logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి* వనపర్తి జిల్లా బండరావిపాకుల ముంపు బాధితులకు 125 మందికి రూ.8.33 కోట్ల పరిహారం చెక్కుల పంపిణీ* నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎదుల రిజర్వాయర్ లో భాగంగా బండరావిపాకుల ముంపు గ్రామం నిర్వాసితులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథి గా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా 125 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.8.33 కోట్ల విలువైన పరిహారం చెక్కులను ఎమ్మెల్యే, కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయడం తమ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. బండరావిపాకుల ముంపు బాధితులకు నేడు పరిహారం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వం స్పందించి పరిహారం విడుదల చేయడం అభినందనీయమని, ఇందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బండరావిపాకుల, కొంకలపల్లి ముంపు నిర్వాసితుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.67 కోట్ల పరిహారం విడుదల చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు. అందులో భాగంగా నేడు బండరావిపాకుల సంబంధించి 125 మంది లబ్ధిదారులకు రూ.8.33 కోట్ల చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. పరిహారం విడుదల ప్రక్రియలో కృషి చేసిన జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. మొత్తం 175 మందికి పరిహారం ఉండాల్సి ఉండగా, చనిపోయిన వారు, బ్యాంకు ఖాతాల సమస్యల వల్ల కొందరికి ఇప్పుడు చెక్కులు రాలేదని, వారికి త్వరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముంపు పునరావాస గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. బండర్‌విపాకుల, కొంకలపల్లి, నాగరాల ఆర్‌అండ్‌ఆర్‌ గ్రామాల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరినట్లు చెప్పారు. ఈ గ్రామాల్లో ఇళ్లు అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గ్రామాల సమీపంలో అర ఎకరం భూమిని కేటాయించే అంశంపై అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా సుమారు రూ.2 కోట్ల నిధులు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో ఇప్పటికే బోర్‌వెల్‌ సౌకర్యం, బీటీ రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించామని, ఇంకా పెండింగ్‌లో ఉన్న నీటి ట్యాంకుల నిర్మాణం తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించిన పరిహారం మొత్తాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ముంపు బాధితులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే అధికారులు, ఎమ్మెల్యే చొరవతో బండరావిపాకుల గ్రామం ముంపు బాధితులకు ప్రభుత్వం పరిహారం త్వరగా విడుదల చేసిందని తెలిపారు. పరిహారం ద్వారా ప్రజలు తమ జీవనోపాధిని మంచిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, గోపాల్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్, వైస్ చైర్మన్ సత్య శీలా రెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్ రాజు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ముంపు బాధితులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_A Rajasheker
A Rajasheker
Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
1 hr ago
6c5eb5cd-626b-42db-807b-45eb375e4f79

More news from తెలంగాణ and nearby areas
  • మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు
    1
    మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ  వేడుకలు
బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    18 hrs ago
  • అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.
    1
    అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు
అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    21 hrs ago
  • ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.
    1
    ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత
ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    1 hr ago
  • శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.
    1
    శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ
బండి ఆత్మకూరు మండలం  జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి  శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర  ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు
రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర  ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె  గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన  అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను  పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు,  పద్ధతులు,  మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు  అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర,  రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..! మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
    1
    మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..!
మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
    user_Mandula Venkatesh
    Mandula Venkatesh
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    1
    ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సోదరా ABN రాధాకృష్ణ  మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా
కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది
ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది
మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు
మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది
ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ
కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా
ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    21 hrs ago
  • మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పోలీసుల దురుసు ప్రవర్తన హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని పోలీసులు తరలించారు. దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
    1
    మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పోలీసుల దురుసు ప్రవర్తన
హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన  కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని పోలీసులు తరలించారు. దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.