Shuru
Apke Nagar Ki App…
పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.
Anji
పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.
More news from Telangana and nearby areas
- తెలంగాణ విముక్తితో ఈ ప్రాంత ప్రజలకు ప్రశాంతత లభించింది. తెలంగాణ విముక్తి కోసం ఎంతోమంది ఎంతోమంది పోరాటం చేసి నైజాం సర్కార్ నుంచి విముక్తి కల్పించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణకు విముక్తి పొందిన రోజుగా వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాధవరెడ్డి వడ్ల నందు రాజేందర్రెడ్డి సతీష్ వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు1
- సాసనూల్ గ్రామ పంచాయతీ లొ మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సర్పంచ్ రేణుక గారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం నవాబుల పాలకుల నుంచి విముక్తి లభించింది ఎంతోమంది అమర వీరులు త్యాగాలతో హైదరాబాదు నగరాన్ని తెలంగాణలో విలీనం అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ త్యాగ పుణ్యమే ఈరోజు పునాది స్వచ్ఛ భారత్ జెండా ఆవిష్కరణ జరుపు కుంటున్న 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించింది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటు న్నాం సర్పంచ్ రేణుక బిసన్న గారు జి పి ఓ గారు తెలిపారు పంచాయతీ కార్యదర్శి విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశుద్ధ కార్మికులు చరణ్ సిద్దు గ్రామ పెద్దలు పాల్గొన్నారు4
- సదాశివపేట: సదాశివపేట సామాజిక ఆసుపత్రిలో మూడు 108 అంబులెన్స్ ల ఏర్పాటు..! సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన ఫుడ్ పాయిజన్ లో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని సదాశివపేట, సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.వారిని సంగారెడ్డి జిల్లా డిఎం & హెచ్ఓ లలితాదేవి పర్యవేక్షించి విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు.అదేవిధంగా డిఎం & హెచ్ఓ ఆదేశాల మేరకు సదాశివపేట సామాజిక ఆసుపత్రి నందు ముందస్తు చర్యగా మూడు 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ తెలిపారు.1
- తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం... బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!1
- తెలంగాణ దొంగలు YouTube ఛానల్, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన BRSV కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీడియోలు ప్రచారం చేస్తున్నారని, ఆ ఛానల్లను బ్లాక్ చేసి వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు1
- అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.1
- సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.1
- సాసనూల్ గ్రామం ప్రాథమిక ఉన్నంత పాఠశాల ముగిసిన నిజాం పాలన ఇండియన్ యూనియన్ విలీనం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘటనాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గారు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు పంచాయతీ సెక్రటరీ గారు జిపిఓ గారు చరణ్ గారు సిద్దు గారు అంగన్వాడీ టీచర్ గారు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు4
- జాతీయ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి...సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్... జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్మరించుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని, కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి , విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మాజీ జేపీటీసీ కొండల్ రెడ్డి, మనోహర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, చక్రపాణి , రామప్ప , కౌన్సిలర్ లు సర్పంచ్ లు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.1