్షకనిపించడం లేదు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎదిరిచూపులు వర్షం రాదు పంట పండదు అన్నదాతకు అన్ని కష్టాలే వ3
- తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగేలా రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు ఆయన సేవలను, ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్న నేతలు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాళ్ల నర్సింగము,ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల పర్శరం,ఆరేపల్లి బాలు,రాములు,సర్పంచ్ సాధి,చుక్క శేఖర్,బైరివేని రాము,బండి పర్శరం, బాలసాని శ్రీనివాస్, భాను,హారిక,మిరాల శ్రీనివాస్, రాజేశ్వరరావు, చందు, మల్లేశం, సందీప్,జలందర్ రెడ్డి, ప్రశాంత్, చోటు, గణేష్, భారత్, తిరుపతి, శ్యామ్, కిషన్, గణేష్,రాజిరెడ్డి,చందు,యోగి తదితరులు పాల్గొన్నారు3
- కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన.. 420 హామీల ఫ్లెక్సీతో హోరెత్తిన తెలంగాణ చౌక్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సుమారు ఐదువందల మంది కార్యకర్తలు, ప్రజలతో కలిసి తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వార రోజుల పాటు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు హోరెత్తించాయి. తెలంగాణలో అబద్ధపు హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అన్నదాతలను ఆదుకుంటామన్న కాంగ్రెస్ సర్కార్.. రైతు భీమా పథకానికి తూట్లు పొడిచి మోసం చేసిందన్నారు పేదింటి ఆడబిడ్డకు అండగా నిలవాల్సిన 'కల్యాణ లక్ష్మి' పథకాన్ని తుంగలో తొక్కారు. చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక వారి భవిష్యత్తును అగమ్యగోచరంలోకి నెట్టారు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారికి కష్టాలు మిగిలాయి ఆసరా పెన్షన్ల పెంపుదల జాడ లేదు.యువతులకు స్కూటీలు ఇస్తామన్న హామీ నీటి మీద రాతలయ్యాయనీ అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరుఫున ప్రశ్నిస్తూనే ఉంటామని గంగుల స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల మోసాన్ని రాబోయే అసెంబ్లీ వేదికగా గట్టిగా ఎత్తిచూపుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిలబడి తీవ్ర పోరాటాలు చేస్తామని సర్కార్‌ను గట్టిగా హెచ్చరించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను భాకీ కార్డు రూపంలో ముద్రించి బాటసారులకు వాహనాదారులకు, బస్సులోని ప్రయాణికులకు స్వయంగా ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమం లో.. బారసా కార్పొరేటర్లుమాజీ ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.2
- PFI కేసులో అరెస్టు అయిన అబ్దుల్ సలీంకు ఒక రోజు పెరోల్...చంచల్ గూడ జైల్ నుంచి జగిత్యాలకు తరలించిన పోలీసులు జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీంను మూడేళ్ల క్రితం పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న అబ్దుల్ సలీంను ఒక రోజు పెరోల్ పై పోలీసులు జగిత్యాలకు తీసుకొచ్చారు. సలీం చిన్నమ్మ మృతి, కుటుంబ సభ్యుల అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఒక రోజు ఫెరోల్ మంజూరు చేశారు. దీంతో గట్టి బందోబస్తు మధ్య జగిత్యాలకి తీసుకు వచ్చిన పోలీసులు పెరోల్ గడువు ముగిసిన అనంతరం తిరిగి జైల్ కు తరలించారు.2