A.P లో పాఠశాల Smc 2026-27 ఎన్నికల షెడ్యూల్ ఖరారైనట్లేనా. 📢 *AP SMC Elections 2026* ఆంధ్రప్రదేశ్‌లో School Management Committees (SMCs) పునర్నిర్మాణం/ఎన్నికలకు రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి షెడ్యూల్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి SMC ఎన్నికలు 29-09-2026న నిర్వహించనున్నారు. 🗓️ ముఖ్యమైన తేదీలు & సమయాలు 🔴 15-09-2026, మంగళవారం – ఉదయం 10:00 గంటలకు ➡️ SMC ఎన్నికల నోటిఫికేషన్ జారీ. 🟠 18-09-2026, శుక్రవారం – మధ్యాహ్నం 2:00 గంటలకు ➡️ ఎన్నికల కోసం Voter List పాఠశాల Notice Boardపై ప్రదర్శన. 🟡 25-09-2026, శుక్రవారం ➡️ ఉదయం 9:00 – మధ్యాహ్నం 1:00 వరకు: ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు/ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం. ➡️ మధ్యాహ్నం 3:00 – 4:00 వరకు: తుది Voter List Finalization చేసి Notice Boardపై ప్రదర్శన. 🟢 29-09-2026, మంగళవారం – ప్రధాన ఎన్నికల రోజు ⏰ ఉదయం 7:00 – మధ్యాహ్నం 1:00 వరకు ➡️ SMC సభ్యుల ఎన్నికలు & SMC పునర్నిర్మాణం ⏰ మధ్యాహ్నం 1:30 గంటలకు ➡️ SMC సభ్యుల ద్వారా Chairperson & Vice-Chairperson ఎన్నిక ⏰ మధ్యాహ్నం 2:00 గంటలకు ➡️ SMC Members, Chairperson & Vice-Chairperson Oath Taking ⏰ మధ్యాహ్నం 3:00 – 3:30 వరకు ➡️ First SMC Meeting 🚨 ముఖ్యమైన అలర్ట్ 👉 15 సెప్టెంబర్ – Notification 👉 18 సెప్టెంబర్ – Voter List Display 👉 25 సెప్టెంబర్ – Objections + Final Voter List 👉 ⭐ 29 సెప్టెంబర్ – SMC Elections ప్రతి పాఠశాల Headmaster/Teacher తప్పనిసరిగా షెడ్యూల్ ప్రకారం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి. 📌 SMC Election Date: 29-09-2026 ⏰ Election Time: 7:00 AM – 1:00 PM
A.P లో పాఠశాల Smc 2026-27 ఎన్నికల షెడ్యూల్ ఖరారైనట్లేనా. 📢 *AP SMC Elections 2026* ఆంధ్రప్రదేశ్‌లో School Management Committees (SMCs) పునర్నిర్మాణం/ఎన్నికలకు రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి షెడ్యూల్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి SMC ఎన్నికలు 29-09-2026న నిర్వహించనున్నారు. 🗓️ ముఖ్యమైన తేదీలు & సమయాలు 🔴 15-09-2026, మంగళవారం – ఉదయం 10:00 గంటలకు ➡️ SMC ఎన్నికల నోటిఫికేషన్ జారీ. 🟠 18-09-2026, శుక్రవారం – మధ్యాహ్నం 2:00 గంటలకు ➡️ ఎన్నికల కోసం Voter List పాఠశాల Notice Boardపై ప్రదర్శన. 🟡 25-09-2026, శుక్రవారం ➡️ ఉదయం 9:00 – మధ్యాహ్నం 1:00 వరకు: ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు/ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం. ➡️ మధ్యాహ్నం 3:00 – 4:00 వరకు: తుది Voter List Finalization చేసి Notice Boardపై ప్రదర్శన. 🟢 29-09-2026, మంగళవారం – ప్రధాన ఎన్నికల రోజు ⏰ ఉదయం 7:00 – మధ్యాహ్నం 1:00 వరకు ➡️ SMC సభ్యుల ఎన్నికలు & SMC పునర్నిర్మాణం ⏰ మధ్యాహ్నం 1:30 గంటలకు ➡️ SMC సభ్యుల ద్వారా Chairperson & Vice-Chairperson ఎన్నిక ⏰ మధ్యాహ్నం 2:00 గంటలకు ➡️ SMC Members, Chairperson & Vice-Chairperson Oath Taking ⏰ మధ్యాహ్నం 3:00 – 3:30 వరకు ➡️ First SMC Meeting 🚨 ముఖ్యమైన అలర్ట్ 👉 15 సెప్టెంబర్ – Notification 👉 18 సెప్టెంబర్ – Voter List Display 👉 25 సెప్టెంబర్ – Objections + Final Voter List 👉 ⭐ 29 సెప్టెంబర్ – SMC Elections ప్రతి పాఠశాల Headmaster/Teacher తప్పనిసరిగా షెడ్యూల్ ప్రకారం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి. 📌 SMC Election Date: 29-09-2026 ⏰ Election Time: 7:00 AM – 1:00 PM
- సంతకవిటి మండలం లో ఈదురు గాలి లో తో కూడిన వర్షం ప్రజలు అంత సూరక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచనలు సంతకవిటి మండలం లో మంగళవారం ఒక్కసారి గా వాతావరణం లో మార్పులు చోటు చేసికొని వర్షం పడింది.పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలుoత సురక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచించారు.1
- 'మల్ఖానా' భవనాన్ని ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదేశాలు శ్రీకాకుళం: మాదకద్రవ్యాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును నిల్వ చేసేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక 'మల్ఖానా' భవనాన్ని అన్ని రకాల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఒకటవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వై. బెన్నయ్య నాయుడు అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం వెనుక భాగంలో రూ.30 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న మల్ఖానా భవన నిర్మాణ పనులను మంగళవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మొత్తానికి ఏకైక నిల్వ కేంద్రంగా ఉండే ఈ భవనంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల మేరకు పటిష్టమైన డోర్లు, చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని సూచించారు.