శ్రీశైలం దేవస్థానం గోకులంలో శాస్త్రోక్తంగా గోపూజ. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఉదయం ఆలయ ప్రాంగణంలోని గోకులంలో గోపూజను నిర్వహించింది. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతః కాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ, కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిత్యసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించబడింది. శాస్త్రోక్తంగా జరుపబడిన ఈ గోపూజలో ముందుగా ఆలయప్రాంగణంలోని గోకులములో గోవులకు, గోవత్సాలకు (ఆవుదూడలకు) పూజాదికాలు జరిపించబడ్డాయి. ఈ విశేష కార్యక్రమములో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు పూజాసంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పములో సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, పాడిపంటలతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, అందరికి శ్రేయస్సు కలగాలని చెప్పబడింది. ఆ తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకుగాను ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఉపచారాలతో అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తరమంత్రంతోనూ, గోవులకు షోడశ పూజాదికాలు జరిపించబడ్డాయి. చివరగా గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడ్డాయి. తరువాత దేవస్థాన గో సంరక్షణశాలలో కూడా కృష్ణుని పూజ, గో పూజ జరిపించబడ్డాయి. మన వేదసంస్కృతిలో గోవుకు ఎంతో విశేషస్థానం ఉంది. మన వేదాలు ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు మొదలైనవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయి. గోవు సకల దేవతలకు ఆవాస స్థానం కావడం చేత గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గోపూజను ఆచరించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా జగన్మాత లలితాపరమేశ్వరి గోవురూపంలో భూమిపై సంచరిస్తుందని చెప్పబడుతోంది. కాగా తాను చేసిన ప్రతిపనిలోనూ వైశిష్ట్యాన్ని బోధించిన కృష్ణపరమాత్మ ఆవుల మంద అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన వ్రేపల్లెలో పెరిగి గోవులను కాసి, గోపాలునిగా పేరుగాంచి, గోవుయొక్క అనంత మహిమను లోకానికి తెలియజేశాడు. ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సంప్రదాయం అయింది. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుదంపతులు, అర్చకస్వాములు, వేదపండితులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Post by Omnamashivaya S1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by KLakshmi Devi1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Ravi Poreddy1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1