logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ఫ్లై ఓవర్ నిర్మాణం కేశవరం ప్రజలకు వరమా? లేక శాపమా? ఫ్లైఓవర్ నిర్మాణం కేశవరానికి వరమా లేక శాపమా అది ఏమిటో చూద్దాం! పూర్తిగా చదవండి వివరాల్లోకి వెళితే మొన్నటి రోజున మన కేశవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి గురించి పేపర్లో ప్రకటన వచ్చింది ఎవరెవరి భూములు ఫ్లైఓవర్ అలైన్మెంట్ లోకి వస్తున్నాయో దీనిలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ఫ్లైఓవర్ కడియం వైపు పోతురాజు తూముకి, అవతల అంటే జీవీకే కి దగ్గరగా చేబోలు రాఘవగారు పొలం దగ్గర నుంచి మొదలయ్యి పోతురాజు చెరువు గట్టు మీద ఉన్న జమ్మి చెట్టుకు అవతల ల్యాండ్ అవుతుంది అంటే మనం ద్వారపూడి వెళ్లాలి అంటే ఫ్లైఓవర్ కి అట్నుంచి సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి వస్తే మన రైల్వేగేటు దగ్గరికి వస్తాం దీనివల్ల దూరం ఎక్కువ అవ్వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా అంటే ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహాన్ని స్మశానానికి తీసుకువెళ్లడానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాలి అంతేకాకుండా కాలువ అవతల పొలం ఉన్న రైతులు పొలం వెళ్లాలన్న పొలంలోకి వెళ్లి గడ్డిమోపులు తెచ్చుకోవాలన్న పొలంలోకి పిండి మూటలు పట్టుకు వెళ్లాలన్న సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాలి ఎందుకంటే రైల్వే ట్రాక్ మీదకు ఎవరు రాకుండా రైల్వే వాళ్ళు పెన్షింగ్ వేసేస్తారు దానివలన ఆర్టీసీ బస్సు ఎక్కాలి అన్న చుట్టూ తిరిగి రావాలి అంటే కేశవరం గ్రామస్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి అంటే ప్రస్తుతం కేశవరం పక్క గ్రామం ఎర్రంపాలెం వాళ్ళు ఆ ఊరి నుంచి ఆటో పెట్టుకుని కేశవరం బస్టాండ్ కి ఎలా వస్తున్నారో ఫ్లై ఓవర్ నిర్మాణం తర్వాత కేశవరం గ్రామస్తులు కూడా ఊళ్లో నుంచి ఆటో మీద బస్టాండ్ వరకు వెళ్లాలి అలాకాకుండా గ్రామంవైపు నుంచి అండర్ గ్రౌండ్ రూటు వేయడానికి రోడ్డును చేర్చి కాలువ ఉండటంవల్ల అది సాధ్యం కాదు అంతేకాకుండా మనం ద్వారపూడి గానీ మండపేట గాని అనపర్తి గాని వెళ్లాలంటే మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఎక్స్ ట్రా తిరిగి రావాలి దీనివల్ల వచ్చే ప్రధాన ఇబ్బంది ఏమిటంటే మన పల్లపు వీధి ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది ఎందుకంటే మేడపాడు ఊరు చివర నుంచి ద్వారపూడి పుంత రోడ్డులోకి ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది మనం ద్వారపూడి గానీ మండపేట గాని అనపర్తి గాని వెళ్లాలంటే ఈ పుంత రోడ్డు లోనుంచి వెళితే దగ్గరగా ఉంటుంది అటువంటప్పుడు ప్రయాణికులు అందరూ కూడా ఈ దారి గుండా వెళ్లడానికే సుముఖత చూపుతారు భవిష్యత్తులో ఈ రోడ్డుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది ప్రస్తుతం రైల్వే గేట్ లో ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ మొత్తం భవిష్యత్తులో ఇటువైపు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ నుంచి వెనుకకు కడియం వైపు వెళ్ళడం వలన దూరం పెరగడంతో ఇటువైపు రావడానికి మొగ్గు చూపుతారు దానివలన ట్రాఫిక్ పెరగడంతో ఈ రోడ్డును వెడల్పు చేయడం జరుగుతుంది పెరిగిన ట్రాఫిక్ కి అనుగుణంగా రోడ్డును వెడల్పు చేయవలసి వస్తుంది రోడ్డు వెడల్పు చేసినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ళ నిర్మాణాలను తొలగించవలసి వస్తుంది అంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్న సామెత చెప్పినట్టు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ఆంజనేయస్వామి గుడి నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు తమ ఇళ్ళను కోల్పోబోతున్నారు వీళ్ళందరూ ఇప్పుడే మేలుకుని ప్లై ఓవర్ నిర్మాణం అలైన్మెంట్ ప్లానింగ్ మార్పించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు చాలామంది ఇళ్ళ నిర్మాణాలను కోల్పోవాల్సి ఉంటుంది కావున ఆంజనేయస్వామి గుడి నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలందరూ భవిష్యత్తులో తమ ఇళ్ళను కోల్పోవలసి వస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఫ్లై ఓవర్ ఊరిని చేర్చి కాకుండా ఊరికి దూరంగా వెళ్లిపోవడం వలన కేశవరం గ్రామం మరుగున పడిపోయే ప్రమాదం ఉందని గ్రామంలో కొందరు పెద్దలు వాపోతున్నారు దీనివలన కేశవరం మెయిన్ రోడ్డులో ఉన్న వ్యాపారస్తులు అందరూ తమ వ్యాపారాలు కోల్పోతామని వ్యాపారస్తులు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊరు డెవలప్ మెంట్ కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు అని కేశవరం గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు కావున కేశవరం అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు అధికారులు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని దీనిగురించి పునరాలోచన చేయాలని కేశవరం గ్రామ ప్రజలు కోరుతున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 2వ తారీఖు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు ఈ లోగా గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు అందరూ దేనికి ఒక పరిష్కారం కనుక్కుంటే మంచిదని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.

1 day ago
user_Nandikolla Raju
Nandikolla Raju
Biscuit Shop మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
1 day ago
daae35c5-25f9-40ea-b9ee-5853a1d31981

More news from Andhra Pradesh and nearby areas
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • brother రిలేషన్
    1
    brother రిలేషన్
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం కు మహర్దశ... అబివృద్ధి పనులకు 15 కోట్లు విడుదల... పెమ్మసాని
    1
    గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం కు మహర్దశ... అబివృద్ధి పనులకు 15 కోట్లు విడుదల... పెమ్మసాని
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు
    2
    పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు
    user_User3320
    User3320
    Journalist Sattenapalle, Palnadu•
    23 hrs ago
  • ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.
    1
    ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.
    user_కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    1 hr ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.