*పదవ తరగతి విద్యార్థులకు పరిక్షలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఐడిసి డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని* ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కేంద్రము లోని శాగం శివరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల అనగా మార్చి 16 వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి స్ఫూర్తితో సుమారు 70 మంది విద్యార్థులకు పరిక్షలకు అవసరమైన ప్యాడ్, పెన్నులు, జామెట్రీ బాక్స్ తదితర వస్తువులను రాష్ట్ర ఇరిగేషన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని గారు మరియు పాఠశాల పూర్వ విద్యార్థి తమ్మిశెట్టి దుర్గారావు గారితో కలిసి అందజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత స్థానాలకు వెళ్లడానికి పదవ తరగతి మెదటి అడుగు, కావున విద్యార్ధులు అందరూ పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు, అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తో కలిసి హాల్ టికెట్ విద్యార్థులకు అందజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.

- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని, వారిని ఇబ్బందులకు గురిచేయకూడదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కాటారం మండలం ధన్వాడలోని తన స్వగృహంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు.1
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఐదు జిల్లాల నుంచి సుమారు లక్ష మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికల కోసం కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి కాటారం, మహాదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- Post by Bondhu Suresh1