logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సత్తుపల్లి మండలంలోని VB-G RAM-G ఉద్యోగులు (APO, EC, TAs and COs) పెన్‌డౌన్ కార్యక్రమం VB-G RAM-G పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నేడు VB-G RAM-G ఉద్యోగులందరూ పెన్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, సకాలంలో వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యోగ భద్రతతో పాటు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించి, పే స్కేల్ అమలు చేయడంతో పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించేలా తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించబడే వరకు ఉద్యోగుల ఐక్యతతో ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యోగ భద్రతతో పాటు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించి, పే స్కేల్ అమలు చేయడంతో పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించేలా తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించబడే వరకు ఉద్యోగుల ఐక్యతతో ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

4 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
4 hrs ago
d4ac8e4d-3d39-4d64-a914-493bbf9d9602

సత్తుపల్లి మండలంలోని VB-G RAM-G ఉద్యోగులు (APO, EC, TAs and COs) పెన్‌డౌన్ కార్యక్రమం VB-G RAM-G పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నేడు VB-G RAM-G ఉద్యోగులందరూ పెన్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, సకాలంలో వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యోగ భద్రతతో పాటు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించి, పే స్కేల్ అమలు చేయడంతో

f8fe37f1-59c4-4f13-b784-61b04e495e76

పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించేలా తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించబడే వరకు ఉద్యోగుల ఐక్యతతో ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యోగ భద్రతతో పాటు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించి, పే స్కేల్ అమలు చేయడంతో పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించేలా తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించబడే వరకు ఉద్యోగుల ఐక్యతతో ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్‌ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
    1
    ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం
సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్‌ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది. భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు .
    1
    భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు
ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది.
భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  అభినందించారు .
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    1
    భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు
    1
    మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి.

🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం
🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి
🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి
🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు
🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.