భవనం లోపల, వెలుపల పరిసరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు, అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది నిరంతర కాపలా ఉండేలా చర్యలు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను త్వరగా ముగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- విజయనగరంలో ట్రైనీ కానిస్టేబుల్స్‌కు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ విజయనగరం జిల్లా సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనీ కానిస్టేబుల్స్‌కు రెండు రోజుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వాలీబాల్, కబడ్డీ, హైజంప్ పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని ఎస్పీ సూచించారు.1
- మత సామరస్యానికి ప్రతీక ఖాదర్ బాబా దర్గా సూఫీ పీఠాధిపతి ఖ్వాజా మొహియినుద్దీన్ విజయనగరం, సెప్టెంబర్ 15: శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యానికి బాబామెట్టలోని హజరత్ ఖాదర్ బాబా దర్గా షరీఫ్ ప్రతీకగా నిలుస్తోందని చీమలపాడు సూఫీ పీఠాధిపతి, సజ్జాదా నషీన్ మొహమ్మద్ ఖ్వాజా మొహియినుద్దీన్ అన్నారు. బుధవారం నిర్వహించనున్న హజరత్ ఖాదర్ బాబా 130వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం బాబామెట్ట దర్బార్ షరీఫ్‌లో ధర్మకర్త డాక్టర్ ఎం.డీ. ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ (ఖలీల్ బాబు)తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖ్వాజా మొహియినుద్దీన్ మాట్లాడుతూ ఖాదర్ బాబా జన్మదినం సూఫీ పరంపరలో విశిష్టమైన పర్వదినమన్నారు. మానవత్వంతో కూడిన సూఫీ ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచానికి విస్తరించిన మహనీయుల్లో బాబా ఖాదర్ షా ఒకరని కొనియాడారు. సుమారు 850 ఏళ్ల క్రితమే భారతదేశంలో సూఫీ పరంపర ప్రారంభమైందని తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు అందించడం, మాటలతోగానీ చేతలతోగానీ ఇతరులను బాధించకుండా మానవత్వంతో జీవించడమే సూఫీ మార్గమని వివరించారు. ఈ పరంపరలో ఎంతోమంది మహనీయులు భారతదేశంలో జన్మించారని, నాగ్‌పూర్ తాజుద్దీన్ బాబా శిష్యుల్లో అగ్రగణ్యుడిగా బాబా ఖాదర్ షా నిలిచారని తెలిపారు. 1900 నుంచి 1961 వరకు విజయనగరంలో ఖాదర్ బాబా వారి ఆధ్యాత్మిక సందర్శనా కాలంగా పేర్కొన్నారు. ఈ కాలంలో బాబా అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసి, శాంతి, మత సామరస్య సందేశాన్ని విస్తరించారని చెప్పారు. అన్నార్తుల ఆకలి తీర్చడం, వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చడం, బాధితులకు అండగా నిలవడం వంటి సేవలతో బాబా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని పేర్కొన్నారు. బాబా పవిత్ర సమాధిని దర్శించుకునే భక్తులకు నేటికీ ఆశీస్సులు లభిస్తున్నాయన్న విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. ఖాదర్ బాబాపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఘనంగా జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించనున్న ఖాదర్ బాబా 130వ జన్మదిన వేడుకలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బాబా భక్తులు హాజరుకానున్నారని ఖ్వాజా మొహియినుద్దీన్ తెలిపారు. భక్తుల కోసం అవసరమైన వసతి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. మంగళవారం నుంచే దర్బార్ షరీఫ్‌లో ఉత్సవ సందడి నెలకొందన్నారు. మంగళవారం మధ్యాహ్నం, రాత్రి భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజల కోసం భారీ అన్న సమారాధన నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బాబా దివ్య సమాధికి చాదర్, సుగంధ ద్రవ్యాలు, పూలు, మిఠాయిలు సమర్పించి విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం, రాత్రి దర్బార్ షరీఫ్‌లో భారీ అన్న సమారాధన నిర్వహించడంతో పాటు రాత్రి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఖలీల్ బాబు తనయుడు ఎం.డీ. అహ్మద్ బాబు, నాగేంద్ర బాబాయ్, రంగారావు బాబాయ్ తదితరులు పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా బొబ్బిలి కోటకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను, టిడిపి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం... విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజవర్గ పరిధిలో ఉన్న నాయకులను, కార్యకర్తలను చిన్న శ్రీను గారుకి పరిచయం చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన . - మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఫోటోలు. - నియోజకవర్గ జనసేన నాయకులను పరిచయం చేసన బేబీనాయన. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)*శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* ఆహ్వానం మేరకు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటకు వచ్చారు.. