*నెల్లిమర్ల నియోజకవర్గ ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు భేటీ* *అమరావతి:* నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి *లోకం నాగ మాధవి* గారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ *ఆనం రామనారాయణ రెడ్డి* గారిని మర్యాదపూర్వకలగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు కీలక అంశాలపై మంత్రి గారికి ఆమె వినతిపత్రం అందజేశారు. *సమావేశంలోని ముఖ్య అంశాలు:* * *రామతీర్థం ఆలయ అభివృద్ధి:* నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన **రామతీర్థం** ఆలయ సమగ్ర అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. * *భజన మందిరాలకు చేయూత:* నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భజన మందిరాల నిర్వహణకు మరియు అభివృద్ధికి ప్రభుత్వం నుండి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. * *దేవాదాయ భూముల రక్షణ:* అన్యాక్రాంతమైన లేదా ఆక్రమణలో ఉన్న దేవాదాయ శాఖ భూములను గుర్తించి, వాటిని పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. * *ఇతర సమస్యలు:* నియోజకవర్గ పరిధిలోని ఇతర దేవాలయాల పెండింగ్ సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఈ నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా తన కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా తెలియజేశారు.

- వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు పాతపట్నం టీడీపీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ మురళీధర్, ఉపసర్పంచ్ బాతి రెడ్డి తిరుపతిరావు తో పాటు సుమారు 270 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు ఆధ్వర్యంలో శుక్రవారం చేరారు. వీరికి ఎమ్మెల్యే ఎంజీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.2
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహముతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి, పాటశాల అవరణంతా మామిడి తోరణాలతో, రంగు రంగుల రంగవల్లికలు తో తీర్చిదిద్దారు. విద్యార్థులు వేసిన హరిదాసు, జంగమయ్య, సోదమ్మ వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెరకుగడలతో, క్రొత్తకుండలో పాలు పొంగించిడము, గొబ్బెమ్మలు, భోగి మంటలతో కోలాహలంగా పండుగ వాావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమానికి మండల విద్యాధికారులు చిన్నవాడు, అర్జునుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.1
- 🙏🙏1
- వేట్లపాలెం: న్యూ మెన్ సొసైటీ సేవా కార్యక్రమం పెద్దాపురంసామర్లకోట: జనవరి 09 పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం బేతాళ స్వామి గుడి ప్రాంగణంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో గౌతమీ నేత్రాలయం అనుబంధ సంస్థ శ్రీ చరణ్ కంటి ఆసుపత్రి (జగ్గంపేట) వారి సహకారంతో ఈ నెల 5వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఆ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న గ్రామీణ ప్రజల్లో కళ్లజోళ్ళు అవసరం ఉన్న వారిని గుర్తించి, వారికి అందుబాటు ధరలో నాణ్యమైన కళ్లజోళ్ళు అందించే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మందికి తక్కువ ధరకు కళ్లజోళ్ళు అందించడంతో పాటు అవసరమైన వారికి కంటి చుక్కల మందులు కూడా అందించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రజలకు కంటి సంరక్షణ సేవలను సులభంగా అందించడం, అధిక ఖర్చు లేకుండా చూపు సమస్యలకు పరిష్కారం అందించడమేనని నిర్వాహకులు తెలిపారు. వచ్చిన వారికి అవసరమైన సదుపాయాలను న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున నిడిగట్ల రత్న శేఖర్, పలివేల బద్రి సమన్వయంతో అందించారు. ఈ సేవా కార్యక్రమం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని గ్రామ పెద్దలు, ప్రజలు అభిప్రాయపడి, సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ వారిని హృదయపూర్వకంగా అభినందించారు.4
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, మన సంస్కృతి–సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రిన్సిపాల్ కే. అమర్నాథ్ గారు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.4
- మోటివేషన్ ఈ రోజుల్లో డబ్బుకే విలువ1
- 🙏🙏1
- Post by Ni2
- మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1