logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌లపై విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, ఆ వివరాలను గ్రామసభల ముందుకు తీసుకెళ్తారని ఏజీ కోర్టుకు వివరించారు. ఈ ప్రక్రియ రెండు రోజులపాటు కొనసాగుతుందని, ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. బీసీల రిజర్వేషన్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ త్వరలోనే నివేదికను అందజేస్తుందని, ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తుందని ఏజీ నివేదించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ కోరగా, హైకోర్టు ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది. గతేడాది బీసీ సంఘం అధ్యక్షుడు హైకోర్టులో పిల్ దాఖలు చేస్తూ, బీసీ జనాభాను లెక్కించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు. బీసీ జనగణన చేపట్టి, ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏపీలో ఎన్నికలు నిర్వహించాలని లాయర్ యోగేష్ కూడా పిటిషన్ దాఖలు చేస్తూ, స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిందని కోర్టుకు తెలిపారు. ఏపీ హైకోర్టు ఈ రెండు పిటిషన్లపై విచారణ జరుపుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తిచేసి మిగిలిన ప్రక్రియలను వేగవంతం చేసింది. బీసీల రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను త్వరలోనే అందజేయనుంది. ఈ రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి రాగానే, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఏప్రిల్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి అనిల్‌చంద్ర పునేఠా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలక సమీక్షలు నిర్వహించారు. వచ్చే నెలలో రిజర్వేషన్లు ఖరారు చేసి, ఓటర్ల జాబితాల ప్రచురణ, ఇతర ఏర్పాట్లు పూర్తిచేసి సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

1 hr ago
user_ఆకుల చంద్రమోహన్
ఆకుల చంద్రమోహన్
సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
1 hr ago
0cdd5096-d086-4388-b2cf-d42d0d248914

