Shuru
Apke Nagar Ki App…
ఫేర్‌వెల్ డే కార్యక్రమంలో సర్పంచ్ బసాకే పుల్లాబాయి సన్మానం కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ టౌన్‌లోని సర్ సిల్క్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఫేర్‌వెల్ డే కార్యక్రమంలో కోసిని గ్రామ సర్పంచ్ బసాకే పుల్లాబాయిని ఉపాధ్యాయ బృందం సన్మానించింది. పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Krishna
ఫేర్‌వెల్ డే కార్యక్రమంలో సర్పంచ్ బసాకే పుల్లాబాయి సన్మానం కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ టౌన్‌లోని సర్ సిల్క్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఫేర్‌వెల్ డే కార్యక్రమంలో కోసిని గ్రామ సర్పంచ్ బసాకే పుల్లాబాయిని ఉపాధ్యాయ బృందం సన్మానించింది. పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సిర్పూర్ టౌన్: సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఒక టీనేజ్ అమ్మాయికి టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14–15 సంవత్సరాల టీనేజ్ అమ్మాయిలు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని, దీంతో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలో కంప్యూటరైజ్డ్ ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- कोमुरम भीम असिफाबाद जिला//असिफाबाद शहर के बीच में बंदरों का आतंक कॉलोनी के लोग डरे हुए हैं क्योंकि बंदर लोगों के घरों में घुस रहे हैं। पहले भी बच्चों और लोगों पर हमला करके उन्हें घायल करने की घटनाएं हुई हैं। कॉलोनी के लोग संबंधित अधिकारियों से कार्रवाई करने की रिक्वेस्ट कर रहे हैं।1
- జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో రైల్వే అధికారులు కొలనూరును సందర్శించినప్పుడు స్వయంగా వారితో కలిసి ఆన్‌సైట్ పరిశీలన నిర్వహించి, ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. మొదట రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే మంజూరు ఇచ్చి, ఓదేలుకు సాధ్యం కాదని తెలిపినా.. ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు వివరించారు. ముఖ్య అంశాలు: నిరంతర పోరాటం: రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కొలనూరు ఆర్ఓబీని రైల్వే శాఖ స్వంత ఖర్చులతో నిర్మించడానికి అంగీకరించింది. ఓదేలుపై హామీ: కొలనూరు తరహాలోనే ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం: ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కొలనూరు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వంశీకృష్ణ, త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.1
- అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ – పార్లమెంట్‌లో ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ ప్రజల సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి.ర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95, 96 ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడం రాజ్యాంగానికి అవమానమని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా దళితులు మరియు బలహీన వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుని పార్లమెంట్‌కు పంపించినప్పటికీ, వారి గొంతును వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను పలుమార్లు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై మాట్లాడే సమయంలో కూడా మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను ఒక పార్టీ సభలా మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.1
- ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ రాజ్యసభ సభ్యులుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।1