ఇకపై ఫాస్టాగ్ నుంచే ట్రాఫిక్ చలాన్ల వసూలు? తెలంగాణలో కొత్త విధానంపై అధికారుల కసరత్తు! హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఏళ్ల తరబడి చలాన్లు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీస్ విభాగం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే ఈ-చలాన్ మొత్తాన్ని నేరుగా వాహనదారుడి ఫాస్టాగ్ (FASTag) ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ చేసే కొత్త వ్యవస్థను అమల్లోకి తెచ్చే అంశాన్ని అధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. నగరంలో పెండింగ్ చలాన్లు భారీగా పేరుకుపోతుండటం, రాయితీలు (డిస్కౌంట్లు) ప్రకటించే వరకు చాలామంది జరిమానాలు కట్టకపోవడంతో అధికారులు ఈ సాంకేతిక పరిష్కారంపై దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం చలాన్ పడిన తర్వాత నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే, ఆ వాహనం ఏదైనా టోల్ ప్లాజా లేదా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మీదుగా ప్రయాణించినప్పుడు ఫాస్టాగ్ వ్యాలెట్ నుంచి నేరుగా ఆ మొత్తం కట్ అయ్యేలా ఈ-చలాన్ నెట్‌వర్క్‌ను అనుసంధానించాలని హెచ్‌ఎండీఏ, ట్రాఫిక్ విభాగం యోచిస్తున్నాయి. ఇటీవల సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ విధానం పరిశీలన, సాధ్యాసాధ్యాల అధ్యయన దశలోనే ఉంది. బ్యాంకులతో సమన్వయం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధనలు, సాంకేతిక అనుమతులు పూర్తయిన తర్వాతే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే నాలుగు చక్రాల వాహనదారుల నుంచి పెండింగ్ చలాన్ల వసూలు మరింత వేగవంతం కానుంది.
ఇకపై ఫాస్టాగ్ నుంచే ట్రాఫిక్ చలాన్ల వసూలు? తెలంగాణలో కొత్త విధానంపై అధికారుల కసరత్తు! హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఏళ్ల తరబడి చలాన్లు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీస్ విభాగం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే ఈ-చలాన్ మొత్తాన్ని నేరుగా వాహనదారుడి ఫాస్టాగ్ (FASTag) ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ చేసే కొత్త వ్యవస్థను అమల్లోకి తెచ్చే అంశాన్ని అధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. నగరంలో పెండింగ్ చలాన్లు భారీగా పేరుకుపోతుండటం, రాయితీలు (డిస్కౌంట్లు) ప్రకటించే వరకు చాలామంది జరిమానాలు కట్టకపోవడంతో అధికారులు ఈ సాంకేతిక పరిష్కారంపై దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం చలాన్ పడిన తర్వాత నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే, ఆ వాహనం ఏదైనా టోల్ ప్లాజా లేదా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మీదుగా ప్రయాణించినప్పుడు ఫాస్టాగ్ వ్యాలెట్ నుంచి నేరుగా ఆ మొత్తం కట్ అయ్యేలా ఈ-చలాన్ నెట్‌వర్క్‌ను అనుసంధానించాలని హెచ్‌ఎండీఏ, ట్రాఫిక్ విభాగం యోచిస్తున్నాయి. ఇటీవల సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ విధానం పరిశీలన, సాధ్యాసాధ్యాల అధ్యయన దశలోనే ఉంది. బ్యాంకులతో సమన్వయం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధనలు, సాంకేతిక అనుమతులు పూర్తయిన తర్వాతే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే నాలుగు చక్రాల వాహనదారుల నుంచి పెండింగ్ చలాన్ల వసూలు మరింత వేగవంతం కానుంది.
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.2
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: నాయిని హనుమకొండ జిల్లా: తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) హెచ్‌ఎన్‌కే జిల్లా ఆధ్వర్యంలో గురువారం సుబేదారి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగ వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహాధర్నాలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొన్నారు.1