సెప్టెంబర్ 16, 2026_ఆదిలాబాదు: *ఆధునిక రుగ్మతలకు చిరుధాన్యాలే ఔషధం: కలెక్టర్ రాజర్షిషా* *సిరికొండలో ఘనంగా ‘ఆదివాసీ ఆహార వైభవం’* పత్రిక ప్రకటన ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. బుధవారం సిరికొండ మండలం నారాయణపూర్‌లో ఆర్‌పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ ఆహార వైభవం’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని, నేటి ఆధునిక జీవనశైలిలో తలెత్తుతున్న పలు అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే మళ్లీ సంప్రదాయ ఆహార విధానాల వైపు మళ్లక తప్పదని అన్నారు. మన పూర్వీకులు అందించిన సహజసిద్ధమైన ఆహార ధాన్యాలు, చిరుధాన్యాల వినియోగంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. సుస్థిర భవిష్యత్తు కోసం పర్యావరణహిత సేంద్రీయ సాగును, మిల్లెట్ల ఉత్పత్తిని పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల విలక్షణ జీవన సంస్కృతిని, బలవర్ధక ఆహారాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తూ, గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్‌పీజీ ఫౌండేషన్ బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ ఫెస్టివల్’ స్టాల్ లను కలెక్టర్ సందర్శించి, స్థానిక చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో రూపొందించిన పోషకాలతో కూడిన వంటకాల వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ఉద్యానవన శాఖ అధికారి సందీప్ కుమార్, ఆర్‌పీజీ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీకర్‌రెడ్డి, తెలంగాణ ప్రోగ్రామ్ అధికారి జి.రవికుమార్, స్థానిక సర్పంచ్ విమలాబాయి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పరిసర గ్రామాల రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Post by Shaikshada1
- ప్రజా పోరాటం, త్యాగాలకు ప్రతీక సెప్టెంబర్ 17 : శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని జాతి నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక దినమన్నారు. నిజాం పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం, చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్ణయాత్మక నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన చరిత్ర కేవలం ఒక తేదీ కాదని, ప్రజల పోరాటం, త్యాగం, స్వాభిమానం, జాతీయ సమైక్యతకు ప్రతీక అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ చరిత్రను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. రెండేళ్ల ప్రజాపాలన ప్రస్థానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవాన్ని అందిస్తూ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ గ్రేడ్ సెక్షన్ ఆఫీసర్ విట్టల్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లాలోని మహా గణనాథుడిని దర్శించుకున్న భక్తులు! ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా మండల్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 52 అడుగుల భారీ గణనాథుడిని గురువారం జిల్లా ప్రజలు పెద్దఎత్తున దర్శించుకున్నారు. అత్యంత వైభవంగా వెలసిన ఈ భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.1
- విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలీ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ . తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒకరు ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండి, పొదుపును పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి ఒకరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. ........... నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యంమని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.1
- ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.1
- జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ADB: పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షాతో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.1