logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బిట్స్ పిలానీ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తోంది . తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బిట్స్ పిలానీ కేవలం విద్యా ప్రతిభతో మాత్రమే పరిమితం కాదని తరతరాలుగా నూతన ఆవిష్కరణలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, భయం లేని జిజ్ఞాసను పెంపొందిస్తూ వస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. పిలానీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ' - బిట్స్ గ్లోబల్ మీట్ ' ఆరో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్‌లోని బిట్స్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) పిలానీ క్యాంపస్‌ (శామీర్ పేట్)లో ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎఫ్.ఏ. సీ) కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, బీ.జీ.ఎం - 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు, బిట్స్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొ: వి. రామగోపాల్ రావు, ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎంజెల్ ఇన్వెస్టర్ కన్వల్ రేఖి,బీ.జీ.ఎం - 2026 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మయూర్ పట్నాలాలు పాల్గొన్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి గవర్నర్ కు పుష్ఫగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, నేడు విద్య ఒక కీలక మలుపు తీసుకుందన్నారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, ఆటోమేషన్, డిజిటల్ మార్పులు విద్యా వ్యవస్థను మౌలికంగా మలుస్తున్నాయన్నారు. ఏ.ఐ ఇక భవిష్యత్తు కల కాదని, ఇది ఇప్పటికే విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలు, మానవ జ్ఞానాన్ని ప్రభావితం చేస్తోందన్నారు. తద్వారా విద్య కేవలం ఉద్యోగాల కోసం కాకుండా, మార్పులకు అనుగుణంగా ఎదగ గల సామర్థ్యం, జీవితాంతం నేర్చుకునే దృక్పథాన్ని యువత అలవర్చుకోవాలన్నారు. ఏ.ఐ డేటాను విశ్లేషించగలదు, నిర్ణయాలు తీసుకోగలదు, కానీ మానవ విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు అది ప్రత్యామ్నాయం కాదన్నారు. కాబట్టి విద్య లక్ష్యం యంత్రాలతో పోటీ పడడం కాకుండా సమాజ హితానికి సాంకేతికతను దారి చూపగల మానవ విలువలను బలోపేతం చేయడం ఎంతో అవసరమన్నారు. బిట్స్ పిలానీ ఈ ఆలోచనను విద్యా స్వయం ప్రతిపత్తి, అనువైన పాఠ్య ప్రణాళికలు, అంతరశాఖీయ అధ్యయనం, ప్రాయోగిక విద్య ద్వారా సాకారం చేస్తోందని శ్లాఘించారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక వ్యవస్థతో అనుసంధానమై, ఆధునిక పదార్థాలు, బయోటెక్నాలజీ, వాతావరణ పరిష్కారాలు, రోబోటిక్స్, ఏ.ఐ వంటి రంగాల్లో విశిష్టంగా ఎదుగుతుందన్నారు. ఇలాంటి కేంద్రాలు భారతదేశాన్ని కేవలం సాంకేతిక వినియోగదారుడిగా కాకుండా, స్థానిక అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణల సృష్టికర్తగా నిలుపుతున్నాయన్నారు. పూర్వ విద్యార్థుల నుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, జాన్ ఎఫ్. కెన్నెడీ చెప్పినట్లు విశ్వవిద్యాలయాలకు పూర్వవిద్యార్థుల సంఘాలే ప్రాణవాయువని, అవే జ్ఞాన జ్యోతిని తరతరాలకు అందిస్తాయన్నారు. వారి మార్గదర్శనం, దానధర్మాలు, సంబంధాలు సంస్థ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. విద్య వినయాన్ని ఇస్తుందని, వినయం అర్హతను కలిగిస్తుందని, అర్హత సంపదను ఇస్తుందని, సంపద ధర్మానికి దారి తీస్తుందని, ధర్మం సుఖాన్ని ఇస్తుందని, ఈ సూత్రం దానధర్మాలకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. మీ విజయాలు భారతీయ విలువలతో కూడిన ఆవిష్కరణలకు ప్రేరణగా నిలుస్తున్నాయని, వృత్తి నైపుణ్య శిక్షణ, స్వావలంబన పరిశ్రమలు, ప్రతిభ పెంపకంలో మీ సహకారం కోసం దేశం ఆశగా ఎదురు చూస్తోందని అన్నారు. యువతకు మార్గదర్శకులుగా నిలిచి, సమాజాన్ని ఉద్ధరించి, జాతీయ స్వయం సమృద్ధిని ముందుకు నడిపించండడంలో మీ వంతు సహాకారాన్ని అందించాలన్నారు. కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్ మాట్లాడుతూ, సాంకేతికత, నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వామిగా ఎలా సహకరిస్తున్నాయో ఆయన వివరించారు. బీ.జీ.ఎం - 2026 ఛైర్‌ పర్సన్ అనిత సాకూర్ మాట్లాడుతూ, ఈ సదస్సు వివిధ తరాల మధ్య సహకారానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. ఇన్‌స్టిట్యూట్ వారసత్వాన్ని, స్నేహాన్ని చాటిచెప్పేలా నిర్వహించిన సంప్రదాయ 'ఖవ్వాలీ' ప్రదర్శన సభికుల్ని ఆకట్టుకున్నది.

2 days ago
user_Journalist Madhu
Journalist Madhu
Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
2 days ago
48ae1279-4b6a-47c4-b105-ce5d6d8d0c2d

More news from తెలంగాణ and nearby areas
  • కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన
    1
    కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
    1
    నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి..
నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది.  దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    20 min ago
  • ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి నీతి, నిజాయితీతో పనిచేస్తూ... ప్రజాదారణ పొందిన సంస్థ hmtv అని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిసిసి ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం అన్నారు గంగాధర మండలం ఇస్లాంపూర్ లో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం హెచ్ఎంటీవీ వీక్షకులకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
    1
    ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి నీతి, నిజాయితీతో పనిచేస్తూ... ప్రజాదారణ పొందిన సంస్థ hmtv అని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిసిసి ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం అన్నారు గంగాధర మండలం ఇస్లాంపూర్ లో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం హెచ్ఎంటీవీ వీక్షకులకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి
మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    3 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.
    1
    ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం
జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది.
అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రేపు విడుదల చేయనున్న తుది జాబితా
    1
    సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రేపు విడుదల చేయనున్న తుది జాబితా
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.
    1
    బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి 
తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    21 min ago
  • కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఆచంపల్లి గ్రామంలో ఉన్న కెనాల్ లో అదుపుతప్పి బోల్తాపడ్డ ఇసుక లారీ త్రుటిలో తప్పించుకున్న లారీ డ్రైవర్ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
    1
    కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఆచంపల్లి గ్రామంలో ఉన్న కెనాల్ లో అదుపుతప్పి బోల్తాపడ్డ ఇసుక లారీ త్రుటిలో తప్పించుకున్న లారీ డ్రైవర్ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.