Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యత లభించింది. మల్యాల మండలం, బల్వంతాపూర్ గ్రామానికి చెందిన నక్క అనిల్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకంపై మల్యాల మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నక్క అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్ గౌడ్, శనిగరపు తిరుపతి, మిల్ట్రీ శ్రీనివాస్, మ్యాక లక్ష్మణ్ సాయి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Srinivas Nerella
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యత లభించింది. మల్యాల మండలం, బల్వంతాపూర్ గ్రామానికి చెందిన నక్క అనిల్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకంపై మల్యాల మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నక్క అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్ గౌడ్, శనిగరపు తిరుపతి, మిల్ట్రీ శ్రీనివాస్, మ్యాక లక్ష్మణ్ సాయి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.1
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 15న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరగనుంది. ఆదివారం రోజున సిపిఎం జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రాభవన్లో ఈ మహా ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగులు మరియు యువత వేలాదిగా తరలివచ్చి ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై వాసుదేవరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్, 12 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రశ్నించే యువతకు పకోడీలు, బజ్జీలు వేయడం కూడా ఉద్యోగమేనంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖల్లో దాదాపు 10 లక్షల పోస్టులు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థల్లో సుమారు 37 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్ సెక్టార్‌కు అప్పగిస్తూ ఉద్యోగాలను కుదించేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేసిందని వాసుదేవరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు గడుస్తున్నా కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని దుయ్యబట్టారు. 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు గానూ కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, స్వయం ఉపాధి రుణాలకు నిధులు మంజూరు చేయకుండా రాజీవ్ యువ వికాసం పథకాన్ని పక్కనబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏటా 9 వేల మంది పదవీ విరమణ పొందుతున్నారని, ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, డీఎస్సీ, జెఎల్, డిఎల్, గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు అన్ని శాఖల్లోని ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నెలకు ₹5,000 నిరుద్యోగ భృతి అందించాలని, వివాదాస్పద జీవోలను తొలగించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, జి రాజేశం, నాయకులు రాయి కంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, మాతంగి శంకర్, చల్ల లక్ష్మణ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.2
- కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని చర్ల బూత్కూరు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రక్రియకు సంబంధించిన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పిలుపు మేరకు బూత్ ఇన్‌ఛార్జులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సహాయ కేంద్రంలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుకర్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, వార్డ్ మెంబర్ తప్పెట్ల నరేష్‌తో పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీళ్లు అడిగే తమ బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని, రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని చల్మెడ విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ప్రశ్నించగా, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటను తడుపుతానని సీఎం సమాధానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే, మమ్మల్ని కోసి మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా అంటూ నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.1
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల చేప పిల్లలు మృతి చెందుతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనాధారానికి ఎంతో కీలకమైన తోటపల్లి రిజర్వాయర్ను కాలుష్యానికి గురిచేయడం సరికాదని ఆయన శనివారం అన్నారు. కలుషితమైన ఈ నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల భూముల సారవంతం తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిజర్వాయర్లోకి వ్యర్థ జలాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలన్నారు. ప్రజా సమస్యలపై నిరసనగా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమాల మహేష్, వంగల నరేష్, వార్డు సభ్యులు తిప్పరపు మహేష్, పొట్లపెల్లి శివ, రామంచ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.1
- మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలో ఆదివారం నిర్వహించిన అఖిల భారత విశ్వకర్మ మహాసభలో ఆ సంఘం అధ్యక్షులు కౌలే జగన్నాథం పాల్గొని మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహాసభలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు చర్చించారు. విశ్వబ్రాహ్మణులు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణిస్తేనే అభివృద్ధి సాధ్యమని జగన్నాథం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.1
- వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.1
- జగిత్యాల నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి సాయం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, సీఎం సహాయ నిధి నుండి మొత్తం 9 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. దీనికి సంబంధించి మంజూరైన రూ. 1 లక్షల 50 వేల విలువ గల చెక్కులను శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీష్, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శి కొండపల్కల రత్నాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు వొళ్ళాల గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, పెండేం గంగాధర్, చిరంజీవి, నందు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.1