రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు వడ్లు అమ్మాలి దళారులను నమ్మి మోసపోవద్దు :మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ భీంగల్ మండలం చెంగల్ గ్రామంలో FSCS సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో AEO స్నేహ మాజీ చైర్ పర్సన్ కన్నె సురేందర్, గమున్సిపల్ కౌన్సిలర్లు సంగ్య నాయక్, కాంగ్రెస్ నాయకులు పర్స అనంత్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సాపురం జీవన్, , FSCS C.E.O రవి, మరియు సిబ్బంది, భీంగల్ మండలం వివిధ గ్రామాల సర్పంచులు జనార్ధన్,అశోక్, రమేష్ సర్దార్,గణేష్, జాగిరియాల్ మాజీ సర్పంచ్ రత్నం ,చెంగల్ గ్రామ సర్పంచ్ దుమాల మమతా రాజు గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ రవి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూతుల రమేష్ అడ్పా రాజేశ్వర్ నూతుల వసంత్ శోభన్ గౌడ్ ఆనంద్ గౌడ్ తూర్పు శ్రీధర్ గిర్ణి నర్సారెడ్డి ప్రశాంత్ గౌడ్ తక్కూరి లింబాధ్రి గ్రామ రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు వడ్లు అమ్మాలి దళారులను నమ్మి మోసపోవద్దు :మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ భీంగల్ మండలం చెంగల్ గ్రామంలో FSCS సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో AEO స్నేహ మాజీ చైర్ పర్సన్ కన్నె సురేందర్, గమున్సిపల్ కౌన్సిలర్లు
సంగ్య నాయక్, కాంగ్రెస్ నాయకులు పర్స అనంత్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సాపురం జీవన్, , FSCS C.E.O రవి, మరియు సిబ్బంది, భీంగల్ మండలం వివిధ గ్రామాల సర్పంచులు జనార్ధన్,అశోక్, రమేష్ సర్దార్,గణేష్, జాగిరియాల్ మాజీ సర్పంచ్ రత్నం ,చెంగల్ గ్రామ సర్పంచ్ దుమాల మమతా
రాజు గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ రవి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూతుల రమేష్ అడ్పా రాజేశ్వర్ నూతుల వసంత్ శోభన్ గౌడ్ ఆనంద్ గౌడ్ తూర్పు శ్రీధర్ గిర్ణి నర్సారెడ్డి ప్రశాంత్ గౌడ్ తక్కూరి లింబాధ్రి గ్రామ రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు1
- షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్1
- Post by Vishwamber Rao1
- 18 సంవత్సరాల లోపు మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలిమెల రాజు, ఆర్టిఏ అధికారులు ఉన్నారు.1
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం. మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి..మెదక్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్,సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం.చంద్రకళ రాధ,నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం,లింగా రెడ్డి, ప్రభు రెడ్డి,కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్,రవి లక్ష్మీనారాయణ,దశరథం,ఇందాడ్,సంతోష్ ,వెంకట్,ఆంజనేయులు,ప్రభాకర్ ,లక్ష్మణ్,కిషన్,మోహన్,ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.1
- అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్స్ మన్సూర్, తొడుపునూరి రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు వారం రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత పోస్టర్ ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి నివాసం లో వారి చేతులమీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ ప్రారంభించిన అగ్నిమాపక ఆఫీసర్ మరియు సిబ్బంది.. ఈ కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు...1
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయబడింది. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. _రహదారి భద్రతా ప్రతిజ్ఞ_ నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.1
- జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.1