ప్రజా సమస్యల కంటే.. జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది : ప్రత్తిపాటి ప్రజా సమస్యల కంటే.. జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది : ప్రత్తిపాటి • వైసీపీ ఎమ్మెల్సీల ధోరణిపై సొంతపార్టీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నారు : ప్రత్తిపాటి • జగన్ కుంభకోణాలు, దోపిడీలపై ప్రజల్లో చర్చ జరగకూడదన్నదే వైసీపీ సభ్యుల అంతిమ లక్ష్యం : ప్రత్తిపాటి. • టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని హెరిటేజ్ స్పష్టంగా చెప్పినా.. వైసీపీ సభ్యులు కుక్కతోక పట్టుకొని గోదారి ఈదే ప్రయత్నం చేస్తున్నారు. :ప్రత్తిపాటి • తన కొలంబో పర్యటనపై వైసీపీ అవినీతి మీడియా దుష్ప్రచారానికి లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ఉంది. : ప్రత్తిపాటి “ మంత్రి నారా లోకేశ్ కొలంబో పర్యటనపై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరి తెగింపునకు పరాకాష్ట. సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. అవినీతి మీడియా తన అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. జగన్ సంతోషం కోసం... జనం మనసుల్లో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు.. సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ... సాక్షి దుష్ప్రచారాన్ని లోకేశ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అవినీతి మీడియా విషపురాతల సృష్టికర్తలకు.. లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా గట్టిగా తగిలిందనే చెప్పాలి. గతంలో లోకేశ్ పై హద్దులు మీరి చేసిన దుష్ప్రచారానికి, కోర్టుల్లో క్షమాపణలు చెప్పుకునే దుస్థితి కల్పించినా.. సాక్షి రాతల్లో మార్పురాలేదు. *రచ్చ చేయడానికే సభకు వస్తున్నారు..* వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తున్నది ప్రజాసమస్యలపై చర్చకు.. రాష్ట్రానికి మేలు చేసే అంశాలపై ప్రభుత్వానికి సలహాలు..సూచనలు ఇవ్వడానికి కాదని వారి వైఖరిని బట్టే అర్థమవుతోంది. కేవలం ఒక ఎజెండా ప్రకారం..సభను అడ్డుకోవాలి.. రచ్చ చేయాలి అన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని హెరిటేజ్ సంస్థ స్పష్టంగా ఆధారాలు బహిర్గతం చేసినా కూడా.. వైసీపీనేతలు ఆ సంస్థను బదనాం చేయడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడమే అవుతుంది. జగన్ సాగించిన కుంభకోణాలు. దోపిడీలపై కూటమిప్రభుత్వం చేపట్టిన విచారణ.. రోజురోజుకీ బయటకొస్తున్న నాటి వైసీపీ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో చర్చ జరగకూడదు.. వారి మనసుల్లో ఎక్కడా జగన్ దుర్మార్గాలు ఎస్టాబ్లిష్ అవకూడదన్న ఏకైక లక్ష్యంతోనే వైసీపీ సభ్యులు అడుగడుగునా సభా నిర్వహణకు అడ్డు తగులుతున్నారు. కల్తీ నెయ్యి స్కామ్ లో జగన్ సహా నాటి టీటీడీ పెద్దల పాత్ర ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతోనే, వైసీపీ సభ్యులు హెరిటేజ్ డెయిరీపై బురదజల్లుతున్నారు *వైసీపీ సభ్యుల తీరుపై సొంతపార్టీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నారు* పెద్దలసభను వైసీపీ సభ్యులు కావాలనే పెడదారి పట్టిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అంటున్న వైసీపీసభ్యుల ప్రవర్తనపై సొంత కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు. ఆధిపత్య భావజాలంతో తమలే తాము కలహించుకంటూ.. పెద్దల సభ గౌరవప్రతిష్టల్ని బజారుకీడుస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాల కంటే.. తమ నాయకుడి ఆదేశాలే తమకు మిన్న అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మండలి మర్యాదను మంటగలపాలన్న ఆరాటం తప్ప... ప్రభుత్వ విధానాలపై చర్చించాలన్న ఆలోచన వైసీపీసభ్యులకు లేకపోవడం విచారకరం.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

- RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.1
- గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే1
- *విజయవాడ 'మహాప్రస్థానం'లో ఉచితం మాయం.. డ్రైవర్ల ఇష్టారాజ్యం!* విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన 'మహాప్రస్థానం' సేవలు ఇప్పుడు కాసుల వేటగా మారాయి. వాహనాలపై ఉన్న 'ఉచితం' అనే అక్షరాలను చెరిపేసి, బాధిత కుటుంబాల నుంచి డ్రైవర్లు అందినకాడికి దండుకుంటున్నారు. డ్రైవర్ బేటా పేరిట ఒక్కో మృతదేహానికి 700 నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.1
- Post by Sk Noori4
- గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం SP వకుల్ జిందాల్ సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల పేరుతో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా RTOchallan.APK, echallan.APK ລ້ అనధికార లింకులు వస్తున్నాయని అన్నారు. ప్రజలు తెలియక ఈ లింకులను క్లిక్, డౌన్లోడ్ చేయడంవల్ల వారి మొబైల్ ఫోన్లు హ్యాక్కు గురవుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అవుతాయన్నారు.1