logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హుకుంపేటలో వ్యాన్ బోల్తా – డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.... హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

4 days ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
4 days ago

హుకుంపేటలో వ్యాన్ బోల్తా – డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.... హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More news from Kakinada and nearby areas
  • పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
    3
    పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు.
కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.  వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    18 hrs ago
  • శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు
    1
    శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు
    user_యదీద్యా అభి శర్మ
    యదీద్యా అభి శర్మ
    పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస లో గల ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల పెంపు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యా విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ స్వయంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామం లో ప్రధాన వీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నత విద్య, ఉన్నత ప్రమాణాలు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పలు సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఆధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత బోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం ,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని వివరించారు.
    4
    శ్రీకాకుళం జిల్లాఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస లో గల ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల పెంపు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యా విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస  శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్  కూన రవికుమార్  స్వయంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామం లో ప్రధాన వీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నత విద్య, ఉన్నత ప్రమాణాలు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పలు సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఆధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత బోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం ,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని వివరించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 min ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    1
    *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన*
*14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం*
*ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా*
*కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్*
*పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* 
భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC  మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA  అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు.
ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం 
వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై  వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    user_Shivaram
    Shivaram
    Accountant బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    21 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ​పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ​ఘటన వివరాల్లోకి వెళ్తే... ​పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, ​మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ​న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ​ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
    1
    ​పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ​ఘటన వివరాల్లోకి వెళ్తే... ​పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని,
​మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే  అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ​న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ​ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    21 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామపంచాయతీ సెలగ పేట జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కు సంతబొమ్మాలి మండలం మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలలో 25 సంవత్సరాలు యువకుడిలా రాష్ట్రం కోసం రాత్రి పగలు రోజుకి 20 గంటలు నిద్ర హారాలు మాని పనిచేస్తున్నారని నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రిని చూశానని ఈ కూటమి ప్రభుత్వం లో జరుగుతున్న పరిపాలన ఎన్నడు జరగలేదని అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడుకి వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ సహకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు రాష్ట్రానికి చల్లగా ఉండే రాష్ట్రం మరింత ప్రగతి పదములు నడవాలని చంద్రబాబు నాయుడుకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు భగవంతుడు కలిగించాలని మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా రాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామపంచాయతీ సెలగ పేట జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కు సంతబొమ్మాలి మండలం మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలలో 25 సంవత్సరాలు యువకుడిలా రాష్ట్రం కోసం రాత్రి పగలు రోజుకి 20 గంటలు నిద్ర హారాలు మాని పనిచేస్తున్నారని నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రిని చూశానని ఈ కూటమి ప్రభుత్వం లో జరుగుతున్న పరిపాలన ఎన్నడు జరగలేదని  అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడుకి వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ సహకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు రాష్ట్రానికి చల్లగా ఉండే రాష్ట్రం మరింత ప్రగతి పదములు నడవాలని చంద్రబాబు నాయుడుకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు భగవంతుడు కలిగించాలని మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా రాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.