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌లపై విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, ఆ వివరాలను గ్రామసభల ముందుకు తీసుకెళ్తారని ఏజీ కోర్టుకు వివరించారు. ఈ ప్రక్రియ రెండు రోజులపాటు కొనసాగుతుందని, ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. బీసీల రిజర్వేషన్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ త్వరలోనే నివేదికను అందజేస్తుందని, ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తుందని ఏజీ నివేదించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ కోరగా, హైకోర్టు ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది. గతేడాది బీసీ సంఘం అధ్యక్షుడు హైకోర్టులో పిల్ దాఖలు చేస్తూ, బీసీ జనాభాను లెక్కించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు. బీసీ జనగణన చేపట్టి, ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏపీలో ఎన్నికలు నిర్వహించాలని లాయర్ యోగేష్ కూడా పిటిషన్ దాఖలు చేస్తూ, స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిందని కోర్టుకు తెలిపారు. ఏపీ హైకోర్టు ఈ రెండు పిటిషన్లపై విచారణ జరుపుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తిచేసి మిగిలిన ప్రక్రియలను వేగవంతం చేసింది. బీసీల రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను త్వరలోనే అందజేయనుంది. ఈ రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి రాగానే, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఏప్రిల్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి అనిల్‌చంద్ర పునేఠా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలక సమీక్షలు నిర్వహించారు. వచ్చే నెలలో రిజర్వేషన్లు ఖరారు చేసి, ఓటర్ల జాబితాల ప్రచురణ, ఇతర ఏర్పాట్లు పూర్తిచేసి సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈ సందేశం ద్వారా స్నేహితులందరికీ 'ప్రైస్ ది లార్డ్' మరియు 'గుడ్ మార్నింగ్' శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభువు కృప, సమాధానం అందరికీ తోడుగా ఉండాలని ఆకాంక్షించారు.
    1
    ఈ సందేశం ద్వారా స్నేహితులందరికీ 'ప్రైస్ ది లార్డ్' మరియు 'గుడ్ మార్నింగ్' శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభువు కృప, సమాధానం అందరికీ తోడుగా ఉండాలని ఆకాంక్షించారు.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వేముల మండలం భూమయ్యగారి పల్లె సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులు సాంబశివారెడ్డి, బయపు రెడ్డిలతో ఆలయ నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే విగ్రహ ప్రతిష్ట వేడుకల ఏర్పాట్లు, బండలాగుడు పోటీల నిర్వహణ గురించి కూడా ఎంపీ ఆరా తీశారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు ఉన్నారు.
    1
    వేముల మండలం భూమయ్యగారి పల్లె సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులు సాంబశివారెడ్డి, బయపు రెడ్డిలతో ఆలయ నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే విగ్రహ ప్రతిష్ట వేడుకల ఏర్పాట్లు, బండలాగుడు పోటీల నిర్వహణ గురించి కూడా ఎంపీ ఆరా తీశారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు ఉన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    28 min ago
  • మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.
    1
    మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఎర్రమట్టి దందాపై మాజీ మంత్రి జోగి రమేష్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు తాడేపల్లిలో అనుమతులు తీసుకుని, కందులపాడులో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మట్టి తింటూ కోట్లు సంపాదిస్తున్నాడని జోగి రమేష్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండేళ్లుగా ఈ అక్రమ మట్టి తరలింపు జరుగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ దోపిడీ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.
    1
    మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఎర్రమట్టి దందాపై మాజీ మంత్రి జోగి రమేష్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు తాడేపల్లిలో అనుమతులు తీసుకుని, కందులపాడులో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మట్టి తింటూ కోట్లు సంపాదిస్తున్నాడని జోగి రమేష్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండేళ్లుగా ఈ అక్రమ మట్టి తరలింపు జరుగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ దోపిడీ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    56 min ago
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు వ్యవహారం జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని సింగనగర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని తలపించడంతో పాటు, పోలీసు శాఖలోని క్రమశిక్షణ, చట్టాల అమలు, అధికారుల బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు సింగనగర్ ప్రాంతంలోని ఓ కానిస్టేబుల్ నివాసంలో తలదాచుకున్నారనే ప్రచారం ఉదయం నుంచే జోరందుకుంది, ఈ సమాచారం వెలుగులోకి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా, కృష్ణలంక ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేయడం మరింత చర్చకు దారితీసింది. వారు నాగరాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పూర్తి విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించడంతో పరిస్థితి రాజకీయ రంగు పులుముకున్నట్టుగా మారింది. అయితే, ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు అధికారులే చట్టపరమైన ప్రక్రియలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తూ, సాధారణ ప్రజలకు ఒక విధానం, అధికారులకు మరో విధానమా అని నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, కానీ చట్టపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసేలా నిరసనలు, ఒత్తిళ్లు తీసుకురావడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ పూర్తయ్యే వరకు చట్టం తన పని తాను చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు వీధుల్లోకి రావడం, అరెస్ట్ చేయొద్దంటూ డిమాండ్ చేయడం పట్ల సామాజిక మాధ్యమాల్లో కూడా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి, చట్టం ముందు అందరూ సమానమే అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రత్యేక రక్షణ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, విచారణ ఏ దశలో ఉంది, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ఆసక్తి కొనసాగుతోంది. మీడియా ముందు అధికారికంగా వివరాలు వెల్లడిస్తారా? లేక విచారణ అనంతరం మాత్రమే చర్యలు ప్రకటిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసు శాఖలో పనిచేసే అధికారిపై ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టపరమైన ప్రక్రియలు పారదర్శకంగా సాగాలని, ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. చట్టాలను అమలు చేసే వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే, బాధ్యులపై చట్టం ముందు సమానత్వం కనిపించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.
    1
    ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు వ్యవహారం జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని సింగనగర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని తలపించడంతో పాటు, పోలీసు శాఖలోని క్రమశిక్షణ, చట్టాల అమలు, అధికారుల బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు సింగనగర్ ప్రాంతంలోని ఓ కానిస్టేబుల్ నివాసంలో తలదాచుకున్నారనే ప్రచారం ఉదయం నుంచే జోరందుకుంది, ఈ సమాచారం వెలుగులోకి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇదిలా ఉండగా, కృష్ణలంక ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేయడం మరింత చర్చకు దారితీసింది. వారు నాగరాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పూర్తి విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించడంతో పరిస్థితి రాజకీయ రంగు పులుముకున్నట్టుగా మారింది. అయితే, ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు అధికారులే చట్టపరమైన ప్రక్రియలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తూ, సాధారణ ప్రజలకు ఒక విధానం, అధికారులకు మరో విధానమా అని నిలదీస్తున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాజీ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, కానీ చట్టపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసేలా నిరసనలు, ఒత్తిళ్లు తీసుకురావడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ పూర్తయ్యే వరకు చట్టం తన పని తాను చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు వీధుల్లోకి రావడం, అరెస్ట్ చేయొద్దంటూ డిమాండ్ చేయడం పట్ల సామాజిక మాధ్యమాల్లో కూడా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి, చట్టం ముందు అందరూ సమానమే అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రత్యేక రక్షణ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, విచారణ ఏ దశలో ఉంది, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ఆసక్తి కొనసాగుతోంది. మీడియా ముందు అధికారికంగా వివరాలు వెల్లడిస్తారా? లేక విచారణ అనంతరం మాత్రమే చర్యలు ప్రకటిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసు శాఖలో పనిచేసే అధికారిపై ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టపరమైన ప్రక్రియలు పారదర్శకంగా సాగాలని, ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. చట్టాలను అమలు చేసే వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే, బాధ్యులపై చట్టం ముందు సమానత్వం కనిపించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్‌ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు. పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్‌ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్‌ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు.

పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్‌ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • కడప జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాలవ పాపాగ్ని నదిలో ఇసుక క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డి గారి పల్లెకు చెందిన రాజవర్ధన్ రెడ్డి (16) మరియు జయంతి రెడ్డి (18)గా మృతులను గుర్తించారు. బంధువుల ఇంటికి వచ్చిన ఈ యువకులు సరదాగా ఇసుక క్వారీ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే తమ పిల్లలు చనిపోయారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలతో పాపాగ్ని నదిలో ఆందోళన నిర్వహించిన గ్రామస్తులు, క్వారీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కాగా, అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు బాధ్యులపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు.
    1
    కడప జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాలవ పాపాగ్ని నదిలో ఇసుక క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డి గారి పల్లెకు చెందిన రాజవర్ధన్ రెడ్డి (16) మరియు జయంతి రెడ్డి (18)గా మృతులను గుర్తించారు. బంధువుల ఇంటికి వచ్చిన ఈ యువకులు సరదాగా ఇసుక క్వారీ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అక్రమ ఇసుక తవ్వకాల వల్లే తమ పిల్లలు చనిపోయారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలతో పాపాగ్ని నదిలో ఆందోళన నిర్వహించిన గ్రామస్తులు, క్వారీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కాగా, అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు బాధ్యులపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.