Shuru
Apke Nagar Ki App…
Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की बातें 🙏♥️ Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की
M.RAJKIRAN REDDY
Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की बातें 🙏♥️ Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की
More news from తెలంగాణ and nearby areas
- పత్రికా ప్రకటన ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్: ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్‌కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది. జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి. “మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి. నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్‌లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది. ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి. 3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది. వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది. ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్‌సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి. విద్యలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి. గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది. దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్‌లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్‌లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్‌లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది. నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్, Shri Vivek Laxmikant Bhimanwar స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి శేష వస్త్రం, లడ్డూ మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది1
- *మేధావులారా....డీలిమిటేషన్, మహిళా బిల్లుపై పెదవి విప్పండి* *మీ మౌనం సమాజానికి అరిష్టం* *సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే ప్రయోజనాలను వివరించండి* *కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి* *మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే* *మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని కాంగ్రెస్ కూటమి తీరని ద్రోహం చేసింది* *సోనియా, ప్రియాంక, డింపుల్, కనిమోళి, సుప్రియాలకు పదవులిస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లా?* సాధారణ మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టకూడదా? కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు.’’అని అన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం + రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా.’’అని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని శుభమంగళ కన్వెన్షన్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బస సత్యనారాయణ, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, కార్పొరేటర్లు వాసాల రమేశ్, గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేధావులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ఏమన్నారంటే.... అంబేద్కర్ బీజేపీ నాయకుడు కాదు. అయినా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను, ఆయన ఆలోచనా విధనాలను, ఆశయాలను గల్లీగల్లీకి తీసుకెళ్లాలని బీజేపీ ఎందుకు అనుకుంటోంది? ఎందుకంటే అణగారిన వర్గాల ప్రజల వెలుగు రేఖ అంబేద్కర్... అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి. అలుపెరగని పోరాటానికి మరో రూపం. సమాజంలోని అట్టడుగు వర్గాల సమానత్వం, స్వేచ్ఛ, హక్కులకు సజీవ స్వరూపం. యావత్ ప్రపంచంలోని అణగారినవర్గాల ఆత్మగౌరవ సూచిక అంబేద్కర్ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందంటే బాబాసాహెబ్ ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి. అంతటి మహోన్నుతుడి గురించి భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. నిజానికి అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే ఏమిటి? అణగారిన వర్గాల బాధలను తెలుసుకోవడం. దళిత కులంలో పుట్టి అంటరానివాడిగా వెలివేయబడ్డా, తినడానికి తిండి లేకపోయినా ఒకపూట పస్తులుంటూ ఆ పైసలతో పుస్తకాలు కొనుక్కుని మొక్కవోని దీక్షతో పెద్ద పెద్ద చదువులు చదువుకుని లక్ష్యాన్ని చేరుకుని అద్బుతమైన రాజ్యాంగాన్ని అందించారు. ఎక్కడో మధ్యప్రదేశ్ లోని ‘‘మౌ’’ అనే ఓ చిన్న పల్లెటూళ్లో దళిత కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ పుట్టుకతో సంపన్నుడు కాదు... కటిక పేదరికాన్ని అనుభవించాడు. గుడ్డి దీపం వెలుతురులో బతికినోడు. ఎంత ఆకలి వేసినా ఒక్క పూటే భోజనం చేసేవాడు. డబ్బులు మిగిలించి వాటితో పుస్తకాలు కొనుక్కుని చదివేవాడు. చదువు కోసం 10 ఏళ్ల జీవితాన్నే ఫణంగా పెట్టాడు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే ఆసక్తి ఉన్న స్తోమత లేకపోవడంతో అప్పటి బరోడా మహారాజు వద్దకు పోయి సాయం