Shuru
Apke Nagar Ki App…
పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వైద్య సేవలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, సిబ్బంది పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పేషంట్లతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
KUMAR
పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వైద్య సేవలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, సిబ్బంది పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పేషంట్లతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
More news from తెలంగాణ and nearby areas
- మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గేష్, సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ఇద్దరు యువతులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మోసంలో దుర్గేష్ బాధితుల నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విలాసవంతమైన జీవితం, జల్సాలకు అలవాటు పడిన దుర్గేష్, సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాలను అవకాశంగా మార్చుకున్నాడు. ఈ పరిచయాలను నమ్మకంగా మార్చుకుని, వివిధ అవసరాల పేరుతో యువతుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణ చేపట్టిన సీఐ రేణుక రెడ్డి, నిందితుడు రూ.12 లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారించారు. బాధిత యువతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దుర్గేష్‌ను అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రేణుక రెడ్డి వెల్లడించారు. ఈ సంఘటన నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు లావాదేవీల విషయంలో పూర్తిస్థాయి నిర్ధారణ చేసుకోవాలని హెచ్చరించారు.1
- మొహర్రం పండుగను దృష్టిలో ఉంచుకొని ఘాజీపూర్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తంగా ఉంది. ఈ నేపథ్యంలో, SP డాక్టర్ ఇరాజ్ రాజా IPS శాంతి కమిటీకి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు.1
- యాదగిరిగుట్ట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌కు వెళ్లే దారిలో సరైన రోడ్డు లేదని, వెంటనే దాని నిర్మాణం చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలపై చేపట్టిన సర్వేలో భాగంగా శనివారం స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌ను ఆయన సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, మున్సిపల్ కేంద్రంలో ఉన్న ఈ హైస్కూల్‌లో 220 మంది విద్యార్థులు చదువుతున్నారని, అయితే పాఠశాలకు వెళ్లడానికి రాళ్ల రోడ్డు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్డు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, స్కూల్‌లో నైట్ వాచ్‌మెన్, అటెండర్ పోస్టులు రెండూ ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులు వర్షాలు వచ్చినప్పుడు బయట వంటలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని, అందుకోసం అదనంగా రేకుల షెడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు. గుడ్డుకు ప్రభుత్వం ఐదు రూపాయలు ఇస్తుండగా, ప్రస్తుతం మార్కెట్‌లో దాని ధర ఏడు రూపాయలకు పైగా ఉందని, ఇది మధ్యాహ్న భోజన కార్మికులపై భారం మోపుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా, మధ్యాహ్న భోజన విద్యార్థుల మెనూ చార్జీలను 14 రూపాయల 17 పైసల నుంచి 30 రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సర్వే కార్యక్రమంలో సీపీఎం నాయకులు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎస్కే షరీఫ్, సీపీఎం పట్టణ నాయకులు ఈశ్వర్ రెడ్డి, సీస శ్రీను, నల్ల జానయ్య తదితరులు పాల్గొన్నారు.1
- ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్, ఏఐసీసీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, అలాగే కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నుండి ఐదుగురు ఎమ్మెల్యేలు, నలుగురు చైర్మన్లు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. తాను అపాయింట్‌మెంట్ అడిగినా సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదని, సెక్రటేరియట్ గేట్లు కూడా తనకు తెరవడం లేదని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి శిష్యుడిని చంపేశారని, అందుకే మనస్పర్థల కారణంగా జీవన్ రెడ్డి వెళ్లిపోయారని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని 'అమ్మనా బూతులు' తిట్టినా ఎవరూ ఏమీ అనరని, కానీ బీసీ, మైనారిటీ నాయకులు అయితే మాత్రం నోటీసులు ఇస్తారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కంటే మహేష్ కుమార్ గౌడ్ గొప్పవారని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఎంపీ స్థానం మల్కాజ్‌గిరి సీటును, అలాగే సొంత నియోజకవర్గం కొడంగల్‌కు చెందిన మహబూబ్‌నగర్ ఎంపీ సెగ్మెంట్ సీటును కూడా గెలిపించుకోలేకపోయారని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కావడం వల్లే అతడిని అరెస్ట్ చేయడానికి పది రోజులు లేటు చేశారని, అదే సామాన్యుడు అయితే వెంటనే అరెస్ట్ చేసేవారని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమను తక్కువ చేస్తే 'సైకిల్ కాంగ్రెస్ కొడుకులను తొక్కుతాం' అంటూ ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు.1
- కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ రేఖ చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేఖ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 21వ డివిజన్‌లోని శ్రీనివాస్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న జిల్లా పరిషత్ ఉద్యోగి రవీందర్ గౌడ్ ఇంట్లోకి ఈ సాయంత్రం రసల్స్ వైపర్ అనే విషపూరిత పాము ప్రవేశించి ఓ సందులో దాక్కుంది. వెంటనే రవీందర్ గౌడ్ ఈ విషయాన్ని మహబూబ్నగర్ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ లోకేష్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న లోకేష్ వెంటనే అక్కడికి చేరుకొని, తన నైపుణ్యంతో విషపూరిత రసల్స్ వైపర్ (రక్తపింజర) పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో రవీందర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.1
- మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శనివారం అమ్మవారిని బ్రతకంగా ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు, ప్రత్యేక మంగళహారతిని కూడా సమర్పించారు.1
- హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నానక్రామ్‌గూడలో అమెరికా కాన్సులేట్ ప్రాంతానికి వెళ్లే రహదారికి మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడంపై సీఐటీయూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పేరును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ, సీఐటీయూ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్‌లో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం మాట్లాడుతూ, అమెరికా సామ్రాజ్యవాద విధానాలను మరియు భారతదేశంపై విధిస్తున్న ఆంక్షలను తీవ్రంగా విమర్శించారు. భారత ప్రజల ఆత్మగౌరవానికి విరుద్ధంగా విదేశీ నాయకుల పేర్లను ప్రజా రహదారులకు పెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే పేర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసనలో పాల్గొన్న నాయకులు డోనాల్డ్ ట్రంప్ పేరును తొలగించి, ఆ రహదారులకు భారతీయ మహనీయుల పేర్లను నామకరణం చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.1
- ఫరూఖాబాద్‌లో విజిలెన్స్ బృందం పెద్ద చర్య తీసుకుంది. ₹24,000 లంచం తీసుకుంటుండగా ఒక మైనింగ్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు.1