logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపి తమ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంఠరెడ్డి తిరుపతిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి పూర్తిగా చేతులెత్తేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసేలా ఆందోళనలు చేపడతామని, ప్రతి గింజ కొనుగోలు అయ్యే వరకు తెలంగాణ రైతాంగానికి అండగా నిలుస్తామని తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణను స్తంభింపజేసి, ప్రభుత్వ మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించేలా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు రైతుబంధు ఎకరాకు రూ.12 వేలుగా పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు, నేడు కేంద్రాన్ని సాకుగా చూపడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని ఆరోపించారు. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేసే దమ్ము లేకపోయినా, కొన్ని రకాల వరి ధాన్యాలనే పండించాలని సూచించడం రైతులకు నష్టం కలిగించే చర్య అని, తక్కువ దిగుబడి వచ్చే రకాల వైపు రైతులను మళ్లించడం ద్వారా కొనుగోలు భారం తగ్గించుకోవాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాలేశ్వరం వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని కంఠరెడ్డి తిరుపతిరెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించి తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే రైతుల నుంచి భారీ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఖరీఫ్ ధాన్యం ప్రతి గింజ కొనాల్సిందేనని, కేంద్రాన్ని సాకుగా చూపితే వదిలేది లేదని, అవసరమైతే ప్రభుత్వ మెడలు వంచుతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.

3 hrs ago
user_Bhanu
Bhanu
రామాయంపేట, మెదక్, తెలంగాణ•
3 hrs ago
7eb8fb39-1816-4093-8597-9c63f9a6c616

ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపి తమ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంఠరెడ్డి తిరుపతిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి పూర్తిగా చేతులెత్తేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసేలా ఆందోళనలు చేపడతామని, ప్రతి గింజ కొనుగోలు అయ్యే వరకు తెలంగాణ రైతాంగానికి అండగా నిలుస్తామని తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణను స్తంభింపజేసి, ప్రభుత్వ మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించేలా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు రైతుబంధు ఎకరాకు రూ.12 వేలుగా పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు, నేడు కేంద్రాన్ని సాకుగా చూపడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని ఆరోపించారు. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేసే దమ్ము లేకపోయినా, కొన్ని రకాల వరి ధాన్యాలనే పండించాలని సూచించడం రైతులకు నష్టం కలిగించే చర్య అని, తక్కువ దిగుబడి వచ్చే రకాల వైపు రైతులను మళ్లించడం ద్వారా కొనుగోలు భారం తగ్గించుకోవాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాలేశ్వరం వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని కంఠరెడ్డి తిరుపతిరెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించి తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే రైతుల నుంచి భారీ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఖరీఫ్ ధాన్యం ప్రతి గింజ కొనాల్సిందేనని, కేంద్రాన్ని సాకుగా చూపితే వదిలేది లేదని, అవసరమైతే ప్రభుత్వ మెడలు వంచుతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.

More news from Telangana and nearby areas
  • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఆంజనేయులు తన ప్రసంగంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం "మన నీళ్లు – మన నిధులు – మన ఉద్యోగాలు" అనే నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేసిన ప్రముఖుల్లో ఆయన ముందువరుసలో నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, నేడు దేశానికే ఆదర్శంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా జీవించిన జయశంకర్ సార్ పోరాటం, జీవితం యువతకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కోకన్వీనర్ గడ్డమీది క్రిష్ణ గౌడ్, కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ఏనుగుల రాజు, ఇస్మాయిల్, సునీల్, బబ్లు, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు.

ఆంజనేయులు తన ప్రసంగంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం "మన నీళ్లు – మన నిధులు – మన ఉద్యోగాలు" అనే నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేసిన ప్రముఖుల్లో ఆయన ముందువరుసలో నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, నేడు దేశానికే ఆదర్శంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా జీవించిన జయశంకర్ సార్ పోరాటం, జీవితం యువతకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కోకన్వీనర్ గడ్డమీది క్రిష్ణ గౌడ్, కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ఏనుగుల రాజు, ఇస్మాయిల్, సునీల్, బబ్లు, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    9 hrs ago
  • జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    3
    జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • ఆదివారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో నిర్వహించిన ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్కానింగ్ శిబిరంలో డాక్టర్ సింధు మాధవనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతంగా అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని డాక్టర్ సింధు సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొంటూ, మహిళలు ఈ స్కానింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    1
    ఆదివారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో నిర్వహించిన ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్కానింగ్ శిబిరంలో డాక్టర్ సింధు మాధవనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతంగా అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని డాక్టర్ సింధు సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొంటూ, మహిళలు ఈ స్కానింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలీ, గ్రామపంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, కేంద్ర బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దుచేసి, తమ కష్టంతో దేశానికే సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ నాయకులు వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నూతన వీర్నపల్లి మండల కమిటీకి గుంటుకు నరేందర్ మండల కన్వీనర్​గా, ఈసంపేల్లి రాజెల్లయ్య, అన్నారం రాజేశం కో కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజెల్లయ్య, అంజయ్య, చంద్రయ్య, లింగయ్య, రాజు, కత్తిలాల్, శ్రీహరి, నర్సయ్య, మనోహర్, నవత, అనిత, లావణ్యలు మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
    3
    ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలీ, గ్రామపంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, కేంద్ర బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దుచేసి, తమ కష్టంతో దేశానికే సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు.

