ఘనంగా రజక సంఘం షాద్ నగర్ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం *వీకన్వెన్షన్ హాల్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశం* *రజక సంఘం అభివృద్ధికై పనిచేయాలని పిలుపునిచ్చారు* షాద్‌నగర్ నియోజకవర్గ స్థాయి రజక సంఘం ఆత్మీయ సమ్మేళనం మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని వీకన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రజక సామాజిక వర్గ నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రజక సంఘం బలోపేతం, సామాజిక ఐక్యత, సంఘటితంగా ముందుకు సాగడం, రజక సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అలాగే ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు, రజక వృత్తిదారుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.సమ్మేళనంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల రజక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రజక సామాజిక వర్గం అభివృద్ధి, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగం నాయకులు చిలకమర్రి నర్సింహులు, నందిగామ రామచందర్, విద్యాల పెంటయ్య, చించోడు అనంతం, ఎలుక గూడెం సర్పంచ్ బందయ్యా, కొందుర్గు రామస్వామి, నందిగామ నర్సింలు, కేశంపేట్ రాములు, పాపిరెడ్డి గూడ యాదయ్య, లింగారెడ్డి గూడా ఉపసర్పంచ్ అశోక్, చేగూరు ఉపసర్పంచ్ శివ, దేవగిరి నవీన్, నందిగామ శేఖర్, నర్సింలు, తీగపూర్ ఆంజనేయులు, దేవగిరి రామకృష్ణ,బుడంపాడు నరసింహులు, మొగిలిగిద్ద సత్యం, ఎలికట్ట చంద్రయ్య, నందిగాం బాలరాజ్, మీడియా సోదరులు శ్రీశైలం, రమేష్, శ్రీనివాస్, అలుగొండ శీను,మరియు తదితరులు సంఘం నాయకుడు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
ఘనంగా రజక సంఘం షాద్ నగర్ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం *వీకన్వెన్షన్ హాల్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశం* *రజక సంఘం అభివృద్ధికై పనిచేయాలని పిలుపునిచ్చారు* షాద్‌నగర్ నియోజకవర్గ స్థాయి రజక సంఘం ఆత్మీయ సమ్మేళనం మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని వీకన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రజక సామాజిక వర్గ నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రజక సంఘం బలోపేతం, సామాజిక ఐక్యత, సంఘటితంగా ముందుకు సాగడం, రజక సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అలాగే ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు, రజక వృత్తిదారుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.సమ్మేళనంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల రజక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య
నాయకులు, ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రజక సామాజిక వర్గం అభివృద్ధి, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగం నాయకులు చిలకమర్రి నర్సింహులు, నందిగామ రామచందర్, విద్యాల పెంటయ్య, చించోడు అనంతం, ఎలుక గూడెం సర్పంచ్ బందయ్యా, కొందుర్గు రామస్వామి, నందిగామ నర్సింలు, కేశంపేట్ రాములు, పాపిరెడ్డి గూడ యాదయ్య, లింగారెడ్డి గూడా ఉపసర్పంచ్ అశోక్, చేగూరు ఉపసర్పంచ్ శివ, దేవగిరి నవీన్, నందిగామ శేఖర్, నర్సింలు, తీగపూర్ ఆంజనేయులు, దేవగిరి రామకృష్ణ,బుడంపాడు నరసింహులు, మొగిలిగిద్ద సత్యం, ఎలికట్ట చంద్రయ్య, నందిగాం బాలరాజ్, మీడియా సోదరులు శ్రీశైలం, రమేష్, శ్రీనివాస్, అలుగొండ శీను,మరియు తదితరులు సంఘం నాయకుడు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
- సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ఘనంగా ప్రత్యేక పూజలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ హాజరు గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, దీపక్ జాన్ ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో నిర్వహించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.4
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది “గణేష్ సురక్ష సంకల్ప్–2026” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. “మన గణేష్ – మన భద్రత” అనే నినాదంతో భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతగా, క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సిపి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 వేలకుపైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాలని సూచించగా, ఇప్పటివరకు సుమారు 6,500 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఉత్సవాల బందోబస్తు కోసం అన్ని స్థాయిలకు చెందిన 5,749 మందికిపైగా పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. అదనంగా ఇతర జిల్లాలు, ప్రత్యేక విభాగాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు సుమారు 1,200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.1
- మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.1
- హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు టిప్పర్ ఢీ.. హైదరాబాద్ లోని హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన 20 మంది ప్రయాణికులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.1
- బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో అరాచకత్వం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ ఉండగా మాస్కులు ధరించి దాడికి యత్నించిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు... బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఎదురు తిరగడంతో పారిపోయిన వైనం.1
- తెలంగాణలో MEOల కొరతపై కవిత ఆందోళన ప్రతి మండలానికి ఎంఈఓ ఉండాలి తెలంగాణలో సుమారు 620 మండలాలు ఉండగా, ప్రతి మండలానికి ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) ఉండాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కవిత అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 మండలాల్లో మాత్రమే పర్మనెంట్ MEOలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. విద్యాశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన MEO పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా పరిపాలనపై ప్రభావం పడుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి శాశ్వత MEOను నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- జహీరాబాద్ తెలంగాణ జహీరాబాద్లో జై సెక్యులరిజం.. మా ఏరియాలో వినాయక చవితి ఎలా జరుపుకుంటారు అని గోడవ చేస్తున్న మరక శాంతి కాముకులు..!బిజెపి అధికారంలో లేకపోతే మా హిందువుల పరిస్తితి ఏంటో తెలుసా కనీసం ఇంట్లో పూజలు చేయడానికి కూడా పర్మిషన్ NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) తీసుకోవాలి...!.1
- కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1