logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్ది అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మృతితో పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. నర్సంపేట చేరుకున్న ఆయన పార్థివదేహానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

16 hrs ago
user_Kasani Venkatesh
Kasani Venkatesh
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
16 hrs ago
efa887c9-a744-449a-a6dd-4a56ebf1f7da
a50953e9-67f9-4166-a314-65def6e1e838

పెద్ది అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మృతితో పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. నర్సంపేట చేరుకున్న ఆయన పార్థివదేహానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
    1
    ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • బస్సు సౌకర్యం కల్పించడంతో ఎమ్మెల్యేకు పాలాభిషేకం,....... నడిగూడెం: కోదాడ నుంచి నడిగూడెం మీదుగా మోతే వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
    1
    బస్సు సౌకర్యం కల్పించడంతో ఎమ్మెల్యేకు పాలాభిషేకం,.......


నడిగూడెం: కోదాడ నుంచి నడిగూడెం మీదుగా మోతే వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    20 hrs ago
  • వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*
    1
    వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️

*✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️
*మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.*
*పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.*
*ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.*
*ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.*
*ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    1
    మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన..
మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    user_మానుకోట వార్తలు
    మానుకోట వార్తలు
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
    2
    భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక  44 అడుగులకు చేరిన గోదావరి వరద
భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు.
భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.