కోవూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అకస్మాత్తుగా తనిఖీ - పరీక్షలంటే భయం వద్దు.. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. - మార్చి 11 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ పై విద్యార్థులకు అవగాహన. - 15 సంవత్సరాల లోపు వయస్సున్న ఆడ పిల్లలందరూ గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలి. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న 10 వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆల్ ద బెస్ట్ చెప్పారు. కోవూరు జెడ్ పి బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఆమె 10 తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. పరీక్షలంటే భయం వద్దు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండని అని వారిలో ధైర్యాన్ని నింపారు. మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు.అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మార్చి 11 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ పి వి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ గురించి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 14 నుండి 15 సంవత్సరాల లోపు వయస్సున్న ఆడపిల్లలందరూ గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పివి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం బాలికల ఆరోగ్యం అత్యంత కీలకమని 15 ఏళ్ళ వయసున్న ప్రతి విద్యార్థిని భవిషత్ ఆరోగ్య పరిరక్షణకై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోవూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అకస్మాత్తుగా తనిఖీ - పరీక్షలంటే భయం వద్దు.. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. - మార్చి 11 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ పై
విద్యార్థులకు అవగాహన. - 15 సంవత్సరాల లోపు వయస్సున్న ఆడ పిల్లలందరూ గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలి. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న 10 వ తరగతి
పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆల్ ద బెస్ట్ చెప్పారు. కోవూరు జెడ్ పి బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఆమె 10 తరగతి విద్యార్థినులతో మాట్లాడారు.
పరీక్షలంటే భయం వద్దు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండని అని వారిలో ధైర్యాన్ని నింపారు. మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు.అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మార్చి
11 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ పి వి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ గురించి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 14 నుండి 15 సంవత్సరాల లోపు వయస్సున్న ఆడపిల్లలందరూ గర్భాశయ క్యాన్సర్
నివారణకు హెచ్పివి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం బాలికల ఆరోగ్యం అత్యంత కీలకమని 15 ఏళ్ళ వయసున్న ప్రతి విద్యార్థిని భవిషత్ ఆరోగ్య పరిరక్షణకై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- స్మాల్ స్కాలర్స్ పాఠశాలలో వారు స్కూల్లో ఏడవ తరగతి వరకు చదివి ఇప్పుడు టెన్త్ క్లాస్ సీబీఎస్సీ పరీక్షలు స్కూల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినంద సభ జరిగింది. ఆ సమావేశాలలో స్కూల్ కరస్పాండెంట్ పి పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ ఎల్కేజీ నుండి ఏడవ తరగతి వరకు ప్రారంభించిన మా స్కూలు అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని అందుకు ఉదాహరణగా మా స్కూలు నందు ఏడవ తరగతి పాసై నగరంలో వివిధ స్కూళ్లలో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. పద్మజా రెడ్డి గారి మాట్లాడుతూ స్మాలర్ స్కాలర్ స్కూల్ 2012లో ఈ బిల్డింగ్ లో ప్రారంభించామని ,ప్రీ ప్రైమరీ లెవెల్ లో మాంటిసోరి కరికులం ఫాలో అవుతూ విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాష పరిపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ గా మారిపోయాయి. మా స్కూల్లో రెగ్యులర్గా వివిధ కార్యక్రమాల ద్వారా ఇంగ్లీషులో మాట్లాడడం వారి మాతృభాషలాగా అలవాటు చేశాము. స్కూల్లో జరిగే స్పీచ్ కాంపిటీషన్స్ మరియు డిబేట్ కాంపిటీషన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని పాల్గొనేటట్టు చేస్తున్నాము, దీనివలన ప్రతి విద్యార్థికి పబ్లిక్ స్పీకింగ్ అలవాటవుతుంది. మా పూర్వ విద్యార్థి డి సాత్విక్ రెడ్డి 487 మార్క్స్ తెచ్చుకుని తను తన స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఇంగ్లీష్ భాషలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని స్మాలర్ స్కాలర్స్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. ఇదే విధంగా మా పూర్వ విద్యార్థిని వి. ఇవాంజులిన్ 475 మార్కులు తెచ్చుకుని మా స్కూలు పేరు నిలిపింది. విద్యార్థులను నైమిశా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పి .శశిధర్ రెడ్డి గారు మరియు సొసైటీ ట్రెజరర్ బి .రామ్మోహన్ రెడ్డి గారు అభినందించారు. కరస్పాండెంట్ పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ స్కూల్ని సెవెంత్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు త్వరలో ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు.2
- పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టిడిపి విధానం - కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు. - మలి విడతగా నేడు 67 అన్న క్యాంటీన్ల ప్రారంభం. - అన్న క్యాంటీన్లు రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. - గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసింది. - కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాది అని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆమె ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన కూడు, గూడు, గుడ్డ నినాదమే నేడు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్ఫూర్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని గతంలో చాలా బాధపడేదానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల నుంచి ఆసుపత్రి పనుల కోసం, ఇతర అవసరాల కోసం కోవూరు వచ్చే పేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవలో ముందుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.4
- Post by N సూరి1
- Post by Bondhu Suresh1
- అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..* *ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..* 👉అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!!తెలుసుకొండి.. 👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..? 👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..? 👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను భంగం కలిగించడమే అవుతుంది. 👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..? 👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…? 👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..? 👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? 👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు. 👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే.. 👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…? 👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. 🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. 👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి. 👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…? 👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి. 👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు. మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.. అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.. *జై జర్నలిజం.. జై జై జర్నలిజం..* 🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా *🇮🇳జర్నలిస్టు🇮🇳* *🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*1
- Post by RAVI KUMAR1
- జగనన్నను ప్రేమించే వారి మధ్యలో. నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.1
- 💐✌️తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐2