logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిఘా కళ్లపై నిర్లక్ష్యపు నీడలు..పట్టించుకున్న నాథుడే లేడు* *బంగారం, నగదు, చివరకు గొర్రెలను కూడా వదలని దొంగలు..* చిగురుమామిడి, మార్చి 30, ( నేటి తరం): శాంతి భద్రతల పరిరక్షణలో సిసి కెమెరాల పాత్ర చాలా కీలకం. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని.మండలంలోని 17 గ్రామాలు పూర్తిగా నిరంతర నిఘాలో నీడలో ఉండాలని పోలీస్ శాఖ లక్ష్యంతో అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాస సుధాకర్, ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ఉద్యోగులు, పోలీసులు, ప్రజల సహకారంతో జనాభా ఎక్కువగా ఉన్న 9 గ్రామాలకు మొదటగా 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రేకొండ 16, ఇందుర్తి 30, చిగురుమామిడి 16, బొమ్మనపల్లి 22, చిన్న ములకనూరు 20, సుందరగిరి 18, నవాబు పేట్ 16, కొండాపూర్ 12, ఉల్లంపల్లి 10, ముదిమాణిక్యం, రామంచ, గాగిరెడ్డిపల్లె, తోపాటు అన్ని గ్రామాలకు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో అప్పటి సీపీ ఎల్ సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు.కానీ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లేకపోవడం, సాంకేతిక లోపాలు, విద్యుత్ సమస్యలు, మరియు పాతబడిన కేబుల్స్ వల్ల పనిచేయడం లేదు. కాలానుగుణంగా తనిఖీ చేయకపోవడం, లెన్స్‌పై దుమ్ము, ధూళి పేరుకుపోవడం, మరియు పాత సాఫ్ట్‌వేర్/ఫర్మ్‌వేర్ సమస్యలు. సీసీ కెమెరాలను క్రమం తప్పకుండా (ప్రతి 3-6 నెలలకు ఒకసారి) సాంకేతిక నిపుణులతో తనిఖీ చేయించాలి. కానీ ఏర్పాటు చేసిన కాలం నుండి వీటిని పట్టించుకునే నాధుడే లేడు. గ్రామాల్లో సిసి కెమెరాలు లేకపోవడం లేదా పనిచేయని స్థితిలో ఉండటం వల్ల బంగారం, నగదు, బైకులు, వ్యవసాయ మోటర్లు, వీటితోపాటు చివరికి గొర్రెలను వదలని దొంగలు, అక్రమ రవాణా, దొంగతనాలు, నేరాలు పెరిగి గ్రామ ప్రజలు రక్షణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, ఆస్తుల విధ్వంసం వంటి ఘటనలు జరిగినప్పుడు ఆధారాలు లేక నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది, దీనితో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీసీ నిఘా లేని గ్రామాల్లో దొంగతనాలు, దోపిడీలు సులభంగా జరుగుతున్నాయి. నేరాలు జరిగినప్పుడు ఆధారాలు లేకపోవడం వల్ల దర్యాప్తు మందగించి, నేరస్థులు తప్పించుకుంటున్నారు. పాత కెమెరాలు పనిచేయకపోవడం వల్ల గ్రామస్తులకు నిరంతర నిఘా కరువై, భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిఘా కెమెరాల ఆవశ్యకతపై ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. సీసీ కెమెరాలు స్థానిక పోలీసుల చొరవతో దాతల సహకారంతో గ్రామాల్లో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అవసరం. ఇప్పటికే ఉన్న కెమెరాలను నిరంతరం పర్యవేక్షించి, పనిచేసేలా చూడటం ముఖ్యం. పోలీసు అధికారులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, గ్రామ భద్రతను పెంపొందించడానికి ప్రతి గ్రామంలో నిఘా వ్యవస్థ బలంగా ఉండటం ఎంతో కీలకమని, దీనికి గ్రామపంచాయతీ సర్పంచులు, పాలకవర్గం, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పోలీస్ శాఖ సంయుక్తంగా కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

2 hrs ago
user_Prakash Goud
Prakash Goud
Chigurumamidi, Karimnagar•
2 hrs ago
7cb8140b-f258-4739-b880-e559d29e96b3

నిఘా కళ్లపై నిర్లక్ష్యపు నీడలు..పట్టించుకున్న నాథుడే లేడు* *బంగారం, నగదు, చివరకు గొర్రెలను కూడా వదలని దొంగలు..* చిగురుమామిడి, మార్చి 30, ( నేటి తరం): శాంతి భద్రతల పరిరక్షణలో సిసి కెమెరాల పాత్ర చాలా కీలకం. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని.మండలంలోని 17 గ్రామాలు పూర్తిగా నిరంతర నిఘాలో నీడలో ఉండాలని పోలీస్ శాఖ లక్ష్యంతో అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాస సుధాకర్, ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ఉద్యోగులు, పోలీసులు, ప్రజల సహకారంతో జనాభా ఎక్కువగా ఉన్న 9 గ్రామాలకు మొదటగా 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రేకొండ 16, ఇందుర్తి 30, చిగురుమామిడి 16, బొమ్మనపల్లి 22, చిన్న ములకనూరు 20, సుందరగిరి 18, నవాబు పేట్ 16, కొండాపూర్ 12, ఉల్లంపల్లి 10, ముదిమాణిక్యం, రామంచ, గాగిరెడ్డిపల్లె, తోపాటు అన్ని గ్రామాలకు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో అప్పటి సీపీ ఎల్ సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు.కానీ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లేకపోవడం, సాంకేతిక లోపాలు, విద్యుత్ సమస్యలు, మరియు పాతబడిన కేబుల్స్ వల్ల పనిచేయడం లేదు. కాలానుగుణంగా తనిఖీ చేయకపోవడం, లెన్స్‌పై దుమ్ము, ధూళి పేరుకుపోవడం, మరియు పాత సాఫ్ట్‌వేర్/ఫర్మ్‌వేర్ సమస్యలు. సీసీ కెమెరాలను క్రమం తప్పకుండా (ప్రతి 3-6 నెలలకు ఒకసారి) సాంకేతిక నిపుణులతో తనిఖీ

691d98ab-b2a5-4caa-90eb-c2f1564161fc

చేయించాలి. కానీ ఏర్పాటు చేసిన కాలం నుండి వీటిని పట్టించుకునే నాధుడే లేడు. గ్రామాల్లో సిసి కెమెరాలు లేకపోవడం లేదా పనిచేయని స్థితిలో ఉండటం వల్ల బంగారం, నగదు, బైకులు, వ్యవసాయ మోటర్లు, వీటితోపాటు చివరికి గొర్రెలను వదలని దొంగలు, అక్రమ రవాణా, దొంగతనాలు, నేరాలు పెరిగి గ్రామ ప్రజలు రక్షణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, ఆస్తుల విధ్వంసం వంటి ఘటనలు జరిగినప్పుడు ఆధారాలు లేక నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది, దీనితో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీసీ నిఘా లేని గ్రామాల్లో దొంగతనాలు, దోపిడీలు సులభంగా జరుగుతున్నాయి. నేరాలు జరిగినప్పుడు ఆధారాలు లేకపోవడం వల్ల దర్యాప్తు మందగించి, నేరస్థులు తప్పించుకుంటున్నారు. పాత కెమెరాలు పనిచేయకపోవడం వల్ల గ్రామస్తులకు నిరంతర నిఘా కరువై, భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిఘా కెమెరాల ఆవశ్యకతపై ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. సీసీ కెమెరాలు స్థానిక పోలీసుల చొరవతో దాతల సహకారంతో గ్రామాల్లో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అవసరం. ఇప్పటికే ఉన్న కెమెరాలను నిరంతరం పర్యవేక్షించి, పనిచేసేలా చూడటం ముఖ్యం. పోలీసు అధికారులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, గ్రామ భద్రతను పెంపొందించడానికి ప్రతి గ్రామంలో నిఘా వ్యవస్థ బలంగా ఉండటం ఎంతో కీలకమని, దీనికి గ్రామపంచాయతీ సర్పంచులు, పాలకవర్గం, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పోలీస్ శాఖ సంయుక్తంగా కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లాలో కొత్త తరహాలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ పేరుతో మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్యాస్ సిలిండర్ వచ్చిందని తమతో పాటు రావాలని చెప్పడం తో ఆ మహిళ వారిని అనుసరించింది. మహిళను మభ్యపెట్టిన దుండగులు మహిళను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న నాలుగున్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో మహిళా మోసపోయనని గ్రహించి ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. చేసింది. రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలో కొత్త తరహాలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ పేరుతో మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్యాస్ సిలిండర్ వచ్చిందని తమతో పాటు రావాలని చెప్పడం తో ఆ మహిళ వారిని అనుసరించింది. మహిళను మభ్యపెట్టిన దుండగులు మహిళను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న నాలుగున్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో మహిళా మోసపోయనని గ్రహించి ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. చేసింది. రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్  స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నిన్నటి రాత్రి ఒక పీడకలలా మారింది. ఒక్కసారిగా మారిన వాతావరణం అకాల వర్షం ఈదురుగాలలతో మామిడి కాయలు నేల రాలడంతో అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నేలపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
    1
    పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నిన్నటి రాత్రి ఒక పీడకలలా మారింది. ఒక్కసారిగా మారిన వాతావరణం అకాల వర్షం ఈదురుగాలలతో మామిడి కాయలు నేల రాలడంతో అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నేలపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    21 hrs ago
  • హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    1
    హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    11 min ago
  • జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్‌లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం
    1
    జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన 
చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్‌లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్
నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్
నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్
విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు
చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణ వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ తమకు రావలసిన బకాయిల కోసం కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ నిరసన ఆందోళనకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్ తెలంగాణ జాగృతి జిల్లా అద్యక్షులు హరిప్రసాద్ సంఘీభావం తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని , జిపిఎఫ్ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు బకాయి ఉన్న డీఏ ఏక మొత్తంగా చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారని ఉద్యోగ సమయంలో వారు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 25 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని.. వారు రిటైర్డ్ అనంతరం పిల్లల వివాహానికి కావచ్చు ఇల్లు నిర్మించుకోవడం కోసం కావచ్చు.. ఇలా భవిష్యత్తు కొరకు ఉద్యోగం చేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బును రిటైర్డ్ అయిన తర్వాత వస్తుందని ఎదురు చూసే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక రెండున్నరెండ్లుగా సుమారు 50మంది వరకు మానసికక్షోభకు గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ లలో కమిషన్ల కోసం ప్రభుత్వం సుమారు 63 వేల కోట్లను విడుదల చేసిందని ఆరోపించారు.
    2
    తెలంగాణ వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ తమకు రావలసిన బకాయిల కోసం కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ నిరసన ఆందోళనకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్ తెలంగాణ జాగృతి జిల్లా అద్యక్షులు హరిప్రసాద్ సంఘీభావం తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని , జిపిఎఫ్ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు బకాయి ఉన్న డీఏ ఏక మొత్తంగా చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారని ఉద్యోగ సమయంలో వారు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 25 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని..
వారు రిటైర్డ్ అనంతరం పిల్లల వివాహానికి కావచ్చు ఇల్లు నిర్మించుకోవడం కోసం కావచ్చు.. ఇలా భవిష్యత్తు కొరకు  ఉద్యోగం చేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బును రిటైర్డ్ అయిన తర్వాత వస్తుందని ఎదురు చూసే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక  రెండున్నరెండ్లుగా సుమారు 50మంది వరకు   మానసికక్షోభకు గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ లలో కమిషన్ల కోసం ప్రభుత్వం సుమారు 63 వేల కోట్లను విడుదల చేసిందని ఆరోపించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.