logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్‌లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో, సత్తుపల్లి డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సౌజన్యంతో ‘ఉపాధ్యాయ సరస్సు’ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ మాట్లాడుతూ, విద్యార్థులకు మార్కులతో పాటు క్రమశిక్షణ, నైతిక, మానవీయ విలువలను పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఆదర్శ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, విద్యార్థుల భవిష్యత్తు పార్లమెంటులో కాదు... పాఠశాలలో రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు ఒక గొప్ప లక్ష్య సాధన కోసం అంకితభావంతో పనిచేస్తూ, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మైసూర్ రామకృష్ణ మిషన్ స్వామీజీ మహా మేధానంద, విజయవాడ రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి శితికంఠానంద మహారాజ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి ఒక తపస్సు లాంటిదని, విద్యార్థులను సొంత బిడ్డల్లా భావించి వారిలో మానవతా విలువలను పెంపొందించాలని సూచించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, గురువును గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించడమేనని అన్నారు. నిరంతరం నేర్చుకుంటూ, సమయపాలన పాటిస్తూ, ప్రతి విద్యార్థి విజయంలో తమ విజయాన్ని చూసేవారే నిజమైన ఉపాధ్యాయులని ఆమె అభిప్రాయపడ్డారు.

1 hr ago
user_Arempula Haribabu
Arempula Haribabu
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago
b9cceb9c-b282-4a09-973b-1e9360f07dca

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్‌లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో, సత్తుపల్లి డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సౌజన్యంతో ‘ఉపాధ్యాయ సరస్సు’ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ మాట్లాడుతూ, విద్యార్థులకు మార్కులతో పాటు క్రమశిక్షణ, నైతిక, మానవీయ విలువలను పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఆదర్శ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, విద్యార్థుల భవిష్యత్తు పార్లమెంటులో కాదు... పాఠశాలలో రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు ఒక గొప్ప లక్ష్య సాధన కోసం అంకితభావంతో పనిచేస్తూ, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మైసూర్ రామకృష్ణ మిషన్ స్వామీజీ మహా మేధానంద, విజయవాడ రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి శితికంఠానంద మహారాజ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి ఒక తపస్సు లాంటిదని, విద్యార్థులను సొంత బిడ్డల్లా భావించి వారిలో మానవతా విలువలను పెంపొందించాలని సూచించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, గురువును గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించడమేనని అన్నారు. నిరంతరం నేర్చుకుంటూ, సమయపాలన పాటిస్తూ, ప్రతి విద్యార్థి విజయంలో తమ విజయాన్ని చూసేవారే నిజమైన ఉపాధ్యాయులని ఆమె అభిప్రాయపడ్డారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి JVR OCP సమీపంలో HMS కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి, నూతన కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
    1
    ఖమ్మం జిల్లా సత్తుపల్లి JVR OCP సమీపంలో HMS కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి, నూతన కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు.

మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    3
    సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని, ఆ పార్టీకి 117 అసెంబ్లీ స్థానాలు కాదు కదా కనీసం 7 స్థానాలు కూడా రావని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించి, మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం పక్కా అని ధీమా వ్యక్తమవుతోంది.
    1
    తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని, ఆ పార్టీకి 117 అసెంబ్లీ స్థానాలు కాదు కదా కనీసం 7 స్థానాలు కూడా రావని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించి, మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం పక్కా అని ధీమా వ్యక్తమవుతోంది.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సభలో జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో పలువురు జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని గమనించి వెంటనే ఆ ప్లకార్డులను లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జర్నలిస్టులు గట్టిగా కోరారు.
    1
    చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సభలో జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సభలో పలువురు జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని గమనించి వెంటనే ఆ ప్లకార్డులను లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జర్నలిస్టులు గట్టిగా కోరారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చింతకాని మండలంలో రేవంత్ రెడ్డి తన పర్యటన సందర్భంగా చేసిన వ్యక్తిగత దూషణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, నాయకులపై బాడీ షేమింగ్ చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని పువ్వాడ ఆరోపించారు. 32 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కంటిని కోల్పోయినా, ఆత్మవిశ్వాసంతో ఎదిగానని, అటువంటి వ్యక్తిగత అంశాలను రాజకీయం చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. ఒక కన్ను ఉన్న తాను జిల్లాను అభివృద్ధి చేస్తే, ఆరు కళ్లు ఉన్న ముగ్గురు మంత్రులు తాము చేసిన అభివృద్ధిలో పది వంతు కూడా చేయలేదని పువ్వాడ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నలు సంధించారు. రైతు భరోసా, మహిళలకు ₹2,500, యువతులకు స్కూటీల పంపిణీ వంటి హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఏ అంగవైకల్యం వల్ల ఆగిపోయారని ఆయన ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి చేశామని, ఆ ప్రాజెక్టు కోసం తాము ₹900 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం జిల్లాలోని ఒక మంత్రి తానే తెచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముప్పు లేదని, పోలవరం వల్ల కలిగే ముంపు గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వం తనపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, కానీ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పువ్వాడ కోరారు. ముఖ్యమంత్రి బాధ్యతను విస్మరించి జడ్పీటీసీ స్థాయి వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజకీయాల్లో గుణగణాలు చూడాలి కానీ శారీరక లోపాలు కాదని ఆయన హితవు పలికారు. రుణమాఫీ వంటి హామీలను దేవుళ్ల మీద ఒట్టు వేసినా అమలు చేయలేదని, కేసీఆర్ హయాంలో ప్రకృతి సహకరించడం వల్లే పదేళ్లు సమర్థవంతంగా పాలన సాగిందని పువ్వాడ పేర్కొన్నారు.
    1
    మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చింతకాని మండలంలో రేవంత్ రెడ్డి తన పర్యటన సందర్భంగా చేసిన వ్యక్తిగత దూషణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, నాయకులపై బాడీ షేమింగ్ చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని పువ్వాడ ఆరోపించారు. 32 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కంటిని కోల్పోయినా, ఆత్మవిశ్వాసంతో ఎదిగానని, అటువంటి వ్యక్తిగత అంశాలను రాజకీయం చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. ఒక కన్ను ఉన్న తాను జిల్లాను అభివృద్ధి చేస్తే, ఆరు కళ్లు ఉన్న ముగ్గురు మంత్రులు తాము చేసిన అభివృద్ధిలో పది వంతు కూడా చేయలేదని పువ్వాడ సవాల్ విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నలు సంధించారు. రైతు భరోసా, మహిళలకు ₹2,500, యువతులకు స్కూటీల పంపిణీ వంటి హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఏ అంగవైకల్యం వల్ల ఆగిపోయారని ఆయన ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి చేశామని, ఆ ప్రాజెక్టు కోసం తాము ₹900 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం జిల్లాలోని ఒక మంత్రి తానే తెచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముప్పు లేదని, పోలవరం వల్ల కలిగే ముంపు గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు.

ప్రస్తుత ప్రభుత్వం తనపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, కానీ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పువ్వాడ కోరారు. ముఖ్యమంత్రి బాధ్యతను విస్మరించి జడ్పీటీసీ స్థాయి వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజకీయాల్లో గుణగణాలు చూడాలి కానీ శారీరక లోపాలు కాదని ఆయన హితవు పలికారు. రుణమాఫీ వంటి హామీలను దేవుళ్ల మీద ఒట్టు వేసినా అమలు చేయలేదని, కేసీఆర్ హయాంలో ప్రకృతి సహకరించడం వల్లే పదేళ్లు సమర్థవంతంగా పాలన సాగిందని పువ్వాడ పేర్కొన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.