విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణిస్తే విశ్వ విజేతలుగా అవుతారు – ప్రిన్సిపల్ బాలస్వామి అచ్చంపేట, ఏప్రిల్ 03(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ) నాగర్‌కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ఈరోజు ఉదయం అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎంపికలు ఈనెల 11 మరియు 12 తేదీలలో హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగబోయే తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ కప్ అండర్-20 బాల బాలికలు, మెన్ మరియు ఉమెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయడానికి నిర్వహించబడ్డాయి. జిల్లా నలుమూలల నుండి దాదాపు 150 మందికి పైగా క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొన్నారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ బాలస్వామి గారు జెండా ఊపి ఎంపికలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచే క్రీడల్లో పాల్గొంటూ రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబరచి విశ్వ విజేతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, వారు సాధించే ప్రశంసాపత్రాలు, పతకాలు జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. పోటీల్లో ఓడిపోయిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరింత కృషి చేస్తే తమ లక్ష్యాలను సాధించి సమాజంలో మంచి గుర్తింపు పొందగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు, ఫిజికల్ డైరెక్టర్ బాలయ్య, వాలీబాల్ కోచ్ శివ, పీఈటీలు జ్యోతి, రాజేందర్, మల్లేష్, దాసరి అంజయ్య, నిరంజనమ్మ, కృష్ణవేణి, పద్మజతో పాటు క్రీడాకారుల తల్లిదండ్రులు మరియు క్రీడాభిమానులు పాల్గొన్నారు.

- ప్రేమ, విశ్వాసం కోసం పరుగులు… ఈ సందేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి..?1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా phone pay number:- 7207217664 Name :- Sai kumar1
- ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేత పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట రైతు వేదికలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.*సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు* ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనిమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం చిన్న శంకరంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 88 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు. అలాగే నార్సింగ్ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులు20, చిన్నశంకరంపేట మండలంకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు 50 మందికి, నార్సింగి మండలంకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా ఇల్లు రానిక రాలేక పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు సొంతింటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.1
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- Post by Tagore1
- Post by K AMPAIAH ACHARI1
- నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. పాఠశాలలో సదుపాయాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.1