ఈనెల 27న,28న పెద్ద చింతరేవుల దేవాలయ ఆవరణలో ప్రత్యేక యాగపూజలు, వరలక్ష్మి వ్రతాలు.... *పత్రికా ప్రకటన 26-08-2026.* 27న ఉడిపి పాలిమర్ పీఠాధిపతి శ్రీ1008 శ్రీ విద్యా దిశ శ్రీపాదుల వారి 70వ జన్మదినోత్సవ యాగ పూజలు 28న శ్రావణ పౌర్ణమి నాడు వరలక్ష్మీ వ్రతాలు, రక్షాబంధన్. ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్య చక్రవర్తి కేశవ చార్యులు* జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని జూరాల డ్యాం సమీపం పెద్ద చింతరేవుల దేవాలయ ప్రాంగణంలోనీ శ్రీ ఆంజనేయస్వామి అన్నప్రసాద ట్రస్ట్ భవనంలో ఈనెల 27న, 28న గురు,శుక్రవారాలలో ప్రత్యేకంగా యాగాలు, హోమాలు, వరలక్ష్మి వ్రతాలు పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు. ఉడిపి పాలిమర్ మఠం పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాదిశ శ్రీపాదుల వారు యొక్క 70వ వసంతాల జన్మదినోత్సవ శాంతి యాగం ,ఇతర పూజలు ఉదయం 9గంటల నుండి ఉడిపి వేద పండితులచే శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈనెల 28న శుక్రవారం శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొనీ ఉడిపి పాలిమార్ పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాదిశ శ్రీపాదుల వారు, శ్రీ 1008 విద్యా రాజేశ్వర శ్రీపాదలవారు సన్నిధిలో వరమహాలక్ష్మి (వరలక్ష్మి) వ్రతాలు, యజుర్వేద ఉపకర్మ, హయాగ్రీవ స్వామి జయంతి ఉత్సవం, యజ్ఞోపవీతధారణ, రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి ప్రవీతో పావనం, పీఠాధిపతుల చే భక్తులకు ఆశీర్వచనం, పీఠాధిపతులకు పాద పూజలు, ప్రతిరోజు నిర్వహించే నవగ్రహ హోమాలు, పవన హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి అన్నప్రసాద ట్రస్ట్ వారిచే అన్న ప్రసాద వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పై పూజలలో భక్తులు స్వయంగా పాల్గొనుటకు సెల్ నెంబర్ 9959251123, 9949789241, 9440807109, 9440770020, లలో సంప్రదించవచ్చునని తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయస్వామి స్వామివారి కృపా కటాక్షాలు, పీఠాధిపతుల ఆశీర్వచనం పొందాలని ఆయన కోరారు.
ఈనెల 27న,28న పెద్ద చింతరేవుల దేవాలయ ఆవరణలో ప్రత్యేక యాగపూజలు, వరలక్ష్మి వ్రతాలు.... *పత్రికా ప్రకటన 26-08-2026.* 27న ఉడిపి పాలిమర్ పీఠాధిపతి శ్రీ1008 శ్రీ విద్యా దిశ శ్రీపాదుల వారి 70వ జన్మదినోత్సవ యాగ పూజలు 28న శ్రావణ పౌర్ణమి నాడు వరలక్ష్మీ వ్రతాలు, రక్షాబంధన్. ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్య చక్రవర్తి కేశవ చార్యులు* జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని జూరాల డ్యాం సమీపం పెద్ద చింతరేవుల దేవాలయ ప్రాంగణంలోనీ శ్రీ ఆంజనేయస్వామి అన్నప్రసాద ట్రస్ట్ భవనంలో ఈనెల 27న, 28న గురు,శుక్రవారాలలో ప్రత్యేకంగా యాగాలు, హోమాలు, వరలక్ష్మి వ్రతాలు పూజలు నిర్వహిస్తున్నట్లు
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు. ఉడిపి పాలిమర్ మఠం పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాదిశ శ్రీపాదుల వారు యొక్క 70వ వసంతాల జన్మదినోత్సవ శాంతి యాగం ,ఇతర పూజలు ఉదయం 9గంటల నుండి ఉడిపి వేద పండితులచే శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈనెల 28న శుక్రవారం శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొనీ ఉడిపి పాలిమార్ పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాదిశ శ్రీపాదుల వారు, శ్రీ 1008 విద్యా రాజేశ్వర శ్రీపాదలవారు సన్నిధిలో వరమహాలక్ష్మి (వరలక్ష్మి) వ్రతాలు, యజుర్వేద ఉపకర్మ, హయాగ్రీవ స్వామి
జయంతి ఉత్సవం, యజ్ఞోపవీతధారణ, రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి ప్రవీతో పావనం, పీఠాధిపతుల చే భక్తులకు ఆశీర్వచనం, పీఠాధిపతులకు పాద పూజలు, ప్రతిరోజు నిర్వహించే నవగ్రహ హోమాలు, పవన హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి అన్నప్రసాద ట్రస్ట్ వారిచే అన్న ప్రసాద వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పై పూజలలో భక్తులు స్వయంగా పాల్గొనుటకు సెల్ నెంబర్ 9959251123, 9949789241, 9440807109, 9440770020, లలో సంప్రదించవచ్చునని తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయస్వామి స్వామివారి కృపా కటాక్షాలు, పీఠాధిపతుల ఆశీర్వచనం పొందాలని ఆయన కోరారు.
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.2
- నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు *ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం *గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.* *ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.* *ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.1
- నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం. కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.1
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1