పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం _మల్కాజిగిరి సీపీ అవినాష్ మహంతి అభినందనలు – విశ్రాంత జీవితానికి శుభాకాంక్షలు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీ అవినాష్ మహంతి ఐపీఎస్ పాల్గొని, వారి సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.పదవీ విరమణ పొందిన వారిలో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కె. కరుణాకర్ రెడ్డి, ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసిన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పి. సత్యనారాయణ చారి, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఎన్. జైరాం, వై. సాయిబాబా, ఏ. మూర్తుజా, అలాగే హోమ్ గార్డ్ అధికారులు కె. పద్మారావు, బి. బాలనర్సమ్మ ఉన్నారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో క్రమశిక్షణతో సేవలందించినందుకు అధికారులను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు. అలాగే పెన్షన్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, సీఏఓ అడ్మిన్ శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్. భద్రా రెడ్డి, కో-ఆపరేటివ్ డైరెక్టర్ సువర్ణ, వల రాజు తదితరులు పాల్గొన్నారు.

- తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ రూ.16 కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తంచేశారు.కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు రేపటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.2
- full night open this hotel purani Haveli request to Hyderabad City Police take action1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు4
- సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మార్చి 31. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇందుప్రియల్ గ్రామంలో శ్రీ సీతారామ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి మరియు గ్రామస్తులు అంత భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ ఆలయంలో పూజలు నిర్వహించారు. PACS చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. మరియు గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మాట్లాడుతూ ఐదు రోజులుగా గ్రామంలో ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఉత్సవం విజయవంతంగా జరిపించినందుకు గ్రామస్తులకు మరియు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- వికారాబాద్, కొడంగల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమేరా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వినయం కానీ అటువంటి శివశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని సరఫరా గురించి తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అరేయ్ అరేయ్ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతిరోజు ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్మణ్ తెలిపారు.1
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.1
- Post by Ali ammu1