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దర్బార్ మహల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే*బేబీనాయన* గారు మాట్లాడుతూ, మజ్జి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి రావడం *తనకు చాలా సంతోషంగా ఉందని* అన్నారు.. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల తరుపున స్వాగతం పలికారు.. అలానే, *వారి చేరికను తాను వ్యతిరేకించినట్లు కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు*.. వారి చేరికతో పార్టీ మరింత బలపడుతుందని తనకి పూర్తి నమ్మకం ఉందన్నారు.. రాజకీయంగా వేరే పార్టీలలో పనిచేసినా కూడా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు మాకు లేవని స్పష్టతనిచ్చారు.. అందరం కలసికట్టుగా పనిచేసి, గౌరవ ప్రధానమంత్రి *నరేంద్ర మోదీ* ముఖ్యమంత్రి శ్రీ *నారా చంద్రబాబునాయుడు* , ఉప ముఖ్యమంత్రి *పవన్ కళ్యాణ్* గారు నాయకత్వాన్ని బలపరిచి మన నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* మాట్లాడుతూ, బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుకి ఎల్లప్పుడూ తాను సహకరిస్తానని, చిరస్థాయిగా వారు రాజకీయంగా ఎదగాలని అన్నారు.. గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని.. ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయంతో ముందుకు సాగుతామని, పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం మేరకు పనిచేస్తానని తెలిపారు. మాజీ మంత్రి శ్రీ సుజయ్ నాయన మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు తో కూడా మాట్లాడానని, వారిని కూడా కలుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి , విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేష్ , ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు మరియు చింతల రామకృష్ణ, బొబ్బిలి పట్టణం మరియు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాస్ , మాజీ మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ , టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఉద్యమం.. మద్దతు తెలిపిన సత్యనారాయణ పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన కార్యక్రమం కొనసాగుతోంది. పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని గ్రామాలను సందర్శిస్తూ రైతులు, ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన దుశృర్ల సత్యనారాయణ సాధన సమితి సభ్యులకు మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో తన వంతు సహాయ సహకారాలు అందించి, జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం కలిసి పనిచేస్తానని తెలిపారు. 50 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయి, కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలాయని, జంఝావతి మన్యం ప్రజలకు జీవనాడి వంటిదని ఆయన పేర్కొన్నారు.1
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అకాల మరణం,................ కాంగ్రెస్ నాయకునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004 నుంచి 2009 వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో మరణించారు. అత్తగారింటికి పండగకి గాని వచ్చిన ఆయనకు ఊహించని విధంగా గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని సీతమ్మదార లో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించగా ఆయన అక్కడ మృతి చెందారు.1
- విజయనగరం జిల్లా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వక కలిసిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్.. విజయనగరం జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని కలిసిన మజ్జి శ్రీను,గత వారం రోజులుగా విజయనగరం జిల్లాలో రాజకీయాల్లో మార్పు వచ్చింది జడ్పీ చైర్మన్, వైసీపీ నాయకులు మజ్జి శ్రీను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువ నాయకుల లోకేష్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి మజ్జి శ్రీను రావటం జిల్లాలో పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆశిస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, చంద్రబాబు గారి నిర్ణయాన్ని అమలు చేయటానికి సమన్వయంతో పనిచేస్తామన్న మజ్జి శ్రీను, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందని తెలిపిన మజ్జి శ్రీను,తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి నాయకులతో డబల్ ఇంజన్ సర్కార్ 2029 ఏర్పాటు చేయటానికి కృషి చేస్తానని తెలిపిన మజ్జి శ్రీను, స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కష్టపడి పనిచేయాలని ఆదేశం,ద్వితీయ శ్రేణి నాయకులతో సైతం సమన్వయం చేసుకొని ముందుకు సాగుతానన్న మజ్జి శ్రీను , మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి శ్రీను.2