కోరితే.... విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చాక 10 ఏళ్ల పాటు తన సంస్థానంలోనే పనిచేయాలని షరతు పెడితే.... చదువు మీద మక్కువతో ఆ షరతును ఒఫ్పుకున్నాడు. మనకు స్వాతంత్ర్యం రాకముందే అంటే 1925లోనే దళిత, గిరిజన జాతులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలుండాలని ఆనాటి సైమన్ కమిషన్ కు నివేదిక ఇచ్చారంటే ఆయనకున్న ముందుచూపుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. దళిత, గిరిజన, మహిళలందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు. ఒక మనిషికి ఒకే ఓటు.. సమాన విలువ పేరుతో అంబానీ అయినా అడుక్కునేవాడికైనా సరే ఒకే ఓటు కల్పించిన నాయకుడు. ‘‘ఓటు అనే ఆయుధాన్ని వాడుకుని శక్తివంతులవుతారో..... డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకుని బానిసలుగా బతుకుతారో మీ చేతుల్లోనే ఉంది’’అని నిష్కర్షగా చెప్పిన మేధావి అంబేద్కర్. ఇయాళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. ‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని నడిపేవారు చెడ్డవాళ్లయితే అది కూడా చెడిపోతుంది’’అని నిర్మొహమాటంగా చెప్పిన మహనీయుడు. అంబేద్కర్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచింది. ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని చెరబట్టింది. వారసత్వ పాలనతో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు కుట్రలు చేసింది. ఇదేమిటని ప్రశ్నించిన అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్. మహాత్మాగాంధీ విజ్ఝప్తి మేరకు స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ కేబినెట్ లో చేరిన కాంగ్రెసేతర వ్యక్తులు ఇద్దరే. వారిలో అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఉన్నారు. వీళ్లను కేబినెట్ నుండి తప్పించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నా సరైన గౌరవం ఇవ్వకుండా నెహ్రూ ప్రభుత్వం 370 ఆర్టికల్ తీసుకొచ్చారు. స్వాతంత్రానికి పూర్వం హిందువులకు వేర్వేరుగా అనేక వ్యక్తిగత చట్టాలుండేవి. వాటిని ఒకే చట్టంగా మార్చేందుకు 1951లో హిందూకోడ్ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో మహిళలకు సమాన ఆస్తి హక్కులు, కుటుంబ ఆస్తిలో సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రతిపాదించారు. ఒకే వ్యక్తికి ఒకే భార్య ఉండాలని, మహిళలకూ విడాకులు తీసుకునే హక్కు ఉండాలని, వివాహ బంధాన్ని చట్టపరమైన ఒప్పందంగా ఉండాలని, పిల్లలపై తల్లి హక్కులను గుర్తించాలని, మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించారు. వాటిని పక్కకుపెట్టి నెహ్రూ అంబేద్కర్ ను అవమానించారు. తీవ్ర మనస్థాపంతో అంబేద్కర్ కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తరువాత 1952లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే.... కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంబేద్కర్ ను ఓడించేందుకు కుట్ర చేశారు. 1954 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అంబేద్కర్ నిలబడితే ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ స్వయంగా అభ్యర్థిని నిలబెట్టింది. చరిత్రలో అంబేద్కర్ ప్రాధాన్యత తగ్గించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. అంబేద్కర్ చనిపోతే ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి 2 గజాల జాగా కూడా కేటాయించలేదు(పీవీని కూడా ఇలానే అవమానించారు). చేసేదేమీలేక అంబేద్కర్ పార్ధివ దేహాన్ని ముంబై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంబేద్కర్ మృతదేహాన్ని పంపిన విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా ఆయన భార్యకు బిల్లులను పంపించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ది. ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే... 1955లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే తనకు తానుగా సిఫారసు చేసుకుని దేశ అత్యున్నతమైన భారతరత్న అవార్డు అందుకున్నారు. 1971లో ఇందిరాగాంధీ సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. రాజీవ్ గాంధీసహా కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖ నాయకులకు భారతరత్న అవార్డులిచ్చారు. కానీ అంబేద్కర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భారతరత్న ఇవ్వలేదు. ఇంకా బాధాకరమేందంటే...అంబేద్కర్‌ను ఓడించిన అభ్యర్థి ఎన్.ఎస్. కజ్రోల్కర్‌కు 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదు. దళిత జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని అంబేద్కర్ ధారపోస్తే.... కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్సీ, ఎస్టీలకు దశాబ్దాలపాటు సామాజిక న్యాయాన్ని దూరం చేసింది. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేస్తున్న ఏకైక జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే.... అది బీజేపీ మాత్రమే. నెహ్రూ ఏకపక్ష విధానాలను ప్రశ్నించిన అంబేద్కర్ ను పార్లమెంట్ లో అడుగుపెట్టకుండా రెండుసార్లు కాంగ్రెస్ ఓడిస్తే జన సంఘ్ పార్టీ అంబేద్కర్ ను బెంగాల్ లో ఎమ్మెల్సీగా చేసింది. బీజేపీ మద్దతుతోనే నాటి వీ.