నూతనంగా ఎన్నికైన మండల కమిటీ నాయకులు వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నూతన వీర్నపల్లి మండల కమిటీకి గుంటుకు నరేందర్ మండల కన్వీనర్​గా, ఈసంపేల్లి రాజెల్లయ్య, అన్నారం రాజేశం కో కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజెల్లయ్య, అంజయ్య, చంద్రయ్య, లింగయ్య, రాజు, కత్తిలాల్, శ్రీహరి, నర్సయ్య, మనోహర్, నవత, అనిత, లావణ్యలు మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    11 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర పోరాటాల అమరవీరుడు ప్రొఫెసర్ జయశంకర్ సారుగారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని దోమడుగులొ ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయనకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమంలో మందభాస్కర్ రెడ్డి, గడ్డం కాళేశ్వర్, కుమ్మరి వెంకటేష్, మరిగాని యాదగిరి, ఎస్.కే. గరీబ్, ఎస్.కే. రఫీ, దండు రాంచందర్, ఆటో శ్రీను నాయక్, ఎండి గౌస్ సహా మరెంతో మంది పాల్గొన్నారు.
    1
    తెలంగాణ రాష్ట్ర పోరాటాల అమరవీరుడు ప్రొఫెసర్ జయశంకర్ సారుగారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని దోమడుగులొ ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయనకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమంలో మందభాస్కర్ రెడ్డి, గడ్డం కాళేశ్వర్, కుమ్మరి వెంకటేష్, మరిగాని యాదగిరి, ఎస్.కే. గరీబ్, ఎస్.కే. రఫీ, దండు రాంచందర్, ఆటో శ్రీను నాయక్, ఎండి గౌస్ సహా మరెంతో మంది పాల్గొన్నారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    5 hrs ago
  • రేగోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ యోగా చేయాలని ఆమె సూచించారు.
    1
    రేగోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ యోగా చేయాలని ఆమె సూచించారు.
    user_ఎనగండ్ల జైపాల్
    ఎనగండ్ల జైపాల్
    Regode, Medak•
    7 hrs ago
  • మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో ఆదివారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని, “ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ” అనే థీమ్‌తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మానవ శక్తులన్నింటినీ ఏకం చేసే ఏకాగ్రత సాధించడం యోగాకే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భూక్య జ్ఞానేశ్వర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ శివదయాల్, ఆయుష్ విభాగం మోహన్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ మరియు విశిష్ట యోగ గురువు ఆకుల రవి కూడా పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ ప్రతిమాసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా గురువు రవి అధికారులతో ఆసనాలు చేయించగా, కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీవో రమాదేవి స్వయంగా యోగాసనాలు వేసి అందరినీ ఉత్తేజపరిచారు. కలెక్టర్ తన ప్రసంగంలో, యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని ఉద్ఘాటించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ అని ఆమె అభివర్ణించారు. వయో, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ అధికారులు, మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, విశిష్ట యోగ ఇన్స్ట్రక్టర్ దేవేందర్ రెడ్డి, పిడి ఆనందం, నరసింహులు, కొండల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సాధకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ యోగాలో పాల్గొన్నవారితో ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.
    1
    మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో ఆదివారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని, “ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ” అనే థీమ్‌తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మానవ శక్తులన్నింటినీ ఏకం చేసే ఏకాగ్రత సాధించడం యోగాకే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భూక్య జ్ఞానేశ్వర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ శివదయాల్, ఆయుష్ విభాగం మోహన్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ మరియు విశిష్ట యోగ గురువు ఆకుల రవి కూడా పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ ప్రతిమాసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా గురువు రవి అధికారులతో ఆసనాలు చేయించగా, కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీవో రమాదేవి స్వయంగా యోగాసనాలు వేసి అందరినీ ఉత్తేజపరిచారు.

కలెక్టర్ తన ప్రసంగంలో, యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని ఉద్ఘాటించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ అని ఆమె అభివర్ణించారు. వయో, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ అధికారులు, మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, విశిష్ట యోగ ఇన్స్ట్రక్టర్ దేవేందర్ రెడ్డి, పిడి ఆనందం, నరసింహులు, కొండల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సాధకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ యోగాలో పాల్గొన్నవారితో ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    16 hrs ago
  • కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు. ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు.

ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.