Shuru
Apke Nagar Ki App…
పెదకూరపాడు లో జనగణన సర్వేపై అవగాహనా ర్యాలీ... పాల్గొన్న తహసిల్దార్.. పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.
Raju Paragati
పెదకూరపాడు లో జనగణన సర్వేపై అవగాహనా ర్యాలీ... పాల్గొన్న తహసిల్దార్.. పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.1
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1