logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కానిస్టేబుల్ రమణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భూపాలపురం, ఆగస్టు 26: విధి నిర్వహణలో భాగంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎస్. రమణ కుటుంబ సభ్యులను విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం పరామర్శించారు. గుర్ల మండలం భూపాలపురంలోని రమణ స్వగ్రామానికి వెళ్లిన ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రమణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రమణ మృతి తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో రమణ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు. రమణ కుటుంబానికి రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు, బెనిఫిట్స్ అన్నీ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్‌లతో మాట్లాడి రమణ కుటుంబానికి రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను త్వరితగతిన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహిస్తూ ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ రమణ త్యాగం చిరస్మరణీయమని కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రమణ కుటుంబానికి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు. కానిస్టేబుల్ రమణకు ఘన నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

1 day ago
user_Giridhar singh
Giridhar singh
Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
1 day ago
9c1e7ec3-d88b-485b-8a1f-d97d6f1b4261

కానిస్టేబుల్ రమణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భూపాలపురం, ఆగస్టు 26: విధి నిర్వహణలో భాగంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎస్. రమణ కుటుంబ సభ్యులను విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం పరామర్శించారు. గుర్ల మండలం

79c931f0-e658-4d76-a6f8-c258ba11dbeb

భూపాలపురంలోని రమణ స్వగ్రామానికి వెళ్లిన ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రమణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రమణ మృతి తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో రమణ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎంపీ

6f101fec-9939-4c56-8780-20c167847dc5

భరోసా ఇచ్చారు. రమణ కుటుంబానికి రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు, బెనిఫిట్స్ అన్నీ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్‌లతో మాట్లాడి రమణ కుటుంబానికి రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను త్వరితగతిన అందేలా తగిన

16e787c9-42e8-4fe6-9752-c0e84ff459fb

చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహిస్తూ ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ రమణ త్యాగం చిరస్మరణీయమని కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రమణ కుటుంబానికి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు. కానిస్టేబుల్ రమణకు ఘన నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🌿 From the cotton field to everyday comfort. A little CGI imagination brings the journey to life. ☁️👕 MGM Vests — Born from Nature. Made for Comfort. Hashtags: #MGMVests #Cotton #Comfort #MensVest #MadeInIndia
    1
    🌿 From the cotton field to everyday comfort.
A little CGI imagination brings the journey to life. ☁️👕
MGM Vests — Born from Nature. Made for Comfort.
Hashtags:
#MGMVests #Cotton #Comfort #MensVest #MadeInIndia
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ విజయనగరం, ఆగస్టు 27: యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “యువ చైతన్యం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డెంకాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ యువతతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువతే సారథులుగా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసులకు మధ్య వారధులుగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు తీసుకురావాలని సూచించారు. దురలవాట్ల నిర్మూలన, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేరాల స్వరూపం, విధానం మారుతున్నాయని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యసనాలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అందిస్తున్నప్పటికీ, కొందరు యువత చెడు స్నేహాలు, స్నేహితుల ఒత్తిడి, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా మారితే విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను విడనాడి, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని ఎస్పీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా విద్య ఎంతో ముఖ్యమన్నారు. నేరాలకు పాల్పడే యువతపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా పెంచుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లొంగవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను అందుబాటులో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. రహదారి భద్రతకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతుందని వివరించారు. “యువత దేశానికి పట్టుకొమ్మలు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకొని సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు–పోలీసుల మధ్య వారధులుగా వ్యవహరిస్తూ మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు డెంకాడ పోలీసులు “మీతో–మీ ఎస్పీ” కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి. లీలారావు, డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
    1
    అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ 
విజయనగరం, ఆగస్టు 27: యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “యువ చైతన్యం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
డెంకాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ యువతతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువతే సారథులుగా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసులకు మధ్య వారధులుగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు తీసుకురావాలని సూచించారు. దురలవాట్ల నిర్మూలన, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం నేరాల స్వరూపం, విధానం మారుతున్నాయని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యసనాలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అందిస్తున్నప్పటికీ, కొందరు యువత చెడు స్నేహాలు, స్నేహితుల ఒత్తిడి, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా మారితే విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను విడనాడి, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
చదువుతోనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని ఎస్పీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా విద్య ఎంతో ముఖ్యమన్నారు. నేరాలకు పాల్పడే యువతపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా పెంచుతామని హెచ్చరించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లొంగవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మహిళల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను అందుబాటులో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
రహదారి భద్రతకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతుందని వివరించారు.
“యువత దేశానికి పట్టుకొమ్మలు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకొని సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు–పోలీసుల మధ్య వారధులుగా వ్యవహరిస్తూ మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న యువతకు డెంకాడ పోలీసులు “మీతో–మీ ఎస్పీ” కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి. లీలారావు, డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం.. విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.
    1
    విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం..
విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo  & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా  కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సంతకవిటి : అల్పపీడనం ప్రభావంతో నాగావళి నది కి భారీ గా వరద నీరు సంతకవిటి మండలం రంగరాయ పురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టు కు 10460 క్యూసిక్కుల నీరు ప్రవహిస్తుoదని ఆయకట్టు ఏ ఈ శివాజీ తెలిపారు. దీంతో దిగివకు నీరు విడిచిపెడుతున్నామని నదిలోకి ఎవరు దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
    1
    సంతకవిటి : అల్పపీడనం ప్రభావంతో  నాగావళి నది కి భారీ గా వరద నీరు 
సంతకవిటి మండలం రంగరాయ పురం  వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టు కు 10460 క్యూసిక్కుల నీరు ప్రవహిస్తుoదని ఆయకట్టు ఏ ఈ శివాజీ తెలిపారు. దీంతో దిగివకు నీరు విడిచిపెడుతున్నామని నదిలోకి ఎవరు దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
    user_Prama latha
    Prama latha
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • స్వగ్రామంలో సుదీర్ఘ ప్రజా దర్బార్ నిర్వహించిన కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం సుదీర్ఘ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఓపిగ్గా నిర్వహించారు. ఈ గ్రామం ఆయన స్వగ్రామం కావడం విశేషం. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమoలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి అర్జీదారులకు భరోసా కల్పించారు.
    1
    స్వగ్రామంలో సుదీర్ఘ ప్రజా దర్బార్ నిర్వహించిన కేంద్రమంత్రి రామ్మోహన్
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో కేంద్ర  విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం  సుదీర్ఘ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఓపిగ్గా నిర్వహించారు. ఈ గ్రామం ఆయన స్వగ్రామం కావడం విశేషం. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు  నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమoలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి అర్జీదారులకు భరోసా కల్పించారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. మేదరబంద కాలువ దుర్వాసన
    1
    బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
మేదరబంద కాలువ దుర్వాసన
    user_B.RAJESH
    B.RAJESH
    Media company బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు - మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు - శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
    1
    సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు
- మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు
- శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి
మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
    1
    వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు
శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం  నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా  నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.