క్రషర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. బ్లాస్టింగ్ వల్ల బోర్లు నష్టపోయిన రైతుకు పరిహారం ఇప్పించాలి.దుమ్ము వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలి CPM జిల్లా కార్యదర్శి A.వెంకటస్వామి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ శివారులో మెగా కంపెనీ వారు భారత్ మాల రోడ్డు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన కంకర క్రషర్ మిషన్ వల్ల చుట్టు పక్కల పంటపొలాలు దుమ్ము, ధూళి తో నిండిపోయి రైతులు పంటలు నష్టపోతున్నారని,కంకరకోసం పక్కన ఉన్న జోగన్ గట్టు గుట్టలో పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ పెట్టీ పగలగొడుతున్నారని,బ్లాస్టింగ్ శబ్దానికి భూమి కంపించి పక్కన సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు కు చెందిన వ్యవసాయ పొలంలో గత రెండు సంవత్సరాల క్రితం బోరు మోటార్ భూమిలో కుంగి పోయిందని,ఇట్టి విషయమై క్రషర్ కంపెనీ యాజమాన్యానికి ఆ రైతు గత సంవత్సర కాలంగా పిర్యాదులు చేసినా పట్టించు కోవడం లేదని,బోరు మునిగి పోవడము,నీరు లేక మూడు ఎకరాల భూమి బీడుగా మారడము చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం వల్ల రైతు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడని యేసు ఆత్మహత్యా యత్నానికి క్రషర్ కంపెనీ యాజమాన్యమే కారణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు.పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతున్న సల్కాపురం గ్రామానికి చెందిన రైతు ఏసును బుధవారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి నందు CPM జిల్లా కమిటీ బృందం పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ రైతు ఏసుకు జరిగిన నష్టానికి కారణం క్రషర్ కంపెనీ యాజమాన్యమేనని బోరు మోటార్ కు మరియు పంట నష్టానికి పూర్తిగా పరిహారం క్రషర్ కంపెనీ యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రషర్ నిర్వహణకు గుట్టల్లో రాళ్లు తీసుకోవడానికి దుమ్ము ధూళి పంట పొలాలు గ్రామాల్లోకి వస్తున్నందుకు వీటన్నింటికీ ప్రభుత్వ అనుమతులు జిల్లా అధికారులు పరిశీలించాలని అన్నారు.జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకొని కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతు ఏసుకు పూర్తిగా నష్టపరిహారం కంపెనీతో ఇప్పించాలని డిమాండ్ చేశారు.హాస్పటల్లో రైతును సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రేపల్లె దేవదాసు, వివి.నరసింహ పరామర్శించడం జరిగింది .

- ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.2
- నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.1
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- చిన్నకడబూరులో శివాలయ దేవాలయంకు వైభవంగా నూతన ధ్వజస్తంభం మహోత్సవం వేడుకలు పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఉన్న శ్రీ అంజినేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయ దేవాలయంకు నూతన ధ్వజస్తంభంను బుధవారం వైభవంగా జరిగింది.ఈ నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ధనుర్లగ్న శుభ ముహూర్తమున పండితులు వేద మంత్రాలు పఠిస్తుండంగా ఆలయ ధర్మకర్త గౌళ్ళ నల్లారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఆలయ,గ్రామ పెద్దల సమక్షంలో అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ,కమిటీ పెద్దలు బుధవారం తెలిపారు.ప్రత్యేకంగా హోమం ద్వారా శివాలయ దేవాలయం నందు భ్రమరాంబిక,గణపతి,కుమారస్వామి, విగ్రహాలకు అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలను గౌరవించారు.వేద పండితులు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం కాల్చిన అనంతరం శివాలయ దేవాలయముకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు వచ్చిన భక్తాదులు ప్రత్యేక పూజలు గావించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు, మల్లికార్జున,ఆలయ పెద్దలు గౌళ్ళ నల్లారెడ్డి,తయాన్న,నారాయణస్వామి,ముత్తన్న,కోడిగుడ్ల లక్ష్మన్న, వీరారెడ్డి,ఎల్లన్న ,గిడ్డయ్య,సొసైటీ డైరెక్టర్ యం.జి నరసన్న,కోస్గి డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న,బుసిరెడ్డి, జనసేన నాయకులు మహదేవ, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,శివాలయం స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.2
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు...1
- ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.1