డీజే నిషేధ నిబంధనల ఉల్లంఘనపై కేసు – డీజే సామగ్రి సీజ్ 🔹 వజ్జేపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డీజే నిర్వహణ డీజే నిషేధ నిబంధనల ఉల్లంఘనపై కేసు – డీజే సామగ్రి సీజ్ 🔹 వజ్జేపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డీజే నిర్వహణ 🔹 నిర్వాహకులు, డీజే యజమాని, ఆపరేటర్‌పై కేసు నమోదు 🔹 డీజే వాహనం, ఇతర సామగ్రి సీజ్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజ్జేపల్లి గ్రామంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. డీజే నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీస్ శాఖ సూచనలు మరియు నిబంధనలను ఇప్పటికే స్పష్టంగా తెలియజేసినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ Dhagad యూత్ ఆధ్వర్యంలో డీజే నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధిత నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా డీజే యజమాని మరియు ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేసి, డీజేకు సంబంధించిన వాహనం మరియు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సామగ్రి 1. Eicher Vehicle – TS12EH6901 2. 1500W Bass – 1 3. 6HF Top Speakers – 1 4. Amplifiers – 3 5. 20 KVA Generator – 1 6. Trust Stand – 1 7. Mixer – 1 8. Lenovo Laptop – 1 నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మరియు పోలీస్ శాఖ సూచనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సదాశివనగర్ పోలీసులు తెలిపారు. ప్రజల శాంతి, భద్రత మరియు ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు డీజే నిషేధ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. “సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. శాంతియుత వాతావరణం కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి.”
డీజే నిషేధ నిబంధనల ఉల్లంఘనపై కేసు – డీజే సామగ్రి సీజ్ 🔹 వజ్జేపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డీజే నిర్వహణ డీజే నిషేధ నిబంధనల ఉల్లంఘనపై కేసు – డీజే సామగ్రి సీజ్ 🔹 వజ్జేపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డీజే నిర్వహణ 🔹 నిర్వాహకులు, డీజే యజమాని, ఆపరేటర్‌పై కేసు నమోదు 🔹 డీజే వాహనం, ఇతర సామగ్రి సీజ్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజ్జేపల్లి గ్రామంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. డీజే నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీస్ శాఖ సూచనలు మరియు నిబంధనలను ఇప్పటికే స్పష్టంగా తెలియజేసినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ Dhagad యూత్ ఆధ్వర్యంలో డీజే నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధిత నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా డీజే యజమాని మరియు ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేసి, డీజేకు సంబంధించిన వాహనం మరియు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సామగ్రి 1. Eicher Vehicle – TS12EH6901 2. 1500W Bass – 1 3. 6HF Top Speakers – 1 4. Amplifiers – 3 5. 20 KVA Generator – 1 6. Trust Stand – 1 7. Mixer – 1 8. Lenovo Laptop – 1 నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మరియు పోలీస్ శాఖ సూచనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సదాశివనగర్ పోలీసులు తెలిపారు. ప్రజల శాంతి, భద్రత మరియు ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు డీజే నిషేధ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. “సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. శాంతియుత వాతావరణం కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి.”
- జుక్కల్ రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గళం జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఉద్యానవన రైతుల సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలో బొప్పాయితో పాటు వివిధ రకాల ఉద్యానవన పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తున్న నేపథ్యంలో, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల పంటలకు మెరుగైన ధరలు లభించేలా అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, గ్రేడింగ్–ప్యాకింగ్ కేంద్రాలు, మార్కెట్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గానికి కీలకమైన లెండి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా కోరారు.1
- ఆవాస్ యోజన ఇండ్లపై ప్రధాని మోడీ పేరు ఉండాలి : ఎంపీ రఘునందన్ రావు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేటాయించిందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.2 లక్షల చొప్పున నిధులు అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఇళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఉన్న ఆవాస్ యోజన పథకం చిహ్నాన్ని తప్పనిసరిగా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అందిస్తున్న నిధుల వివరాలను ప్రజలకు తెలిసేలా పథకం గుర్తును ఇళ్లపై ఏర్పాటు చేయాలని కోరారు.1
- ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్... నిర్మల్ జిల్లా // బాసర గుడిసె లేని బాసర నా కల.. ఆ కలను నిజం చేసే బాధ్యత నాది... సొంతింటి కలను కాంగ్రెస్ నిజం చేస్తుంది.. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం : సర్పంచ్ వెంకటేష్ గౌడ్.... బాసర లోని గ్రామ పంచాయతీ భవనం లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్, స్థానిక నాయకులు..... ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు...: *సర్పంచ్ వెంకటేష్ గౌడ్* పాల్గొన్న ఈవో ప్రసాద్ గౌడ్.. ఉపసర్పంచ్ సయ్యద్ అలీ, వార్డ్ మెంబర్ లు కృష్ణ, ఫసి, అన్నెల లక్ష్మణ్, ఏజాస్, సాయిలు, ఫారుక్, అశోక్, నాయకులు షానవాజ్...1
- రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.4
- చరిత్ర పురుషుడు అంబేద్కర్ ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న పుస్తకం. చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం అని అన్నారు. చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్ లు పాల్గొన్నారు1
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, *సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి..* 🚩బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, ▪️కానీ గత ప్రభుత్వాలు ఏంఐఎం నాయకులకు లొంగిపోయి, కేవలం ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ వేడుకలను జరపలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వంసెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేసారు. 🔸బుధవారం నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్ఓ రాథోడ్ రమేష్ గారికి బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. 🔸 *1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందితే.. అందులో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్నా, ఇక్కడ మాత్రం జరపకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సెప్టెంబర్ 17న విముక్తి దినం జరపాలని డిమాండ్ చేస్తూ లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు బీజేపీ చేసిన పోరాటం, డిమాండ్ మేరకు.. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను సగర్వంగా ఎగురవేద్దామని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిసేమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ బుర్ర,కౌన్సిలర్ ధర్మాజీ గారి ఈశ్వర్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ తోకల అనిల్, నాయకులు విజయ్ కుమార్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.1
- 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతి -ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరుతూ మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం1
- నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.1
- ఇస్లాంపూర్ తండాలో చిరుత కలకలం.. లేగ దూడ మృతి, చిరుతను పట్టుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన సర్పంచ్ తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మంగళవారం రాత్రి పొలం వద్ద కట్టేసిన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి తెలిపారు. తండాకు చెందిన లంబాడి రాజు పొలం వద్ద పశువులను కట్టేసి ఉంచగా, సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో లేగ దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. దీంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులు, తండావాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించి, దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సర్పంచ్ కోరారు.1