logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా? పత్రిక ల ద్వారా ప్రజా ప్రతినిధుల దృష్టికి తేవడానికి వార్త రాస్తే జర్నలిస్టుకి ఫోన్ లో బెదిరింపులు వాట్సాఅప్ లో వచ్చిన ఘటన పై ఎలా జరిగింది అని వివరాలు అడిగిన జర్నలిస్ట్ పై కూడా అక్రమ కేసు పెట్టి కోర్టుకు తిప్పుతున్న అటవీ, పోలీసు అధికారులు ప్రభుత్వానికి ప్రజల కు ఎదురైతున్న సమస్యల ను అధికారుల దృష్టికి తేవడం తప్పా ప్రశ్నించిన విద్యార్థి సంఘం నాయకులు అచ్చంపేట,ఏప్రిల్ 14(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిత్యం సమాజ సేవలో ముందుండే పాత్రికేయుడిపై దుర్భాషలు, బెదిరింపులకు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నా మని అచ్చంపేట విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆంధ్రప్రభ దినపత్రిక విలేకరి, తాలూకా ఇంచార్జి కె.ఎల్. నారాయణరావు పై ఇటీవల ఫోన్లో బెదిరించడం, దుర్భాషలు అడగడం, యావత్తు పాత్రికేయ వృత్తిని తులనాడడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళితే… అచ్చంపేట పట్టణ పరిధిలో జరుగుతున్న వెంచర్లపై జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రభ విలేకరి నారాయణరావు వార్తా కథనం ప్రచురించగా, దానిని జీర్ణించుకోలేని కొందరు రియల్ ఎస్టేట్ వర్గాలు ఫోన్ ద్వారా దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి. ఇది ఇలా ఉండగా అచ్చంపేట అటవీ శాఖ అధికారులు వాట్సాఅప్ లో చేసిన పోస్టు గురించి వివరాలు అడిగిన జర్నలిస్టు పై అటెంప్ట్ మర్డర్, చీటింగ్ ఆక్ట్ లతో , కేసును పెట్టి అచ్చంపేట కోర్టుకు తిప్పుతున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా పని చేసిన గోవర్ధన్, కేసు వేసిన సమయం లో ఎ మ్మెల్యే గా గువ్వల బాలరాజు పదవిలో ఉన్నాడు. ఇప్పటికీ కోర్టుకు తిప్పుతూనే ఉన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని విద్యార్థి నాయకులు అభిప్రాయపడ్డారు. పాత్రికేయ వృత్తి పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత సమాజం లో ప్రతి ఒక్కరిపై ఉందని, వార్తలు రాసినందుకు బెదిరింపులకు దిగడం అనేది సహించరానిదని వారు స్పష్టం చేశారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుక్కాపురం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్, పిడిఎస్ యూ నాయకుడు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Taluka press club president:Sambu.chandra sekhar
Taluka press club president:Sambu.chandra sekhar
అచ్చంపేట, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
3 hrs ago
c405b44b-ea8b-46f6-a911-79103d884c03

ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా? పత్రిక ల ద్వారా ప్రజా ప్రతినిధుల దృష్టికి తేవడానికి వార్త రాస్తే జర్నలిస్టుకి ఫోన్ లో బెదిరింపులు వాట్సాఅప్ లో వచ్చిన ఘటన పై ఎలా జరిగింది అని వివరాలు అడిగిన జర్నలిస్ట్ పై కూడా అక్రమ కేసు పెట్టి కోర్టుకు తిప్పుతున్న అటవీ, పోలీసు అధికారులు ప్రభుత్వానికి ప్రజల కు ఎదురైతున్న సమస్యల ను అధికారుల దృష్టికి తేవడం తప్పా ప్రశ్నించిన విద్యార్థి సంఘం నాయకులు అచ్చంపేట,ఏప్రిల్ 14(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిత్యం సమాజ సేవలో ముందుండే పాత్రికేయుడిపై దుర్భాషలు, బెదిరింపులకు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నా మని అచ్చంపేట విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆంధ్రప్రభ దినపత్రిక విలేకరి, తాలూకా ఇంచార్జి కె.ఎల్. నారాయణరావు పై ఇటీవల ఫోన్లో బెదిరించడం, దుర్భాషలు అడగడం, యావత్తు పాత్రికేయ వృత్తిని తులనాడడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళితే… అచ్చంపేట పట్టణ పరిధిలో జరుగుతున్న వెంచర్లపై జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రభ విలేకరి నారాయణరావు వార్తా కథనం ప్రచురించగా, దానిని జీర్ణించుకోలేని కొందరు రియల్ ఎస్టేట్ వర్గాలు ఫోన్ ద్వారా దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి. ఇది ఇలా ఉండగా అచ్చంపేట అటవీ శాఖ అధికారులు వాట్సాఅప్ లో చేసిన పోస్టు గురించి వివరాలు అడిగిన జర్నలిస్టు పై అటెంప్ట్ మర్డర్, చీటింగ్ ఆక్ట్ లతో , కేసును పెట్టి అచ్చంపేట కోర్టుకు తిప్పుతున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా పని చేసిన గోవర్ధన్, కేసు వేసిన సమయం లో ఎ మ్మెల్యే గా గువ్వల బాలరాజు పదవిలో ఉన్నాడు. ఇప్పటికీ కోర్టుకు తిప్పుతూనే ఉన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని విద్యార్థి నాయకులు అభిప్రాయపడ్డారు. పాత్రికేయ వృత్తి పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత సమాజం లో ప్రతి ఒక్కరిపై ఉందని, వార్తలు రాసినందుకు బెదిరింపులకు దిగడం అనేది సహించరానిదని వారు స్పష్టం చేశారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుక్కాపురం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్, పిడిఎస్ యూ నాయకుడు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు
    1
    భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    17 hrs ago
  • బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l
    1
    బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
బీసీ ఎస్సీ ఎస్టీ  జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు  వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల  మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    2 hrs ago
  • బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
    1
    బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...
    1
    నల్లగొండ బ్రేకింగ్: 
నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు..
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ...
అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి...
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు...
అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    20 hrs ago
  • నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    20 hrs ago
  • నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.
    1
    నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.
    user_Reporter
    Reporter
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గం:-
ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    17 hrs ago
  • పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాయుడని పేర్కొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం గుర్తించాయన్నారు
    1
    పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాయుడని పేర్కొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం గుర్తించాయన్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.