పల్లెల్లో పరుగులు పెడుతున్న అభివృద్ధి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. రూ.30 లక్షలతో రాయనపాడులో సీసీ రోడ్లు ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 30.03.2026. పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, నియోజకవర్గంలో పల్లెపండుగ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.32.92 కోట్లు కేటాయించామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలో రూ.30 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు సోమవారం ప్రారంభించారు. ముందుగా శివాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. పల్లెపండుగ కింద కేటాయించిన నిధులు పూర్తిగా సద్వినియోగ పరచి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

- దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.1
- . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.1
- Post by Syyed taher1
- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- శాసనమండలి శాసనసభ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా హైదరాబాదులో జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నా అభినయంతో ఆటపాటలతో ఆకట్టుకున్నారు ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు పాటకు శోభన్ బాబును అనుకరిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎమ్మెల్యే స్టెప్పులను చూసిన ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.3
- నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- Post by Ramprasad islavath1