మానవత్వమే ప్రవక్త మహమ్మద్ బోధనల సారం - మిలాద్ -ఉల్ నబి పర్వదిన వేడుకల్లో మత గురువులు మదనపల్లె : మీలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం మదనపల్లె పట్టణంలోని మసీదులు, దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. “మీరు భూమిపై ఉన్నవారిపట్ల దయ చూపండి.. ఆకాశంలో ఉన్నవాడు మీపై దయ చూపుతాడు” అనే మహా ప్రవక్త బోధనను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ముస్లిం మత గురువులు పేర్కొన్నారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ప్రేమ, దయ, క్షమ, నిజాయితీ, సహనం, పేదల పట్ల శ్రద్ధ, పొరుగువారి పట్ల గౌరవం, మానవత్వంతో జీవించడాన్ని నేర్పుతుందని అన్నారు. ఆయన చూపిన మార్గాన్ని జీవితంలో ఆచరించడమే ప్రవక్తపై చూపే నిజమైన ప్రేమ అని తెలిపారు. స్థానిక బడే మకాన్‌లో దర్గా ముతవల్లి మకాన్‌దార్ సయ్యద్ హాషిం ఆధ్వర్యంలో గత 12 రోజులుగా పుస్తక పఠనం నిర్వహించి బుధవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫాతెహా నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. మీలాద్ ఉన్ నబీ వేడుకలతో మసీదులు, దర్గాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
మానవత్వమే ప్రవక్త మహమ్మద్ బోధనల సారం - మిలాద్ -ఉల్ నబి పర్వదిన వేడుకల్లో మత గురువులు మదనపల్లె : మీలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం మదనపల్లె పట్టణంలోని మసీదులు, దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. “మీరు భూమిపై ఉన్నవారిపట్ల దయ చూపండి.. ఆకాశంలో ఉన్నవాడు మీపై దయ చూపుతాడు” అనే మహా ప్రవక్త బోధనను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ముస్లిం మత గురువులు పేర్కొన్నారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి
వసల్లం జీవితం ప్రేమ, దయ, క్షమ, నిజాయితీ, సహనం, పేదల పట్ల శ్రద్ధ, పొరుగువారి పట్ల గౌరవం, మానవత్వంతో జీవించడాన్ని నేర్పుతుందని అన్నారు. ఆయన చూపిన మార్గాన్ని జీవితంలో ఆచరించడమే ప్రవక్తపై చూపే నిజమైన ప్రేమ అని తెలిపారు. స్థానిక బడే మకాన్‌లో దర్గా ముతవల్లి మకాన్‌దార్ సయ్యద్ హాషిం ఆధ్వర్యంలో గత 12 రోజులుగా పుస్తక పఠనం నిర్వహించి బుధవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫాతెహా నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. మీలాద్ ఉన్ నబీ వేడుకలతో మసీదులు, దర్గాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1