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పడగానే 1990లో అంబేద్కర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఎన్డీయే ప్రభుత్వదం ‘‘రాష్ట్రీయ సమరసత దినంగా’’ నిర్వహిస్తోంది. 2014లో మోదీగారు ప్రధాని పగ్గాలు చేపట్టి పార్లమెంట్ లో అడుగుపెట్టిన వెంటనే అంబేద్కర్ విగ్రహానికి ప్రణమిల్లి ‘చాయ్ వాలాకు ప్రధాని పదవి దక్కిందంటే...అది అంబేద్కర్ పెట్టిన భిక్షే’అని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలే బీజేపీ విధానమని చెప్పిన నాయకుడు మోదీ. అంబేద్కర్ నడయాడిన జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, మహాపరినిర్వాణ్, చైతన్య భూమి పేరుతో పంచ తీర్ధాలుగా ప్రకటించి ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెబుతున్నారు. అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల చేయడమే కాకుండా 120 దేశాల్లో అంబేద్కర్ జయంతి రోజున సామాజిక న్యాయం, సమరసత వేడుకలు నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ కు జాతీయ హోదా కల్పించారు. బీజేపీ సిద్ధాంతాలకు, అంబేద్కర్ ఆలోచనలకు సారూప్యత ఉంది. ఆర్దిక, సామాజిక సమానత్వ + రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యమనే అంబేద్కర్ గారి ఆలోచనలను ఆచరణలో చూపుతున్న మహానాయకుడు నరేంద్రమోదీ గారు. అణగారిన వర్గాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో.... బ్యాంకు ముఖమే చూడని 52 కోట్ల మంది పేదలకు జన్ ధన్ ఖాతాలను తెరిపించిన నేరుగా సంక్షేమ పథకాల నగదులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలను జమ చేశారు. PMAY ద్వారా 4 కోట్ల ఇండ్లను నిర్మించారు. మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ బియ్యం అందించారు. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ‘హర్ ఘర్ జల్ యోజన’ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించారు. 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ టాయిలెట్ల నిర్మించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 77 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు. 10 కోట్ల 33 లక్షల కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలను 11 కోట్ల మంది రైతుల ఖాతాల జమ చేశారు. ఇక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే. వాటిని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకొస్తే అడ్డుకుని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. 52 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 ఎంపీ సీట్లు ఖరారు చేసినం. ఇప్పుడు భారతదేశ జనాభా 140 కోట్లు. పెరిగిన జనాభాను ద్రుష్టిలో పెట్టుకుని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను పెంచాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆలోచించి బిల్లును రూపొందించి అమలు చేయాలనుకుంటే అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ దే. ఈ బిల్లు అమలై ఉంటే అస్తవ్యస్తంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలను సరిచేయడంతోపాటు అదనంగా 50 శాతం సీట్లు పెరిగే అవకాశముండేది. ఉదాహరణకు నా పార్లమెంట్ పరిధిలో 5 జిల్లాల కలెక్టర్లు, ఎంతో మంది అధికారులున్నారు. సీట్లు పెంచి ఉంటే...ఎంపీ సీట్లు పెరిగి కొత్త వాళ్లకు అవకాశం వస్తుంది. మహిళా బిల్లును అడ్డుకుని దేశ మహిళలను అవమానించింది. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీల ద్రుష్టిలో సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్, కనిమోళి, సుప్రియా సూలెకు పదవులు వస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లు. సాధారణ మహిళలకు పదవులు వస్తే వాళ్ల పునాదులు కూలిపోతాయనే భయంతోనే మహిళా బిల్లును అడ్డుకుంటోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంబేద్కర్ ఆలోచనలో భాగమే. ఆనాడు అంబేద్కర్ ను ఏ విధంగా అవమానపరిచారో, అంబేద్కర్ ఆలోచన మేరకు మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తున్న నరేంద్రమోదీని అవమానించేందుకు కుట్రలు చేస్తోంది. ఈ సందర్భంగా మేధావులను కోరేదొక్కటే. మేధావుల మౌనం సమాజానికి అరిష్టం. మీకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు. అంబేద్కర్ సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి మంచిది కాదు. ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా.3
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- Post by Vishwamber Rao1
- ఆదిలాబాద్ జిల్లా : సోనాల మండల కేంద్రంలో తుల శ్రీనివాస్ వెళ్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టౌర్నమెంటు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై బ్యాట్ పట్టి - సిక్స్ కొట్టి టౌర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఎండలను దృష్టిలో పెట్టుకొని క్రీడలు ఆడాలని సూచించారు. ఎండ తీవ్రత జాగ్రత్తలు ప్రతీ ఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.1