logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగనవాడి అధికారులతో సమీక్ష సమావేశం భద్రాద్రి కొత్తగూడెం (ఫిబ్రవరి 16 సోమవారం): స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందుగల సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్క అంగనవాడి కేంద్రం తెరవాలని, తెరిచిన వెంటనే టీచర్, హెల్పర్, లబ్ధిదారుల హాజరు కేంద్ర రాష్ట్ర స్థాయి అప్లికేషన్లు అయినటువంటి పోషణ ట్రాకర్ మరియు న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టంలో నమోదు చేయాలని తెలిపారు. వైద్యశాఖ సమన్వయంతో అతి తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం, తక్కువ బరువుతో ఉన్న పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షించి వైద్యుల సూచనల మేరకు న్యూట్రిషన్ రీహబిటేషన్ సెంటర్కి పంపించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతినెల క్రమం తప్పకుండా అత్యాధునిక సాంకేతిక పరికారాలతో పిల్లల ఎత్తు, బరువులు చూసి సరైన సమయంలో సరైన పోషణ అందించాలని కోరారు. కిశోర బాలికల కోసం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద "ఇందిరమ్మ అమృతం" పేరుతో 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల ఆడపిల్లలకు మిల్లెట్స్ తో కూడిన చిక్కిలు నెల నెల అందజేయడం జరుగుతుందని తద్వారా రక్తహీనత లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడమే మన లక్ష్యం అన్నారు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుత్తేదారులు పంపిణీ విషయంలో కానీ నాణ్యత విషయంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ప్రతినెల షెడ్యూల్ ప్రకారం అంగనవాడి పర్యవేక్షకురాలు (సూపర్వైజర్) తమ సెక్టార్ యొక్క అంగన్వాడీ కేంద్రాల సందర్శించి రాష్ట్ర పోర్టల్ ఎం ఎం అంగనవాడిలో వివరాలను నింపాలని, పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహార విలువలపై టీచర్లకు అవగాహన కల్పిస్తూ, పోషణ అభియాన్ పథకంలో భాగంగా తల్లుల కమిటీ, గ్రామస్తులు, గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో సామూహిక వేడుకలు అయినటువంటి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతాలు నిర్వహిస్తూ వారిలో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వతంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు గాను పెరటి తోట పెంపకాలు (న్యూట్రి గార్డెన్స్) నిర్మించారని దీనిని ఆదర్శంగా తీసుకొని వివిధ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత లెనీనా, జిల్లా సిడిపివోలు ప్రసన్న లక్ష్మి, జయలక్ష్మి, తార, అరుణ కుమారి, పద్మశ్రీ, చైతన్య, సలోమి, హేమ సత్య, జ్యోతి, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పొనుగోటి సంపత్, జిల్లా కార్యాలయ సిబ్బంది హసీనా, భార్గవి, డి. సి .పి .ఓ హరికుమారి, చైల్డ్ లైన్ సందీప్, జిల్లా పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

21 hrs ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
21 hrs ago
dd2efc8d-c162-48ec-a778-9e4396e2a6c3

కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగనవాడి అధికారులతో సమీక్ష సమావేశం భద్రాద్రి కొత్తగూడెం (ఫిబ్రవరి 16 సోమవారం): స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందుగల సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్క అంగనవాడి కేంద్రం తెరవాలని, తెరిచిన వెంటనే టీచర్, హెల్పర్, లబ్ధిదారుల హాజరు కేంద్ర రాష్ట్ర స్థాయి అప్లికేషన్లు అయినటువంటి పోషణ ట్రాకర్ మరియు న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టంలో నమోదు చేయాలని తెలిపారు. వైద్యశాఖ సమన్వయంతో అతి తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం, తక్కువ బరువుతో ఉన్న పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షించి వైద్యుల సూచనల మేరకు న్యూట్రిషన్ రీహబిటేషన్ సెంటర్కి పంపించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతినెల క్రమం తప్పకుండా అత్యాధునిక సాంకేతిక

