సామాజిక సేవే వ్యక్తిత్వ వికాసానికి పునాది ఎచ్చెర్ల, డిసెంబర్ 19: విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే కాకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి సామాజిక సేవ ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం ప్రాంగణ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ పేర్కొన్నారు. వర్సిటీ డైరెక్టర్ బాలాజీ, ఏఓ ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణల ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో శుక్రవారం పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్.ఎం.పురం, ఎచ్చెర్ల గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో నరసన్నపేట డిప్యూటీ తహశీల్దార్ పి. శ్రీనివాసరావు పాల్గొని వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఎచ్చెర్ల అసిరితల్లి ఆలయ ప్రాంగణంలో యోగా ఫ్యాకల్టీ రఘురాం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో కలిసి వాలంటీర్లు యోగా, ధ్యానం నిర్వహించారు. గ్రామాల్లో చైతన్యమే లక్ష్యంగా జరిగిన ఈ పర్యటనలో భాగంగా.. ఎస్.ఎం.పురంలో పశువైద్యాధికారి డా. జి. సురేష్ కుమార్ పాడి అభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు. కేశవరావుపేటలో సచివాలయం, పాఠశాల పరిసరాలను వాలంటీర్లు శుభ్రం చేయగా.. బురిడి కంచరాం గ్రామంలో రోడ్డు భద్రత, స్త్రీ-పురుష సమానత్వం, మాదకద్రవ్యాల వ్యతిరేకతపై ప్రదర్శనలు చేపట్టారు. ఎస్.ఎస్.ఆర్ పురంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డా. పెద్దింటి ముకుందరావు, ప్రోగ్రాం అధికారులు డా. వి. సింహాచలం, డా. బి. శ్రీధర్, పి. గాయత్రి, టి. అసిరినాయుడు, ఆర్. పద్మావతి పాల్గొన్నారు.
సామాజిక సేవే వ్యక్తిత్వ వికాసానికి పునాది ఎచ్చెర్ల, డిసెంబర్ 19: విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే కాకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి సామాజిక సేవ ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం ప్రాంగణ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ పేర్కొన్నారు. వర్సిటీ డైరెక్టర్ బాలాజీ, ఏఓ ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణల ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో శుక్రవారం పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్.ఎం.పురం,
ఎచ్చెర్ల గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో నరసన్నపేట డిప్యూటీ తహశీల్దార్ పి. శ్రీనివాసరావు పాల్గొని వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఎచ్చెర్ల అసిరితల్లి ఆలయ ప్రాంగణంలో యోగా ఫ్యాకల్టీ రఘురాం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో కలిసి వాలంటీర్లు యోగా, ధ్యానం నిర్వహించారు. గ్రామాల్లో చైతన్యమే లక్ష్యంగా జరిగిన ఈ పర్యటనలో భాగంగా.. ఎస్.ఎం.పురంలో పశువైద్యాధికారి డా. జి. సురేష్ కుమార్ పాడి అభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు. కేశవరావుపేటలో
సచివాలయం, పాఠశాల పరిసరాలను వాలంటీర్లు శుభ్రం చేయగా.. బురిడి కంచరాం గ్రామంలో రోడ్డు భద్రత, స్త్రీ-పురుష సమానత్వం, మాదకద్రవ్యాల వ్యతిరేకతపై ప్రదర్శనలు చేపట్టారు. ఎస్.ఎస్.ఆర్ పురంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డా. పెద్దింటి ముకుందరావు, ప్రోగ్రాం అధికారులు డా. వి. సింహాచలం, డా. బి. శ్రీధర్, పి. గాయత్రి, టి. అసిరినాయుడు, ఆర్. పద్మావతి పాల్గొన్నారు.
- Post by Omnamashivaya S1
- సుపరిపాలనకు వాజ్‌పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్‌పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1