అంబేద్కర్ గురుకులంలో విద్యార్థినులకు భద్రతపై అవగాహన -పిఠాపురం పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమం పిఠాపురం: పిఠాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు విద్యార్థినిలకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్, పట్టణ ఎస్ఐ వి. మణికుమార్ మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, రక్షణ మరియు భవిష్యత్ నిర్మాణంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఇన్‌చార్జ్ ఎస్‌బీ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల, ఇంటి పరిసరాలు, ప్రజా ప్రదేశాలు మరియు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరాన్ని, సైబర్ నేరాల నివారణకు పాటించాల్సిన విధానాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 181, 112, 1091 హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా ముందుకు రావాలని హితవు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తమ భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకోవాలని సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంబేద్కర్ గురుకులంలో విద్యార్థినులకు భద్రతపై అవగాహన -పిఠాపురం పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమం పిఠాపురం: పిఠాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు విద్యార్థినిలకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్, పట్టణ ఎస్ఐ వి. మణికుమార్ మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, రక్షణ మరియు భవిష్యత్ నిర్మాణంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఇన్‌చార్జ్ ఎస్‌బీ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల, ఇంటి పరిసరాలు, ప్రజా ప్రదేశాలు మరియు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సోషల్ మీడియా
వినియోగంలో అప్రమత్తత అవసరాన్ని, సైబర్ నేరాల నివారణకు పాటించాల్సిన విధానాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 181, 112, 1091 హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా ముందుకు రావాలని హితవు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తమ భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకోవాలని సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.3
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- manasuloni mata1
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...4
- Post by Rai Narendra1
- పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.3