617a9130-5cfe-4f92-b8db-76f4152aebf6

పరికారాలతో పిల్లల ఎత్తు, బరువులు చూసి సరైన సమయంలో సరైన పోషణ అందించాలని కోరారు. కిశోర బాలికల కోసం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద "ఇందిరమ్మ అమృతం" పేరుతో 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల ఆడపిల్లలకు మిల్లెట్స్ తో కూడిన చిక్కిలు నెల నెల అందజేయడం జరుగుతుందని తద్వారా రక్తహీనత లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడమే మన లక్ష్యం అన్నారు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుత్తేదారులు పంపిణీ విషయంలో కానీ నాణ్యత విషయంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ప్రతినెల షెడ్యూల్ ప్రకారం అంగనవాడి పర్యవేక్షకురాలు (సూపర్వైజర్) తమ సెక్టార్ యొక్క అంగన్వాడీ కేంద్రాల సందర్శించి రాష్ట్ర పోర్టల్ ఎం ఎం అంగనవాడిలో వివరాలను నింపాలని, పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహార విలువలపై టీచర్లకు అవగాహన కల్పిస్తూ, పోషణ అభియాన్ పథకంలో భాగంగా తల్లుల

4025b7e6-af7e-47c8-951f-097793c7e933

కమిటీ, గ్రామస్తులు, గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో సామూహిక వేడుకలు అయినటువంటి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతాలు నిర్వహిస్తూ వారిలో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వతంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు గాను పెరటి తోట పెంపకాలు (న్యూట్రి గార్డెన్స్) నిర్మించారని దీనిని ఆదర్శంగా తీసుకొని వివిధ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత లెనీనా, జిల్లా సిడిపివోలు ప్రసన్న లక్ష్మి, జయలక్ష్మి, తార, అరుణ కుమారి, పద్మశ్రీ, చైతన్య, సలోమి, హేమ సత్య, జ్యోతి, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పొనుగోటి సంపత్, జిల్లా కార్యాలయ సిబ్బంది హసీనా, భార్గవి, డి. సి .పి .ఓ హరికుమారి, చైల్డ్ లైన్ సందీప్, జిల్లా పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని 2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.
    3
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి 
ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని
2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని 
గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని
ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ 
కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్పొరేషన్ మేయర్ గా గణేష్ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా సిపిఐ శ్రేణులు ఆనందోత్సవాలతో అత్యంత ఉత్సాభరితంగా లయబద్ధంగా డాన్స్లు వేస్తున్న దృశ్యం వేస్తున్న దృశ్యం
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కార్పొరేషన్ మేయర్ గా గణేష్ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా సిపిఐ శ్రేణులు ఆనందోత్సవాలతో అత్యంత ఉత్సాభరితంగా లయబద్ధంగా డాన్స్లు వేస్తున్న దృశ్యం వేస్తున్న దృశ్యం
    user_Kampasati Venkanna
    Kampasati Venkanna
    Agriculture cooperative కొణిజర్ల, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • _తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు_ _తీవ్ర ఉద్రిక్తతల మధ్య దయాకర్‌రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు లింపు_ _మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన ఎర్రబెల్లి దయాకర్‌రావు_ _కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి అంటూ దయాకర్‌రావు కంటతడి_ _రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన_
    1
    _తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు_
_తీవ్ర ఉద్రిక్తతల మధ్య దయాకర్‌రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు లింపు_
_మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన ఎర్రబెల్లి దయాకర్‌రావు_
_కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి అంటూ దయాకర్‌రావు కంటతడి_
_రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన_
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    1
    బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
    1
    ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    1 hr ago
  • తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది. 👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా? 👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
    2
    తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు
తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది.
👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా?
👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా?
అన్నది వేచి చూడాల్సిందే.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా
*ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,*
జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. మున్సిపాలిటీలో సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటన నేపథ్యంలో సుమారు 1000 మంది పోలీసులతో ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసులు మున్సిపాలిటీ సమీపంలో పూర్తి ఆంక్షలు విధించినారు.
    1
    మహబూబాబాద్ జిల్లా
తొర్రూర్ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. మున్సిపాలిటీలో సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటన నేపథ్యంలో సుమారు 1000 మంది పోలీసులతో ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసులు మున్సిపాలిటీ సమీపంలో పూర్తి ఆంక్షలు విధించినారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.