ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..... పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ వేడుకల్లో బుధవారం పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె పాణ్యం మండలంలోని NH-40 నుంచి దుర్వేసి బాట వరకు రూ.6.39 లక్షలతో నిర్మించిన రహదారిని,అహల్యాపురం గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి, రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రహదారులను మరియు అనుపూరు గ్రామంలో రూ.5.30 లక్షలతో పూర్తిచేసిన త్రాగు నీటి పైపు లైన్ పనులకు ప్రారంభోత్సవం చేశాను.అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని,ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని,ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..... పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ వేడుకల్లో బుధవారం పాణ్యం నియోజకవర్గ
ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె పాణ్యం మండలంలోని NH-40 నుంచి దుర్వేసి బాట వరకు రూ.6.39 లక్షలతో నిర్మించిన రహదారిని,అహల్యాపురం
గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి, రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రహదారులను మరియు అనుపూరు గ్రామంలో రూ.5.30 లక్షలతో పూర్తిచేసిన త్రాగు నీటి పైపు లైన్ పనులకు ప్రారంభోత్సవం చేశాను.అనంతరం ఆమె
మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని,ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని,ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.2
- మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు1
- గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.1